పొట్టకొసినా అబద్ధమే చెప్తాను! | LIE Movie Theatrical Trailer | Sakshi
Sakshi News home page

పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!

Published Sun, Aug 6 2017 9:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!

పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!

'నా పేరు ఏ. సత్యం. అంటే వాడుకభాషలో అసత్యం. పొట్టకొసినా, భగవద్గీత మీద ఒట్టు వేసినా అబద్ధమే చెప్తాను. నిజం చచ్చినా చెప్పను' అంటున్నాడు నితిన్‌. ఆయన నటించిన తాజా చిత్రం 'లై'.. అంటే అబద్ధం. అబద్ధాలు చుట్టూ ఈ సినిమా అల్లుకున్నట్టు సినిమా ట్రైలర్‌ చూస్తే చెప్పేయొచ్చు. ఎందుకంటే.. 'మనం అబద్ధాలే మాట్లాడుకుందాం. అర్థమైందా?' అని హీరోయిన్‌ అంటే.. 'నువ్వు పెద్ద బాగోవు.. బాగా యావరేజ్' అని హీరో బదులిస్తాడు.. ఇక 'అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్‌ టైమ్‌ తెలిసింది' అని హీరోయిన్‌ సిగ్గులొలికితే.. 'అసలు అమ్మాయిలు పడేదే అబద్ధానికి.. పాపం అమాయకులు..' అంటూ హీరో హస్కీ వాయిస్‌లో చెప్తాడు.

మొత్తానికి ఈ అబద్ధాల కథేంటో తెలుసుకోవాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే. నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’...  వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్‌ లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement