వాటే క్యూట్‌ ట్రైలర్‌..! | Allu Sirish Comments On Chal Mohanranga Movie Trailer | Sakshi
Sakshi News home page

వాటే క్యూట్‌ ట్రైలర్‌..

Published Mon, Mar 26 2018 5:22 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

allu sirish - Sakshi

అల్లు శిరీష్ (ఫైల్‌)

వాటే క్యూట్‌ ట్రైలర్‌... వెయిటింగ్‌ ఫర్‌ దిస్‌ మూవీ అంటూ ‘ఛల్‌ మోహన్‌రంగ’ సినిమాపై అల్లు శిరీష్ ట్వీట్‌ చేశాడు. గత రాత్రి విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై అల్లు వారబ్బాయి ట్వీట్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. నితిన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తన మేనమామ పవన్‌ కల్యాణ్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

అసలే ‘చెప్పను బ్రదర్‌’ అంటూ బన్నీ పవన్‌ ఫ్యాన్స్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బన్నీకి భిన్నంగా అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేయడం పవన్‌ అభిమానులను ఖుషీ చేస్తోంది. పవన్‌ ఫ్యాన్స్‌కు దగ్గరవ్వాలన్న ఆలోచనతో శిరీష్‌ ఇలా ట్వీట్‌చేసి ఉంటాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘ఛల్‌ మోహనరంగ’ ట్రైలర్‌పై అల్లు వారబ్బాయి ప్రశంసల జల్లు కురిపించారు. పవర్‌ స్టార్‌ బ్యానర్‌ అంటూ ప్రత్యేకంగా పవన్‌ కల్యాణ్‌ను ప్రస్తావించారు. ‘వాటే క్యూట్‌ ట్రైలర్‌! ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. హీరో నితిన్‌, డైరెక్టర్‌ కృష్ణచైతన్యకు అభినందనలు, పవర్‌ స్టార్‌ బ్యానర్‌, గురూజీ (త్రివిక్రమ్‌) పేర్లను టైటిల్స్‌లో చూడటం బాగుంది’  అని పోస్ట్‌ చేశాడు. దీంతో పాటు ట్రైలర్‌ను ట్యాగ్‌చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Video

View all
Advertisement