డైరెక్టర్‌ డాలీతో నితిన్‌? | Will Director Dolly And Nitin Project Confirmed | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 11:48 AM | Last Updated on Wed, May 23 2018 11:53 AM

Will Director Dolly And Nitin Project Confirmed - Sakshi

‘అ ఆ’ సినిమాతో 50 కోట్ల క్లబ్‌ లో చేరిన నితిన్‌ తరువాత వరుసగా లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శతమానం భవతి సినిమాతో సక్సెస్ సాధించిన సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం... నితిన్‌ ఓ ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. కాటమరాయుడు డైరెక్టర్‌ డాలీ (కిషోర్‌ పార్థసాని)తో తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు వార‍్తలు వినిపిస్తున్నాయి. డాలీ చెప్పిన కథలో హీరో క్యారెక్టర్‌ కొత్తగా ఉండటంతో నితిన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్‌ చేయబోయే సినిమా ఇదే అన్న ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement