త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌లతో హీరో నితిన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తెలుపుతూ ట్వీట్ చేశారు నితిన్. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి నిర్మించిన మూవీ ‘ఛల్ మోహన్ రంగ’..
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న నిర్వహించనున్నామని, ఆ వేడుకకు ముఖ్య అతిథిగా మూవీ నిర్మాత, మెగా హీరో పవన్ కల్యాణ్ విచ్చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ తన అభిమాన నటుడు కావడంతో నితిన్ సంతోషంగా ఉన్నట్లు ఆయన ట్వీట్ చదివితే అర్థమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలో చెబుతానంటూ తన ట్వీట్లో నితిన్ పేర్కొన్నారు. 'లై' మూవీతో నితిన్‌కు జోడిగా నటించిన మేఘా ఆకాశ్ ‘ఛల్ మోహన్ రంగ’తో వరుసగా రెండో మూవీలోనూ నితిన్‌తో కలిసి నటించింది. ఏప్రిల్ 5న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
All set for a Grand Pre Release event of #ChalMohanaRanga on the 25th of this month..and my Producer and our POWER STAR wil b the Chief Guest for the function!! Exciteddd!! Other details soonn!! 🤗🤗😘😘
— nithiin (@actor_nithiin) 22 March 2018
Comments
Please login to add a commentAdd a comment