ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో నితిన్ అభిమానులకు గిప్ట్ ఇచ్చాడు. తన కొత్త చిత్రం 'ఛల్ మోహన రంగ' టీజర్‌ను విడుదల చేశాడు. టీజర్‌లో తన ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు నితిన్. 'వర్షాకాలం కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని.. వేసవికాలంలో విడిపోయాం' అంటూ తన లవ్‌స్టోరిని చెప్పకనే చెప్పాడు. ఈ టీజర్‌లో నితిన్ కూల్ లుక్ తోపాటు, మేఘా ఆకాశ్ అందంగా కనిపిస్తోంది.