నితిన్
‘‘16 ఏళ్లలో 25 సినిమాలు చేశాను. నటుడిగా హిట్స్, ఫ్లాప్స్ రెండూ చూశాను. ఇదంతా ఓ ఎమోషనల్ జర్నీ. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఫ్లాఫ్స్ తీసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పడు ఇచ్చినన్ని ఫ్లాప్స్ ఇప్పుడు ఇస్తే కుదరదు. వరుస హిట్స్ ఇస్తేనే పోటీలో నిలవగలం’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘ ఆకాష్ జంటగా ‘రౌడి ఫెల్లో’ ఫేమ్ కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛల్ మోహన రంగ’. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి సమర్పణలో సుధాకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నితిన్ పంచుకున్న విశేషాలు.
► త్రివిక్రమ్ గారు కథ, క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారు. దర్శకుడు కృష్ణచైతన్య 8నెలల పాటు వర్కౌట్ చేశారు. త్రివిక్రమ్‌గారు నిర్మాణంలో భాగం అవుతున్నారని తెలిసి పవన్ కల్యాణ్‌గారు కూడా జాయిన్ అయ్యారు. ‘లై’ కంటే ముందే ఈ సినిమా జరగాల్సి ఉంది. ఎందుకో కుదర్లేదు.
► ఎలాగైనా సరే అమెరికా వెళ్దాం అనుకునే మనస్తత్వం హీరోది. మూడుసార్లు వీసా రిజెక్ట్ అవుతుంది. నాలుగోసారి ఎలా వీసా వస్తుంది? అనే పాయింట్ చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమా సగ భాగం అమెరికాలో, మరో సగం ఊటీలో జరుగుతుంది. ముందు ఎవరైనా స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేద్దామనుకున్నాం. వాళ్ల డేట్స్ కుదరలేదు. ‘లై’ సినిమా అప్పుడే మేఘా ఆకాశ్ రెండు సినిమాలకు హీరోయిన్‌గా సైన్ చేశాం. ‘లై’ సరిగ్గా ఆడలేదు, ఫ్లాప్ హీరోయిన్‌తో వద్దు అన్నారు. నావల్ల కూడా సినిమాలు ఆడకపోయి ఉండచ్చు. హిట్టూ ఫ్లాఫ్స్ మన చేతుల్లో లేవు. అందుకే మళ్లీ మేఘ ఆకాశ్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేశాం.
► కృష్ణ చైతన్యతో నాకు ‘ఇష్క్’ సినిమా నుంచే పరిచయం ఉంది. ‘రౌడీ ఫెల్లో’ సినిమా చూశాను. నాకు నచ్చింది. కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. ఇలా కుదిరింది. మా బ్యానర్‌లో తర్వాత చిత్రం కూడా చేస్తున్నాడు.
► తమన్‌తో కలిసి వర్క్ చేయడం ఫస్ట్ టైమ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రీ–రికార్డింగ్ సినిమాకు ప్రాణం. సమ్మర్‌లో వస్తున్న లవ్‌స్టోరీ కాబట్టి ఆడియన్స్‌కు నచ్చుతుందని అనుకుంటున్నాం.
► ఎవరు ఎందుకు నచ్చుతారో స్పష్టంగా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి చూడగానే నచ్చేస్తుంది. ఎందుకో కారణాలు చెప్పలేం. దర్శకుడు తివ్రిక్రమ్‌గారి మీద నాకున్న ఇష్టానికి కారణం చెప్పలేను. ఆయనతో చాలా క్లోజ్ అయిపోయాను.
► నటుడిగా ఇది నాకు 16వ పుట్టిన రోజు. ‘35లోకి అడుగుపెడుతున్నావు. పెళ్లి చేసుకో’ అని ఇంట్లో రోజూ అడుగుతున్నారు. ఎవ్వరితోనూ లవ్‌లో లేను. ఐయామ్ సింగిల్. రెడీ టు మింగిల్ (నవ్వుతూ).
► బర్త్‌డే ప్లాన్స్ ఏమీ లేవు. సినిమా రిలీజ్ అప్పుడు బర్త్‌డేలు వస్తే ఇదే స్ట్రెస్‌లో ఉంటాం.
► పదేళ్ల తర్వాత ‘దిల్’ రాజు గారి బ్యానర్లో సినిమా చేస్తున్నాను. ఒక్కటి కాదు ఏకంగా రెండు. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’. జులై 24న లేదంటే ఆగస్టు 9 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హరీష్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్‌తో ఒక మల్టీస్టారర్. ఆ తర్వాత ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఒక సినిమా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment