Check Movie Heroine, Priya Prakash Varrier Shares Check Movie Shooting Video - Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో కింద పడిపోయిన ప్రియా ప్రకాశ్‌

Published Fri, Feb 26 2021 11:42 AM | Last Updated on Fri, Feb 26 2021 1:12 PM

Priya Prakash Varrier Shares Check Movie Shooting Scene - Sakshi

నితిన్‌ నడుచుకుంటూ వస్తుంటే  ప్రియా ప్రకాశ్ వెనకాలే‌ వచ్చి అతడి వీపుపైకి ఒక్కసారిగా ఎగిరి ఎక్కింది. వెంటనే అదుపు తప్పి నెలమీద వెల్లకిలా పడిపోయింది. దీంతో యూనిట్‌ సభ్యులంత ఆమె దగ్గరి వచ్చి..

కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వరియర్‌, యంగ్‌ హీరో నితిన్‌ నటించిన ‘చెక్’‌ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ ‘చెక్’‌ మూవీ షూటింగ్‌లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్‌లోని ఓ రోమాంటిక్‌ సన్నివేశం చిత్రీకరణలో నితిన్‌ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత‌ వెనకాలే ప్రియా ప్రకాశ్‌ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్‌ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది.

ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్‌ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్‌ చేసింది. కాగా వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్‌కు జోడిగా ప్రియా ప్రకాశ్‌, రకుల్‌ ప్రిత్‌ సింగ్‌లు కథానాయికలుగా నటించారు. 

 చదవండి: రకుల్‌ను డామినేట్‌ చేస్తున్న ప్రియా వారియర్
                 ట్రైలర్‌: దేశద్రోహితో చెస్‌ ఆడిస్తారా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement