మెగా హీరోతో ఫ్లాప్‌ హీరోయిన్‌! | Megha Akash Signs Mega Hero Viashnav Tej Film | Sakshi
Sakshi News home page

మెగా హీరోతో ఫ్లాప్‌ హీరోయిన్‌!

Published Wed, Apr 10 2019 2:13 PM | Last Updated on Wed, Apr 10 2019 2:13 PM

Megha Akash Signs Mega Hero Viashnav Tej Film - Sakshi

వరుస సినిమాలు చేస్తున్న ఒక్క హిట్ కూడా దక్కని సౌత్‌ హీరోయిన్ మేఘా ఆకాష్‌. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత తెలుగులో ఛల్ మోహన్‌ రంగ సినిమాలోనూ నితిన్‌కు జోడిగా నటించింది. తరువాత తమిళ్‌లో నటించిన రెండు సినిమాలు ఈ అమ్మడి కెరీర్‌కు ఉపయోగపడలేదు. అంతేకాదు మరో రెండు తమిళ సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

తాజాగా మేఘాను ఓ మెగా హీరో సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నారై భామ మనీషా రాజ్‌ను  తీసుకున్నారు. మరి ఇప్పుడు మనిషాను పక్కన పెట్టి మేఘాను తీసుకున్నారా.. లేక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది.మరి ఈ ఈ సినిమా అయినా మేఘాకు తొలి సక్సెస్‌ అందిస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement