Megha Aakash
-
తెలుగమ్మాయే కానీ తమిళంలో ఫేమస్.. రీసెంట్గా ప్రియుడితో పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లికి రావాలంటూ 'రజనీకాంత్'ను ఆహ్వానించిన హీరోయిన్
మెఘా ఆకాశ్.. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే.. 2017లో నితిన్ నటించిన 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మేఘా ఆకాశ్ పలు సినిమాలతో మెప్పించింది. అయితే, 28 ఏళ్ల ఈ బ్యూటీ కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మెఘా ఆకాశ్ పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్ వచ్చాయి. కానీ, ఈసారి వాటంన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్గా తన చిరకాల ప్రియుడు సాయివిష్ణుతో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. కేరళ జరిగిన ఈ కార్యక్రమం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానంమెఘా ఆకాశ్‌కు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం.. పలు ఇంటర్వ్యూలలో ఆమె ఇదే విషయాన్ని పంచుకుంది. తాజాగా కుటుంబ సభ్యులతో పాటు ప్రియుడు సాయివిష్ణుతో తలైవా ఇంటికి చేరుకుని తమ వివాహానికి రావాలని ఆహ్వానం పలికింది. రజనీతో దిగిన ఫోటోలను కూడా మెఘా ఆకాశ్ షేర్ చేస్తూ.. 'అభిమానంతో తలైవాను ఆహ్వానించాం' అంటూ ఒక నోట్ రాసింది. అయితే, ఫోటోలో శుభలేఖ కనిపించలేదు.మేఘా ఆకాశ్-సాయి విష్ణు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రీసెంట్గా వారిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో ఆమె పంచుకుంది. అయితే, మేఘా ఆకాష్ పెళ్లిపై ఒకప్పడు భారీగానే కోలీవుడ్‌లో పుకార్ వచ్చాయి. ఒక దశలో తమిళ మీడియా ఆమెకు పెళ్లి కూడా చేసేసింది. కానీ, ఎప్పటికప్పుడు తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు తన ప్రియడితో త్వరలో ఏడడుగులు వేయనుంది. పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది.తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ (తెలుగులో) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల పరంగా అవకాశాలు వచ్చినా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె కెరియర్ అంత ఈజీగా ముందుకు సాగలేదు. తెలుగులో చివరిగా మను చరిత్రలో నటించిన ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా తను నటించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
ఆయన హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారు: మేఘా ఆకాష్
స్టైలిష్ పాత్రలకన్నా, పక్కింటి అమ్మాయి ఇమేజ్ పాత్రలకైనా నప్పే నటీమణులకు కోలీవుడ్ ఎప్పుడూ ఎర్ర తివాచీ పరుస్తుంది. అలాంటి ప్రతిభావంతులైన నటీమణుల్లో నటి మేఘా ఆకాష్ ఒకరని చెప్పవచ్చు. ఈమె పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అలా మేఘా ఆకాష్ తాజాగా కథానాయికగా నటించిన చిత్రం మళై పిడిక్కాద మనిదన్ తెలుగులో తుఫాన్. నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఇందులో శరత్ కుమార్, సత్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విజయ్ మిల్టన్ ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోహ్రా, డి లలిత, పి ప్రదీప్, పంకజ్ బోహ్రా కలిసి నిర్మించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి మేఘ ఆకాష్ కోరుకుంటూ నటుడు విజయ్ ఆంటోని తన చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. మళై పిడిక్కాద మనిదన్ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు కథను వినకముందే తనకు బలమైన పాత్ర లభించిందనే భావన కలిగిందన్నారు.అలాగే ఈ చిత్రంలో తనలోని నటనను ప్రదర్శించే మంచి పాత్ర లభించిందన్నారు. తన కెరీర్లోనే గుర్తుండిపోయే మంచి కథ పాత్రను నటుడు విజయ్ ఆంటోని ఈ చిత్రంలో కల్పించారన్నారు. ఈ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన విజయ్ ఆంటోని, దర్శకుడు విజయ్ మిల్టన్, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని నటి మేఘా ఆకాష్ అన్నారు. -
‘మనుచరిత్ర’ మూవీ రివ్యూ
టైటిల్: మనుచరిత్ర నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాశ్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాణ సంస్థ: ప్రొద్దుటూరు టాకీస్ నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వం: భరత్ పెదగాని సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి విడుదల తేది: జూన్ 23, 2023 మనుచరిత్ర కథేంటంటే.. వరంగల్‌కు చెందిన మను (శివకందుకూరి) ఓ బ్రిలియంట్ స్టూడెంట్. కాలికాట్ ఎన్ఐటీలో చదవాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్‌లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతాడు. శ్రావ్య, ఆయేషా, జాను.. ఇలా చాలా మందికి ఐ లవ్ యూ చెప్పి కొన్నాళ్ల తర్వాత చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెబుతుంటాడు. సిన్సియర్‌గా ప్రేమించే మను ఎందుకు అలా బ్రేకప్ చేబుతాడు? బ్రిలియట్ స్టూడెంట్‌గా ఉన్న ఆయన ఎందుకు మద్యానికి బానిసైనాడు? అసలు జేన్నీ(మేఘ ఆకాశ్) ఎవరు? ఆమెకి మనుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్థానిక రౌడీ రుద్ర (డాలి ధనంజయ)తో కలసి మను ఎలాంటి పనులు చేశాడు? చివరకు మను జీవితం ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వరంగల్ నేపథ్యంలో సాగే ఓ కుర్రాడి ప్రేమకథే ఈ చిత్రం. తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి, ఆమె ప్రేమని మరో అమ్మాయిలో వెతుక్కునే ఓ కుర్రాడి కథ ఇది. ఇలాంటి ప్రేమ కథకు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 తరహాలో గుండాయిజాన్ని తగిలించి కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఓ మర్డర్ సీన్ తో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత ఓ ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే అసలు కథ ప్రారంభమయ్యాకే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతిసారి ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం.. అర్థంలేని కారణాలతో బ్రేకప్ చెప్పడం..ఇలాగే సాగుతుంది. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. ఇద్దరి ప్రేమని పెద్దవాళ్లకి చెప్పడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం, ఇక లైఫ్‌లో అంతా హ్యాపీ అనుకునే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు, ఎదురైన ట్విస్ట్ లు ఉత్కంఠ క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం నడపడానికి కథే ఉండదు. ఫస్టాఫ్‌లో చూపించిన సన్నివేశాల చుట్టే కథను నడిపాడు. హీరో రౌడీయిజంలోకి దిగడం..ఆ తర్వాత జాను అనే మరో పాత్రని ప్రవేశపెట్టి ఇంకో లవ్ స్టొరీ ని చూపించడం.. కథంతా రొటీన్‌గా ఉంటుంది. అక్కడక్కడ `అర్జున్‌రెడ్డి` `ఆర్ఎక్స్ 100` సినిమాలను గుర్తుచేసేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. మను పాత్రకు శివ కందుకూరి పూర్తి న్యాయం చేశాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. ఈ చిత్రంతో మాస్ లుక్ ట్రై చేసి మెప్పించాడు. జెన్నీ పాత్రలో మేఘా ఆకాశ్ ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ పాత్రల నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. విలన్ రుద్రగా ధనుంజయ్ మెప్పించాడు. హీరో స్నేహితుడిగా సుహాన్ మరోసారి అదరగొట్టేశాడు. మధు సూదన్, శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. గోపీ సుందర్ సంగీతం బాగుంది. చంద్రబోస్ రాసిన ‘ఎక్కడ ఉంటదిరో ఆ పిల్ల’ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్ఫుల్గా, రిచ్ లుక్‌నిస్తున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్?
నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం భారీ విజయం తలుపుతట్టింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్‌కు: షాహిద్ కపూర్) తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అయితే ఇప్పటివరకు పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్ స్పందించలేదు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న యంగ్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హారర్ మూవీ 'బూ'. డైరెక్టర్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!) ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. (ఇది చదవండి: మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!) The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost! Exclusive World Premiere | May 27th @officialjiocinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOOhttps://t.co/3oIFMqmZhR@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha… — Manjima Mohan (@mohan_manjima) May 23, 2023 -
మాస్ మహరాజ్ అరాచకం..
-
ఒక్కొక్క సీన్‌కి నరాలు తెగిపోతున్నాయి..రావణాసుర మూవీ రివ్వూ
-
రవితేజని ఏది మార్చలేదు.. నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అదే
-
విజయవాడలో 'డియర్ మేఘ' టీం సందడి
-
డియర్ మేఘ ట్రైలర్: ప్రేమకథలకు ముగింపు లేదట!
Dear Megha Trailer: ‘‘డియర్ మేఘ’ సినిమా నా కెరీర్లో ఇంపార్టెంట్ మూవీ. ప్రేమకథని పెద్దస్థాయిలో తీయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపిస్తే చాలు’’ అని హీరో అరుణ్ అదిత్ అన్నారు. మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమాయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కథలకు ముగింపు ఉంటుందేమో కానీ ప్రేమకథలకు ముగింపు ఉండదంటూ వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా అరుణ్ అదిత్ మాట్లాడుతూ– ‘‘2009లో నా కెరీర్ ప్రారంభమైంది. తమన్నాగారితో ‘లెవెన్త్ అవర్’ వెబ్‌సిరీస్ చేస్తున్నప్పుడు ‘డియర్ మేఘ’కి ఓకే చెప్పాను. ‘‘అమ్మాయి పేరు మీద ‘డియర్ మేఘ’ అని టైటిల్ పెడుతున్నాం.. నీకు అభ్యంతరం లేదుగా?’’ అని సుశాంత్ అడిగారు. ‘నాకు కథే ముఖ్యం.. టైటిల్ కాదు’ అని చెప్పాను. హీరోగానే కాదు. నటనకు ఆస్కారం ఉండే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. నేను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘కథ కంచికి మనం ఇంటికి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా: హీరోయిన్
‘లై, ఛల్ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’ అని హీరోయిన్ మేఘా ఆకాశ్ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘా ఆకాశ్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ భాష ఆధారంగా స్క్రిప్ట్స్ ఒప్పుకోను. మంచి కథ ఏ భాషలో ఉన్నా నటిస్తా. ‘రాజరాజ చోర’ కథ వైవిధ్యంగా ఉంది. నా నిజ జీవితానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాను కాబట్టి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, నాన్న నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు. అమ్మ కథ వింటుంది కానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయం నాదే. ప్రస్తుతం ‘డియర్ మేఘ, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం (అతిథి పాత్ర)’ చేస్తున్నాను. మరో సినిమా ప్రకటన త్వరలో వస్తుంది’’ అన్నారు. -
‘డియర్ మేఘ’.. ఓటీటీలోనే
‘కథ కంచికి మనం ఇంటికి’, ‘డియర్ మేఘ’ అంటున్నారు హీరో అదిత్ అరుణ్. ఈ కుర్ర హీరో నటిస్తున్న తాజా చిత్రాల టైటిల్స్ ఇవి. మంగళవారం అదిత్ అరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డబుల్ ధమాకాలా ఈ రెండు చిత్రాల లుక్స్‌ని విడుదల చేశారు. ‘కథ కంచికి మనం ఇంటికి’లో అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించారు. నూతన దర్శకుడు చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘మా హీరో అదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మా చిత్రం మొదటి లుక్, మోషన్ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు మోనిష్ పత్తిపాటి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుభాష్ డేవాబత్తిన, లైన్ ప్రొడ్యూసర్: కుమార్ కోట, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: వైయస్ కృష్ణ. మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ సినిమా నేరుగా ఇంటికే రానుంది. ‘మా సినిమాని త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నాం’’ అని అర్జున్ దాస్యన్ అన్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగితం అందించారు. చదవండి : ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ Rahul Sipligunj: సర్ప్రైజ్ లవ్ అనౌన్స్మెంట్ -
రొమాంటిక్ తూటా
హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. మేఘా ఆకాష్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో హీరో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగు హక్కులను విజయభేరి బ్యానర్‌పై జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి సొంతం చేసుకున్నారు. ‘ఎనై నోకి పాయుమ్ తోట’ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో అనువదిస్తున్నారు. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అని జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధర్భుక శివ, కెమెరా: మనోజ్ పరమహంస, జామన్ టి. జాన్, ఎస్ఆర్ కాథిర్. -
ఐ స్క్రీమ్
‘‘ఐస్‌క్రీమ్ అంటే నాకు భలే ఇష్టం. కానీ టర్కీలో ఐస్ క్రీమ్‌కు సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ ‘ఐ–స్క్రీమ్’లా మారింది అంటున్నారు’’ ‘ఛల్ మోహన్‌రంగ’ హీరోయిన్ మేఘా ఆకాశ్. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ను వివరిస్తూ – ‘‘నా ఫస్ట్ తమిళ సినిమా ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోటా’. ఇందులో ధనుష్ హీరో. ఆ సినిమాలో ఓ సాంగ్ షూట్ కోసం టర్కీ వెళ్లాం. ‘రోడ్ మీద ఏది కనిపిస్తే దానికి రియాక్ట్ అవుతూ అలా సరదాగా వెళ్లిపోండి. నేను షూట్ చేసుకుంటాను’ అని చిత్రదర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పారు. అలా కొంచెం దూరం వెళ్లగానే ఐస్‌క్రీమ్ బండి కనిపించింది. ధనుష్ రెండు గ్రీన్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్స్ తీసుకొని ఒకటి నాకు అందించాడు. కవర్ తీసి టేస్ట్ చేశాను. టేస్ట్ చాలా హారిబుల్ అంటే హారిబుల్‌గా ఉంది. కానీ కెమెరా రోల్ అవుతోంది. దాన్ని ఆస్వాదిస్తున్నట్టు నటించాలి. చేసేదేం లేక ఎంజాయ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశా. ధనుష్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపించింది. కొద్దిసేపటికి దర్శకుడు కట్ అని చెప్పగానే ఇద్దరం ఐస్‌క్రీమ్ పక్కన పడేసి ‘యాక్’ అని కక్కేసి, గట్టిగట్టిగా అరిచేశాం. అప్పటి నుంచి ఎప్పుడు ఐస్‌క్రీమ్ తింటున్నా ఈ ఫన్నీ ఇన్సిడెంటే గుర్తుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు మేఘా ఆకాశ్. -
ఫుల్ జోష్‌తో ట్వీట్ చేసిన నితిన్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తెలుపుతూ ట్వీట్ చేశారు నితిన్. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి నిర్మించిన మూవీ ‘ఛల్ మోహన్ రంగ’.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న నిర్వహించనున్నామని, ఆ వేడుకకు ముఖ్య అతిథిగా మూవీ నిర్మాత, మెగా హీరో పవన్ కల్యాణ్ విచ్చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ తన అభిమాన నటుడు కావడంతో నితిన్ సంతోషంగా ఉన్నట్లు ఆయన ట్వీట్ చదివితే అర్థమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలో చెబుతానంటూ తన ట్వీట్లో నితిన్ పేర్కొన్నారు. 'లై' మూవీతో నితిన్‌కు జోడిగా నటించిన మేఘా ఆకాశ్ ‘ఛల్ మోహన్ రంగ’తో వరుసగా రెండో మూవీలోనూ నితిన్‌తో కలిసి నటించింది. ఏప్రిల్ 5న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. All set for a Grand Pre Release event of #ChalMohanaRanga on the 25th of this month..and my Producer and our POWER STAR wil b the Chief Guest for the function!! Exciteddd!! Other details soonn!! 🤗🤗😘😘 — nithiin (@actor_nithiin) 22 March 2018 -
ఛల్.. పాటలన్నీ వచ్చేశాయ్
‘మీ పేరేటండి?’ అంటూ హీరోయిన్ మేఘా ఆకాశ్‌ను ఎంక్వైరీ చేస్తూ తొలి గీతాన్ని వదిలాడు ఛల్ మోహన్ రంగడు. ఆ తర్వాత 10 రోజులకు ‘వారం కాని వారం పేరు యవ్వారం..’ అంటూ మరో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. నెక్ట్స్ రిలీజైన ‘పెద్దపులి..’ సాంగ్‌తో అమాంతం రెచ్చిపోయాడు మోహనరంగడు. ఉగాది రోజున ఏకంగా ఆల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్‌ను ఆన్లైన్లో వదిలేసి, సంగీతప్రియులకు ఆనందాన్ని పంచాడు. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఛల్ మోహన్ రంగ’. ఇందులో మేఘా ఆకాశ్ కథానాయిక. ‘‘ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్‌ను కొత్తగా ట్యూన్ చేశారు తమన్. అమెరికా, ఊటీ, హైదరాబాద్ ఇలా ఎన్నో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. సుబ్రమణ్యన్ మంచి విజువల్స్ అందించారు. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. -
‘ఛల్ మోహన్ రంగ’ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్
-
జనవరి 1న నితిన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
‘లై’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన ‘లై’ ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నారట. అదే రోజు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ రానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. -
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
'నా పేరు ఏ. సత్యం. అంటే వాడుకభాషలో అసత్యం. పొట్టకొసినా, భగవద్గీత మీద ఒట్టు వేసినా అబద్ధమే చెప్తాను. నిజం చచ్చినా చెప్పను' అంటున్నాడు నితిన్. ఆయన నటించిన తాజా చిత్రం 'లై'.. అంటే అబద్ధం. అబద్ధాలు చుట్టూ ఈ సినిమా అల్లుకున్నట్టు సినిమా ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు. ఎందుకంటే.. 'మనం అబద్ధాలే మాట్లాడుకుందాం. అర్థమైందా?' అని హీరోయిన్ అంటే.. 'నువ్వు పెద్ద బాగోవు.. బాగా యావరేజ్' అని హీరో బదులిస్తాడు.. ఇక 'అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్ టైమ్ తెలిసింది' అని హీరోయిన్ సిగ్గులొలికితే.. 'అసలు అమ్మాయిలు పడేదే అబద్ధానికి.. పాపం అమాయకులు..' అంటూ హీరో హస్కీ వాయిస్‌లో చెప్తాడు. మొత్తానికి ఈ అబద్ధాల కథేంటో తెలుసుకోవాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’... వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. -
దర్శకులు మూడు రకాలు! – త్రివిక్రమ్
– త్రివిక్రమ్ ‘‘దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్లు. సెట్ డైరెక్టర్లు అన్నారు. ఆయనకు తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. సినిమా అంతా అయిపోయి రిలీజ్ తర్వాత ఇది ఇలాకన్నా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాను. అది నేను. సో .. మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు’’ అన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను మణిశర్మ ఫ్యాన్‌ని. ఆయన గురించి చెప్పే స్థాయి మనకు లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నాను. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, వెంకట్‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్, సెట్ డైరెక్టర్. నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్‌ను. హను సెట్లో సీన్‌ను ఊహించగలడు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనిల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్. ఇప్పుడు వీరికి తోడుగా వెంకట్ వచ్చారు. వారి కోసం సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్ లుక్ బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం వెనక చిత్రబృందం కృషి ఎంతో ఉంది. ఈ సినిమాను నితిన్ నాకన్నా ఎక్కువగా నమ్మాడు’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ (పవన్ కల్యాణ్) గారు ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఆయన సోల్మెట్ త్రివిక్రమ్ వచ్చారు కాబట్టి, ఆయన వచ్చినట్టే. నా కెరీర్లో ఇది 24వ సినిమా. నెక్ట్స్ 25వ సినిమా కల్యాణ్‌గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను చేయబోతున్న ఫస్ట్ సినిమా. అంతకంటే ఒక ఫ్యాన్‌గా నాకేం కావాలి. అనిల్‌గారు నా స్వీట్ హార్ట్. గోపీగారు, రామ్‌గారు, వెంకట్‌గారు చాలా ప్యాషనెట్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్స్. హనూకి సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీ–రికార్డింగ్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘మూవీ స్టార్ట్ చేసిన రోజునే ఆగస్టు 11న రిలీజ్ అనుకున్నాం. ఇప్పుడు అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.