హ్యాకింగ్‌ బారిన పడ్డ మరో హీరోయిన్‌ | Megha Akash Instagram Account Hacked | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్‌ బారిన పడ్డ మరో హీరోయిన్‌

Published Tue, Feb 5 2019 10:57 AM | Last Updated on Tue, Feb 5 2019 1:40 PM

Megha Akash Instagram Account Hacked - Sakshi

నితిన్‌ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మేఘా ఆకాష్‌. రెండో సినిమా కూడా నితిన్‌కు జోడిగా నటించిన ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయి సక్సెస్‌ దక్కలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘాకు షాక్‌ తగిలింది. తాజాగా ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.

దాదాపు ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్‌ హ్యాక్‌ చేసి రష్యాకు చెందిన ఒక కాస్మోటిక్‌ హస్పిటల్‌కు చెందిన పోస్టింగ్‌లు చేశారు. వీటిలో కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా ఉండటంతో మేఘా అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మేఘా ఆకాష్ ట్విట్టర్‌ ద్వారా తన ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని అభిమానులకు తెలిపారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయ్యింది. ఆ అకౌంట్‌లో వచ్చే మెసేజ్‌లు పోస్టింగ్‌లను పట్టించుకోకండి’ అంటూ ట్వీట్‌ చేశారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement