నా లుక్‌ కూల్‌గా ఉంటుంది – నితిన్‌ | Chal Mohan Ranga Movie Promotions @ Vizag | Sakshi
Sakshi News home page

నా లుక్‌ కూల్‌గా ఉంటుంది – నితిన్‌

Apr 2 2018 3:16 AM | Updated on Apr 2 2018 3:16 AM

Chal Mohan Ranga Movie Promotions @ Vizag - Sakshi

కృష్ణచైతన్య, మేఘా ఆకాశ్, నితిన్, మధునందన్, నిఖితారెడ్డి

నితిన్, మేఘా ఆకాశ్‌ జంటగా ‘రౌడీ ఫెలో’ ఫేమ్‌ కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్‌ మోహన్‌రంగ’. పవన్‌ కల్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం వైజాగ్‌లో ఆదివారం సందడి చేసింది. నితిన్‌ మాట్లాడుతూ– ‘‘చక్కటి ప్రేమకథా చిత్రమిది. ఇందులో కూల్‌ లుక్‌ ట్రై చేశా. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్‌లకి మంచి స్పందన వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది.

ముఖ్యంగా యువతకి మా సినిమా వేసవి కానుకలాంటిది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నన్ను చాలా అందంగా చూపించారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మేఘా ఆకాశ్‌. ‘‘ఫీల్‌ గుడ్‌ మూవీ. నాపై నమ్మకంతో నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నిర్మాతలను జీవితంలో మరచిపోలేను. తమన్‌ పాటలు చాలా బాగున్నాయి’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు చిత్ర సమర్పకురాలు నిఖితారెడ్డి. వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ పూర్వి రాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement