Chal Mohana Ranga
-
డైరెక్టర్ డాలీతో నితిన్?
‘అ ఆ’ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన నితిన్ తరువాత వరుసగా లై, ఛల్ మోహన్ రంగ సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శతమానం భవతి సినిమాతో సక్సెస్ సాధించిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం... నితిన్ ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. కాటమరాయుడు డైరెక్టర్ డాలీ (కిషోర్ పార్థసాని)తో తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాలీ చెప్పిన కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో నితిన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇదే అన్న ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
నవ్వుకోవడానికి మా సినిమాకి రండి – నితిన్
‘‘నేను ఇండస్ట్రీకొచ్చిన 16 ఏళ్లలో 25సినిమాలు చేశా. ఇన్నేళ్లు నాపై ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు థ్యాంక్స్. ప్రతి సినిమాకీ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ‘ఛల్ మోహన్‌రంగ’ గొప్ప కథ అని చెప్పను. ప్రేక్షకులు హ్యపీగా ఎంజాయ్ చేయటానికి తీశాం. హాయిగా నవ్వుకోవటానికి మా సినిమాకు రండి’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. నిఖితారెడ్డి సమర్పణలో సుధాకర్ రెడ్డి, పవన్ కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ–‘‘ఏ ఉద్దేశంతో సినిమా తీశామో దాన్ని చేరుకున్నాం అనిపిస్తోంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. పెద్ద కథ ఉన్నప్పుడ్డు పని సులువు అవుతుంది. చిన్న కథను చెప్పేటప్పుడు ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా చేయాలంటే కష్టం. మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారంటే ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్న పాయింట్‌ని తీసుకుని అందంగా చెప్పి హిట్ అందుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు నటుడు నరేశ్. ‘‘మా సినిమాపై ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, నితిన్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు మేఘా ఆకాశ్. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి, నటులు మధునందన్, శ్రీను పాల్గొన్నారు. -
ఛల్ మోహన్ దొంగా..
గుండె జారి గల్లంతయ్యేలా చేసే చాకులాంటి ఈ కుర్రాడుహీరోయిజంతో అమ్మాయిల దిల్ దోచాడేమో కానీ.. ఉంగరం దొంగిలిస్తాడా? అందునా అప్పన్న దర్శనానికి వచ్చి స్వామిఅంగుళీయకాన్నే కొట్టేస్తాడా? మనకు డౌటే కానీ.. అదే జరిగిందంటున్నారు ఆలయంలో అయ్యవార్లు. అందుకే ‘ఛల్ మోహనరంగా’ అంటూ వచ్చిన హీరో నితిన్‌ను తాళ్లతో కట్టి మరీ నిలదీశారు. స్వామి ఉంగరం ఎక్కడంటూ గద్దించారు. ఆదివారం ఉదయం సింహాచలం ఆలయంలో జరిగిన ఆ ‘దొంగాట’ కథా కమామిషు.. సింహాచలం(పెందుర్తి): ‘ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ ఇదీ ప్రముఖ నటుడు నితిన్‌కు ఆదివారం సింహగిరిపై ఎదురైన ప్రశ్నల వర్షం. ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు ఎదురైన అనుభవం. స్వామి దర్శనానికి వచ్చిన నితిన్‌కు అలయ అలంకారి కరి సీతారామాచార్యులు ఎదురై ఒకమాటైనా మాట్లాడకుండా తాళ్లతో బంధించారు. తర్వాత స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన నితిన్‌పై ఎడాపెడా ప్రశ్నలు సంధించారు. దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయమన్నారు. ‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్ చేసుకోండి’ అని నితిన్ బదులిచ్చారు. ‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే.’ అని స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. నితిన్‌కు ఇదేం అనుభవం? అని విస్మయపడుతున్నారా? మరేం లేదు.. ఇది సింహగిరిపై జరిగిన వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం ఉదయం జరిగిన వినోదోత్సవంలో చోటుచేసుకున్న ఘట్టం. ఏటా ఏడు రోజులపాటు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో ఆయనకు అదో సమస్య అవుతుంది. ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి.. భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. అలా పలువురు భక్తులు ఉంగరం దొంగలనే అభియోగాన్ని ఎదుర్కొంటారు. చివరికి ఎక్కడా ఉంగరం దొరక్కపోయేసరికి.. స్వామికి ఆచ్ఛాదనగా ఉండే పరదాలలో అన్వేషించగా, చివరి పరదాలో ఉంగరం లభిస్తుంది. ఆద్యంతం రక్తికట్టే ఈ వేడుకను వినోదోత్సవంగా అభివర్ణిస్తారు. సింహగిరిపై ఆదివారం వినోదోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడే హీరో నితిన్ స్వామివారి దర్శనానికి సింహగిరికి వచ్చారు. అప్పుడు ఆయన్ని తాళ్లతో బంధించి ప్రశ్నించారు. కన్నీళ్లు.. గొడవలు నితిన్‌ను మాత్రమే కాక.. చాలామంది భక్తులను కూడా అలంకారి కరి సీతారామాచార్యులు బంధించగా.. స్థానాచార్యుడు రాజగోపాల్ కఠినంగా ప్రశ్నించారు. విషయం తెలిసిన భక్తులకు ఇది వినోదంగా ఉండగా.. చాలామంది భక్తులు ఏమీ తెలియక బెంబేలెత్తిపోయారు. స్వామివారి ఉంగరాన్ని తాము తీశామన్న అభియోగం ఎదుర్కోవడంతో వారు కలవరపడ్డారు. ‘స్వామి దర్శనానికి వస్తే దొంగలంటారేమిటండీ.. మేం దొంగల్లా కనిపిస్తున్నామా?’ అని కొందరు గర్జించారు. కొంతమంది వలవలా ఏడ్చేశారు. మరికొందరు స్థానాచార్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా చూస్తూ నవ్వుతున్న వారిపై చిర్రుబుర్రుల్లాడారు. చివరికిది వినోదోత్సవం అని తెలుసుకుని స్వామి తమకు కల్పించిన మహాభాగ్యమని ఆనందోత్సాహాలతో వెనుదిరిగారు. ఇలా విజయవాడకు చెందిన అనూష, విశాఖలో డిగ్రీ చదువుతున్న ఖర్గపూర్ వాస్తవ్యులు వందన, పింకీ, వినీత కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన తండ్రీకొడుకులు అప్పారావు, ప్రసాద్, విశాఖ విద్యార్ధినులు కావ్య, ప్రమీల స్థానాచార్యులతో వాదులాడారు. విశాఖలో గుర్రంపాలేనికి చెందిన అమిత్, అలేఖ్య, గోపాలపట్నానికి చెందిన నూతన దంపతులు రవి, ఆకాంక్ష ‘దొంగలు’గా చిక్కారు. గీతం కళాశాల బిటెక్ విద్యార్ధినులు మౌనిక, నివేదిత, స్వప్న, శ్రీకాకుళం రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న మోహన్, మణి దంపతులు తదితరులు ఉంగరం దొంగలుగా పట్టుబడ్డారు. ఆలయ కొత్వాల్ నాయక్, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, పీఆర్వో జైమునిలనూ బంధించారు. చివరికి స్థానాచార్యులు, హవల్దార్ కూడా దొంగలుగా చిక్కారు. -
నా లుక్ కూల్‌గా ఉంటుంది – నితిన్
నితిన్, మేఘా ఆకాశ్ జంటగా ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం వైజాగ్‌లో ఆదివారం సందడి చేసింది. నితిన్ మాట్లాడుతూ– ‘‘చక్కటి ప్రేమకథా చిత్రమిది. ఇందులో కూల్ లుక్ ట్రై చేశా. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. ముఖ్యంగా యువతకి మా సినిమా వేసవి కానుకలాంటిది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నన్ను చాలా అందంగా చూపించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మేఘా ఆకాశ్. ‘‘ఫీల్ గుడ్ మూవీ. నాపై నమ్మకంతో నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నిర్మాతలను జీవితంలో మరచిపోలేను. తమన్ పాటలు చాలా బాగున్నాయి’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు చిత్ర సమర్పకురాలు నిఖితారెడ్డి. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ పూర్వి రాజు పాల్గొన్నారు. -
రెడీ టు మింగిల్
‘‘16 ఏళ్లలో 25 సినిమాలు చేశాను. నటుడిగా హిట్స్, ఫ్లాప్స్ రెండూ చూశాను. ఇదంతా ఓ ఎమోషనల్ జర్నీ. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఫ్లాఫ్స్ తీసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పడు ఇచ్చినన్ని ఫ్లాప్స్ ఇప్పుడు ఇస్తే కుదరదు. వరుస హిట్స్ ఇస్తేనే పోటీలో నిలవగలం’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘ ఆకాష్ జంటగా ‘రౌడి ఫెల్లో’ ఫేమ్ కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛల్ మోహన రంగ’. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి సమర్పణలో సుధాకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నితిన్ పంచుకున్న విశేషాలు. ► త్రివిక్రమ్ గారు కథ, క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారు. దర్శకుడు కృష్ణచైతన్య 8నెలల పాటు వర్కౌట్ చేశారు. త్రివిక్రమ్‌గారు నిర్మాణంలో భాగం అవుతున్నారని తెలిసి పవన్ కల్యాణ్‌గారు కూడా జాయిన్ అయ్యారు. ‘లై’ కంటే ముందే ఈ సినిమా జరగాల్సి ఉంది. ఎందుకో కుదర్లేదు. ► ఎలాగైనా సరే అమెరికా వెళ్దాం అనుకునే మనస్తత్వం హీరోది. మూడుసార్లు వీసా రిజెక్ట్ అవుతుంది. నాలుగోసారి ఎలా వీసా వస్తుంది? అనే పాయింట్ చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమా సగ భాగం అమెరికాలో, మరో సగం ఊటీలో జరుగుతుంది. ముందు ఎవరైనా స్టార్ హీరోయిన్ని ఎంపిక చేద్దామనుకున్నాం. వాళ్ల డేట్స్ కుదరలేదు. ‘లై’ సినిమా అప్పుడే మేఘా ఆకాశ్ రెండు సినిమాలకు హీరోయిన్గా సైన్ చేశాం. ‘లై’ సరిగ్గా ఆడలేదు, ఫ్లాప్ హీరోయిన్‌తో వద్దు అన్నారు. నావల్ల కూడా సినిమాలు ఆడకపోయి ఉండచ్చు. హిట్టూ ఫ్లాఫ్స్ మన చేతుల్లో లేవు. అందుకే మళ్లీ మేఘ ఆకాశ్నే హీరోయిన్గా ఎంపిక చేశాం. ► కృష్ణ చైతన్యతో నాకు ‘ఇష్క్’ సినిమా నుంచే పరిచయం ఉంది. ‘రౌడీ ఫెల్లో’ సినిమా చూశాను. నాకు నచ్చింది. కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. ఇలా కుదిరింది. మా బ్యానర్లో తర్వాత చిత్రం కూడా చేస్తున్నాడు. ► తమన్‌తో కలిసి వర్క్ చేయడం ఫస్ట్ టైమ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రీ–రికార్డింగ్ సినిమాకు ప్రాణం. సమ్మర్లో వస్తున్న లవ్‌స్టోరీ కాబట్టి ఆడియన్స్‌కు నచ్చుతుందని అనుకుంటున్నాం. ► ఎవరు ఎందుకు నచ్చుతారో స్పష్టంగా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి చూడగానే నచ్చేస్తుంది. ఎందుకో కారణాలు చెప్పలేం. దర్శకుడు తివ్రిక్రమ్గారి మీద నాకున్న ఇష్టానికి కారణం చెప్పలేను. ఆయనతో చాలా క్లోజ్ అయిపోయాను. ► నటుడిగా ఇది నాకు 16వ పుట్టిన రోజు. ‘35లోకి అడుగుపెడుతున్నావు. పెళ్లి చేసుకో’ అని ఇంట్లో రోజూ అడుగుతున్నారు. ఎవ్వరితోనూ లవ్‌లో లేను. ఐయామ్ సింగిల్. రెడీ టు మింగిల్ (నవ్వుతూ). ► బర్త్‌డే ప్లాన్స్ ఏమీ లేవు. సినిమా రిలీజ్ అప్పుడు బర్త్‌డేలు వస్తే ఇదే స్ట్రెస్‌లో ఉంటాం. ► పదేళ్ల తర్వాత ‘దిల్’ రాజు గారి బ్యానర్లో సినిమా చేస్తున్నాను. ఒక్కటి కాదు ఏకంగా రెండు. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’. జులై 24న లేదంటే ఆగస్టు 9 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హరీష్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్‌తో ఒక మల్టీస్టారర్. ఆ తర్వాత ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది. -
వాటే క్యూట్ ట్రైలర్..!
వాటే క్యూట్ ట్రైలర్... వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అంటూ ‘ఛల్ మోహన్‌రంగ’ సినిమాపై అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. గత రాత్రి విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై అల్లు వారబ్బాయి ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తన మేనమామ పవన్ కల్యాణ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అసలే ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ పవన్ ఫ్యాన్స్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బన్నీకి భిన్నంగా అల్లు శిరీష్ ట్వీట్ చేయడం పవన్ అభిమానులను ఖుషీ చేస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు దగ్గరవ్వాలన్న ఆలోచనతో శిరీష్ ఇలా ట్వీట్‌చేసి ఉంటాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘ఛల్ మోహనరంగ’ ట్రైలర్‌పై అల్లు వారబ్బాయి ప్రశంసల జల్లు కురిపించారు. పవర్ స్టార్ బ్యానర్ అంటూ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌ను ప్రస్తావించారు. ‘వాటే క్యూట్ ట్రైలర్! ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. హీరో నితిన్, డైరెక్టర్ కృష్ణచైతన్యకు అభినందనలు, పవర్ స్టార్ బ్యానర్, గురూజీ (త్రివిక్రమ్) పేర్లను టైటిల్స్‌లో చూడటం బాగుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో పాటు ట్రైలర్‌ను ట్యాగ్చేశాడు. Whatte cute trailer! Waiting for this film. Wishing @actor_nithiin bro & dir Krishna Chaitanya all the best for #ChalMohanRanga! Nice to see Powerstar's banner & guruji's name in titles. https://t.co/UnZMHNP5EO — Allu Sirish (@AlluSirish) 26 March 2018 -
‘ఛల్ మోహన్‌రంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
సినిమా కోసం ఏరా.. పోరా అని తిట్టుకున్నాం..
‘‘16ఏళ్ల నా సినీ కెరీర్లో 25వ సినిమా ‘ఛల్ మోహన్‌రంగ’. నా చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘తొలిప్రేమ’ సినిమా చూసిన తర్వాతే హీరో అవ్వాలనుకున్నా’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రీ– రిలీజ్ వేడుకకు హీరో పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘నాకు నటన రాకున్నా నేర్పి, తొలి సినిమా (జయం)కు అవకాశం ఇచ్చిన నా గురువు తేజగారికి థ్యాంక్స్. నేను సినిమాల్లోకి వెళతానంటే నా తల్లితండ్రులు వద్దనకుండా ప్రోత్సహించారు. నేను సినిమాలకు తప్ప వేరే దేనికీ పనికిరానని వారు ముందుగానే అనుకున్నారేమో(నవ్వుతూ). దర్శకుడు చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్. సినిమా కోసం ఏరా.. పోరా అని తిట్టుకున్నాం. ఈ చిత్రం తనకి మంచి హిట్ ఇవ్వాలి. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నా కెరీర్లో ‘ఛల్ మోహన్‌రంగ’ 25వ సినిమా అని ప్రత్యేకమైంది కాదు. ఈ సినిమాని పవన్‌గారు, త్రివిక్రమ్‌గారు, మా నాన్నగారు నిర్మించడమే ప్రత్యేకం. నా లైఫ్‌లో ఇష్టమైన వ్యక్తుల్లో ఈ ముగ్గురే ఉంటారు’’ అన్నారు. ‘‘నా బలం నితిన్. తనతో సినిమా చేయాలని బలంగా కోరుకున్నా.. కుదిరింది. తమన్‌గారికి నేను ఓ 50 పాటలు రాసిఉంటా. ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారాయన’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘కృష్ణ చైతన్య చక్కగా తెరకెక్కించారు. సినిమా ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. నితిన్‌తో నాకు తొలి సినిమా. కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు తమన్. సుధాకర్‌రెడ్డి, సమర్పకురాలు నిఖితారెడ్డి, కెమెరామెన్ ఎం. నటరాజ సుబ్రమణియన్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, కె.కె. రాధామోహన్, మేఘా ఆకాశ్, నటి లిజీ తదితరులు పాల్గొన్నారు. -
చల్ మోహన్ రంగా ట్రైలర్
సాక్షి, హైదరాబాద్ : ఎలా ఉన్నానండీ.. సన్నీలియోన్ సిస్టర్లా ఉన్నావ్..!! ఏంటోనండీ అంతా మీ అభిమానం గొప్పగొప్పవాళ్లతో పోల్చేస్తున్నారు. ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు అనే డైలాగ్స్‌తో చల్ మోహన్ రంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పూర్తి స్థాయి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. చాక్లెట్ బాయ్ లుక్‌లో హిరో నితిన్ ట్రైలర్లో మంచి జోష్‌ను కనబరిచారు. నితిన్, మేఘా ఆకాశ్‌లు జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. తన ట్రేడ్ మార్క్ మాటలతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ అందించారు. మరి మీరు ఓ సారి ట్రైలర్‌ను చూసేయండి. -
ఫుల్ జోష్‌తో ట్వీట్ చేసిన నితిన్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తెలుపుతూ ట్వీట్ చేశారు నితిన్. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి నిర్మించిన మూవీ ‘ఛల్ మోహన్ రంగ’.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న నిర్వహించనున్నామని, ఆ వేడుకకు ముఖ్య అతిథిగా మూవీ నిర్మాత, మెగా హీరో పవన్ కల్యాణ్ విచ్చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ తన అభిమాన నటుడు కావడంతో నితిన్ సంతోషంగా ఉన్నట్లు ఆయన ట్వీట్ చదివితే అర్థమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలో చెబుతానంటూ తన ట్వీట్లో నితిన్ పేర్కొన్నారు. 'లై' మూవీతో నితిన్‌కు జోడిగా నటించిన మేఘా ఆకాశ్ ‘ఛల్ మోహన్ రంగ’తో వరుసగా రెండో మూవీలోనూ నితిన్‌తో కలిసి నటించింది. ఏప్రిల్ 5న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. All set for a Grand Pre Release event of #ChalMohanaRanga on the 25th of this month..and my Producer and our POWER STAR wil b the Chief Guest for the function!! Exciteddd!! Other details soonn!! 🤗🤗😘😘 — nithiin (@actor_nithiin) 22 March 2018 -
ఛల్.. పాటలన్నీ వచ్చేశాయ్
‘మీ పేరేటండి?’ అంటూ హీరోయిన్ మేఘా ఆకాశ్‌ను ఎంక్వైరీ చేస్తూ తొలి గీతాన్ని వదిలాడు ఛల్ మోహన్ రంగడు. ఆ తర్వాత 10 రోజులకు ‘వారం కాని వారం పేరు యవ్వారం..’ అంటూ మరో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. నెక్ట్స్ రిలీజైన ‘పెద్దపులి..’ సాంగ్‌తో అమాంతం రెచ్చిపోయాడు మోహనరంగడు. ఉగాది రోజున ఏకంగా ఆల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్‌ను ఆన్లైన్లో వదిలేసి, సంగీతప్రియులకు ఆనందాన్ని పంచాడు. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఛల్ మోహన్ రంగ’. ఇందులో మేఘా ఆకాశ్ కథానాయిక. ‘‘ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్‌ను కొత్తగా ట్యూన్ చేశారు తమన్. అమెరికా, ఊటీ, హైదరాబాద్ ఇలా ఎన్నో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. సుబ్రమణ్యన్ మంచి విజువల్స్ అందించారు. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. -
తొలి రాగానికి వేళాయె
నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఛల్ మోహన్‌రంగ’. రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలోని తొలి సాంగ్ ‘గా..ఘా..మేఘా’ను ఈ నెల 24న ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నారు. అన్నట్లు డేట్ గుర్తుంది కదా.. ఫిబ్రవరి 24 అంటే.. ‘ఇష్క్’ సినిమా రిలీజ్ డేట్. నితిన్ కెరీర్ గ్రాఫ్‌ని పెంచిన సినిమా ‘ఇష్క్’. ఆ సంగతలా ఉంచితే.. ‘ఛల్ మోహన్‌రంగ’ను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఛల్ మోహన రంగ టీజర్ విడుదల
-
ఛల్ మోహన్‌రంగ టీజర్ విడుదల
సాక్షి, సినిమా : ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో నితిన్ అభిమానులకు గిప్ట్ ఇచ్చాడు. తన కొత్త చిత్రం 'ఛల్ మోహన్‌రంగ' టీజర్‌ను విడుదల చేశాడు. టీజర్లో తన ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు నితిన్. 'వర్షాకాలం కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని.. వేసవికాలంలో విడిపోయాం' అంటూ తన లవ్‌స్టోరిని చెప్పకనే చెప్పాడు. ఈ టీజర్లో నితిన్ కూల్ లుక్ తోపాటు, మేఘా ఆకాశ్ అందంగా కనిపిస్తోంది. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నితిన్‌కు కెరీర్లో 25వ సినిమా. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. తమన్ సంగీతం దర్శకుడుగా పనిచేస్తున్నారు. కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, సమర్పణ: నిఖిత రెడ్డి.