EVOL Movie
-
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఈసారి ఆగస్టు 15, శ్రావణ శుక్రవారం లాంటివి కలిసి రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇందుకు తగ్గట్లే థియేటర్లలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఆయ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిపై బజ్ బాగానే ఉంది. కానీ ఓటీటీల్లో కూడా ఈ వారాంతంలో దాదాపు 18 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: పేపర్ టీ కప్ కాంట్రవర్సీలో 'తంగలాన్' డైరెక్టర్)ఓటీటీల్లో ఈ వీకెండ్ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. చాలావరకు ఇంగ్లీష్ హిందీ సినిమాలే కనిపిస్తున్నాయి. ఎవోల్, ఓ మంచి ఘోస్ట్ లాంటి తెలుగు మూవీస్ ఉన్నాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ అందరూ కలిసి నటించిన 'మనో రథంగల్' అనే ఆంథాలజీ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. దిగువన లిస్టులో ఉన్న సినిమాలన్నీ గురువారం రిలీజ్ కాబోతున్నాయి. శుక్రవారం, శనివారం వచ్చేవాటికి ఆయా తేదీలు ఉన్నాయి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్నెట్ఫ్లిక్స్ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 - ఇంగ్లీష్ సిరీస్కెంగన్ అసుర సీజన్ 2 - జపనీస్ సిరీస్ద యూనియన్ - ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 16)లవ్ నెక్స్ట్ డోర్ - కొరియన్ సిరీస్ (ఆగస్టు 17)ఆహాఓ మంచి ఘోస్ట్ - తెలుగు మూవీవేర మారి ఆఫీస్ 2 - తమిళ వెబ్ సిరీస్ఎవోల్ - తెలుగు సినిమా (ఆగస్టు 16)కొంజమ్ పెసినాల్ ఎన్న - తమిళ మూవీ (ఆగస్టు 16)అమెజాన్ ప్రైమ్జాక్ పాట్ - ఇంగ్లీష్ సినిమాఫెర్ఫెక్ట్ వెర్పాస్ట్ - జర్మన్ సిరీస్వాస్కోడి గామా - తమిళ మూవీ (ఆగస్టు 16)యే మేరీ ఫ్యామిలీ సీజన్ 4 - హిందీ సిరీస్ (ఆగస్టు 16)హాట్స్టార్మై ఫర్ఫెక్ట్ హస్బెండ్- ఆగస్టు 16జియో సినిమాబెల్ ఎయిర్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (ఆగస్టు 16)జీ5మనో రథంగల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్కంటాయే కంటాయే -హిందీ సినిమాసోనీ లివ్చమక్: ది కంక్లూజన్- హిందీ మూవీ (ఆగస్టు 16)బుక్ మై షోడిస్పకబుల్ మీ 4 - ఇంగ్లీష్ సినిమా (ఆగస్టు 16)(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ) -
సెన్సార్ బోర్డ్‌లో బ్యాన్.. నేరుగా ఓటీటీలోకి తెలుగు సినిమా
చిన్న సినిమాలకు ఎప్పుడూ ఇబ్బందులే! వీటికి థియేటర్లే సరిగా దొరకవు. ఒకవేళ దొరికినా సరే పూర్ కంటెంట్ వల్ల వచ్చిన రోజే మాయమైపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం కాంట్రవర్సీలతో ఫేమస్ అయి ప్రేక్షకుల దృష్టిలో పడుతుంటాయి. అలా సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్న ఓ తెలుగు సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ)ఇంగ్లీష్‌లో లవ్ అనే పదాన్ని తిరగేసి రాస్తే 'ఎవోల్' అని వస్తుంది. ఇదే టైటిల్‌తో రామ్ వెలగపూడి అనే దర్శకుడు ఓ సినిమా తీశాడు. జూలైలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. దీంతో ఓటీటీ మార్గం పట్టారు. ఆహా ఓటీటీలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.'ఎవోల్' సినిమా రెండు జంటల మధ్య జరిగే స్టోరీతో తెరకెక్కించారు. అందరూ కొత్త ఆర్టిస్టులే. గతేడాది డిసెంబరులో ట్రైలర్ రిలీజ్ చేశారు. నెల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. కానీ సెన్సార్ అడ్డంకులు ఎదురవడంతో ఇప్పుడు ఓటీటీ రూటులోకి వచ్చేశారు. మరి బోల్డ్ అంటున్నారు అంటే ఎలా సినిమా ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే ఓ మూడు రోజులు ఆగాల్సిందే?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ) -
ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’ (ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్). తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో రామ్ యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు స్నేహితుల మధ్య అవగాహన నేపథ్యంలో సాగే కథే ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్. -
రివర్స్ లవ్‌స్టోరీగా ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’. రామ్‌యోగి వెలగపూడి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘ఎల్ఓవీఈ।ని(లవ్)రివర్స్‌లో చూస్తే ‘ఈవీఓఎల్’. ఈ మూవీ ఓ రివర్స్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తలకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది’ అని చిత్రయూనిట్ పేర్కొంది.