సెన్సార్ బోర్డ్‌లో బ్యాన్.. నేరుగా ఓటీటీలోకి తెలుగు సినిమా | Evol Movie Telugu OTT Release Date Details | Sakshi
Sakshi News home page

బోల్డ్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aug 12 2024 6:37 PM | Updated on Aug 12 2024 6:57 PM

Evol Movie Telugu OTT Release Date Details

చిన్న సినిమాలకు ఎప్పుడూ ఇ‍బ్బందులే! వీటికి థియేటర్లే సరిగా దొరకవు. ఒకవేళ దొరికినా సరే పూర్ కంటెంట్ వల్ల వచ్చిన రోజే మాయమైపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం కాంట్రవర్సీలతో ఫేమస్ అయి ప్రేక్షకుల దృష్టిలో పడుతుంటాయి. అలా సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్న ఓ తెలుగు సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ)

ఇంగ్లీష్‌లో లవ్ అనే పదాన్ని తిరగేసి రాస్తే 'ఎవోల్' అని వస్తుంది. ఇదే టైటిల్‌తో రామ్ వెలగపూడి అనే దర్శకుడు ఓ సినిమా తీశాడు. జూలైలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. దీంతో ఓటీటీ మార్గం పట్టారు. ఆహా ఓటీటీలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

'ఎవోల్' సినిమా రెండు జంటల మధ్య జరిగే స్టోరీతో తెరకెక్కించారు. అందరూ కొత్త ఆర్టిస్టులే. గతేడాది డిసెంబరులో ట్రైలర్ రిలీజ్ చేశారు. నెల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. కానీ సెన్సార్ అడ్డంకులు ఎదురవడంతో ఇప్పుడు ఓటీటీ రూటులోకి వచ్చేశారు. మరి బోల్డ్ అంటున్నారు అంటే ఎలా సినిమా ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే ఓ మూడు రోజులు ఆగాల్సిందే?

(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement