Pre-Release Celebration
-
మేడ మీద అబ్బాయితో ట్రాక్ మార్చా
– ‘అల్లరి’ నరేశ్ ‘‘ఎప్పట్నుంచో ‘నరేశ్ ట్రాక్ మారిస్తే బాగుంటుంది’ అని కోరుకుంటున్నా. నాకు తానెంత మంచి నటుడో తెలుసు. కామెడీ బాగా చేస్తాడని మనందరికీ తెలుసు. కామెడీ కంటే వేరే ఎమోషన్స్‌ను ఇంకా బాగా చేయగలడు. వాటినెవరూ చూపించలేదు. నరేశ్ కూడా ‘బాబాయ్... నా సిన్మాలు చూసేవాళ్లు, అభిమానులు కామెడీ ఆశిస్తారు’ అనేవాడు. ‘కామెడీ చేశావ్ కాబట్టి చూశారు. మిగతా ఎమోషన్స్ చేస్తే నువ్వెంత మంచి నటుడివో అందరికీ అర్థమవుతుంద’ని చాలాసార్లు వాదించా. ఈ సిన్మా టీజర్ చూడగానే... నరేశ్ నటుడిగా వికసించే ప్రక్రియ మొదలైందనుకున్నా. భవిష్యత్తులో తనలోని నటుడి గురించి ప్రేక్షకులకు తెలుస్తుంది. అది ఈ సినిమాతో మొదలై, అతను మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు హీరో నాని. ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి. ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన సినిమా ‘మేడ మీద అబ్బాయి’. షాన్ రెహమాన్ స్వరకర్త. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో పాటల సీడీలను హీరోలు నిఖిల్, సందీప్ కిషన్ విడుదల చేశారు. నరేశ్ మాట్లాడుతూ –‘‘కొంచెం కొత్తగా, ట్రాక్ మార్చి సినిమాలు చేయమని నానితో సహా నా శ్రేయోభిలాషులు, అభిమానులు చెబుతున్నారు. ఈ సిన్మాతో ట్రాక్ మార్చా. నిర్మాతలు కథను నమ్మినప్పుడే విభిన్నమైన సినిమాలొస్తాయి. చంద్రశేఖర్‌గారు ‘కెవ్వు కేక’ నుంచి నాతో ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమా’’ అన్నారు. దర్శక–నటుడు అవసరాల, దర్శకులు ఇంద్రగంటి, దేవి ప్రసాద్ పాల్గొన్నారు. -
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
-
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
'నా పేరు ఏ. సత్యం. అంటే వాడుకభాషలో అసత్యం. పొట్టకొసినా, భగవద్గీత మీద ఒట్టు వేసినా అబద్ధమే చెప్తాను. నిజం చచ్చినా చెప్పను' అంటున్నాడు నితిన్. ఆయన నటించిన తాజా చిత్రం 'లై'.. అంటే అబద్ధం. అబద్ధాలు చుట్టూ ఈ సినిమా అల్లుకున్నట్టు సినిమా ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు. ఎందుకంటే.. 'మనం అబద్ధాలే మాట్లాడుకుందాం. అర్థమైందా?' అని హీరోయిన్ అంటే.. 'నువ్వు పెద్ద బాగోవు.. బాగా యావరేజ్' అని హీరో బదులిస్తాడు.. ఇక 'అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్ టైమ్ తెలిసింది' అని హీరోయిన్ సిగ్గులొలికితే.. 'అసలు అమ్మాయిలు పడేదే అబద్ధానికి.. పాపం అమాయకులు..' అంటూ హీరో హస్కీ వాయిస్‌లో చెప్తాడు. మొత్తానికి ఈ అబద్ధాల కథేంటో తెలుసుకోవాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’... వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. -
దర్శకులు మూడు రకాలు! – త్రివిక్రమ్
– త్రివిక్రమ్ ‘‘దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్లు. సెట్ డైరెక్టర్లు అన్నారు. ఆయనకు తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. సినిమా అంతా అయిపోయి రిలీజ్ తర్వాత ఇది ఇలాకన్నా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాను. అది నేను. సో .. మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు’’ అన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను మణిశర్మ ఫ్యాన్‌ని. ఆయన గురించి చెప్పే స్థాయి మనకు లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నాను. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, వెంకట్‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్, సెట్ డైరెక్టర్. నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్‌ను. హను సెట్లో సీన్‌ను ఊహించగలడు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనిల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్. ఇప్పుడు వీరికి తోడుగా వెంకట్ వచ్చారు. వారి కోసం సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్ లుక్ బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం వెనక చిత్రబృందం కృషి ఎంతో ఉంది. ఈ సినిమాను నితిన్ నాకన్నా ఎక్కువగా నమ్మాడు’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ (పవన్ కల్యాణ్) గారు ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఆయన సోల్మెట్ త్రివిక్రమ్ వచ్చారు కాబట్టి, ఆయన వచ్చినట్టే. నా కెరీర్లో ఇది 24వ సినిమా. నెక్ట్స్ 25వ సినిమా కల్యాణ్‌గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను చేయబోతున్న ఫస్ట్ సినిమా. అంతకంటే ఒక ఫ్యాన్‌గా నాకేం కావాలి. అనిల్‌గారు నా స్వీట్ హార్ట్. గోపీగారు, రామ్‌గారు, వెంకట్‌గారు చాలా ప్యాషనెట్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్స్. హనూకి సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీ–రికార్డింగ్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘మూవీ స్టార్ట్ చేసిన రోజునే ఆగస్టు 11న రిలీజ్ అనుకున్నాం. ఇప్పుడు అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు. -
నా దృష్టిలో అన్నయ్యే హీరో... నేను కాదు! : పవన్ కల్యాణ్
‘‘అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. టెక్నీషియన్ అవుదామనుకున్నా. హీరో అవుతాననే నమ్మకం లేదు. తోట పని కావొచ్చు... వీధులు ఊడ్చే పని కావొచ్చు... ఏ పనైనా నిస్సిగ్గుగా, గర్వంగా, నిజాయితీగా చేస్తా. సినిమాలు భగవంతుడు ఇచ్చిన భిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, కష్టపడాలో ఇన్నేళ్లూ అంతే కష్టపడ్డాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిజాయితీగా చేస్తా’’ అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన హీరోగా కిశోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ ప్రీ–రిలీజ్ వేడుక శనివారం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ నచ్చింది. ప్రేక్షకుడిలా థియేటర్లో సినిమా చూస్తా. చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి... ఇటువైపు వెళ్లమని చెయ్యి చూపిస్తే... అక్కడ ఏముందని ఆలోచించకుండా జనం పరిగెత్తే ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి... ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తారు. అలాంటి ఒక్కడి పేరు (పవన్‌కల్యాణ్) మీకు తెలుసు. నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంత మంది ఎందుకు ప్రేమిస్తారు. ఇది (పవన్) నిలువెత్తు మంచితనం’’ అన్నారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘నా ఉద్దేశంలో చిరంజీవిగారే హీరో, నేను కాదు. ‘సుస్వాగతం’ పెద్ద హిటై్టన తర్వాత కర్నూల్లో ఫంక్షన్‌కి పిలిచారు. (కాటమరాయుడు ప్రీ–రిలీజ్ ఫోటోలు) వెళ్లకపోతే పొగరనుకుంటారని వెళ్లా. ఐదు కిలోమీటర్లు ర్యాలీగా తీసుకువెళతామన్నారు. ‘అన్నయ్యను చూడడానికి వస్తారు. నన్నెవరు చూస్తారు’ అన్నా. హోటల్ బయట రోడ్ల పై విపరీతమైన జనం. ప్రేమతో చేతులు ఊపుతున్నారు. నేను చేతులు జోడించి నమస్కరించా. నా జీవితంలో నేను నేర్చుకున్నవి లేదా అర్థం చేసుకున్నవి కావొచ్చు... నా సినిమాల్లో వచ్చాయి. అది యాదృచ్ఛికమో.. యాక్సిడెంటో.. నాకు తెలీదు. ‘సుస్వాగతం’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చాను. ఆ సీన్ 40 టేకులు చేశా. అది చేసిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయా. నిజంగా నా తండ్రి చనిపోతే నేనింక ఏడుస్తానా? అనిపించింది. ‘జల్సా’ చేసే టైమ్‌లో మా నాన్నగారు చనిపోతే... నాకు ఏడుపు రాలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు. నేను మొదట్నుంచీ ‘మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. అది మన యువతీ యువకుల్లో ఉన్న శక్తి. ‘నువ్వు ఇది చేయలేవు. నీవల్ల కాదు’ అనే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పడానికి నిదర్శనం ‘తమ్ముడు’ సినిమా. ‘ఖుషి’ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు హైటెక్ సిటీ థియేటర్లో మా టీమ్‌తో కలసి సినిమా చూస్తున్నప్పుడు.. ‘రాబోయే కొన్ని సంవత్సరాలు నీకు గడ్డుకాలం ఉంటుంది. చాలా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి’ అనే భావన కలిగింది. మనసు కీడు శంకించింది. నీరసం, బాధ వచ్చేశాయి. ఆ రోజు కోల్పోయిన శక్తి ‘గబ్బర్‌సింగ్’లో పోలీస్ స్టేషన్ సీన్ చేసేవరకూ పుంజుకోలేకపోయా. అప్పటివరకూ భగవంతుడిని యాచించా. నేనెప్పుడూ తమ్ముణ్ణే. నా జీవితంలో ఎవరికీ అన్నయ్యను కాదు. అలాంటిది మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యను అయ్యా. ప్రతి సినిమా కష్టపడి చేస్తా. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకుంటా’’ అన్నారు. శరత్ మరార్ మాట్లాడుతూ – ‘‘మా టీమ్ లీడర్ కాటమరాయుడే (పవన్). కల్యాణ్‌గారు హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్లినప్పుడు సూట్లో హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇప్పుడీ పంచెకట్టులో డబుల్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారికి ఒక్క సినిమా అయినా చేస్తానో లేదో అనుకున్నా. కానీ, రెండో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు’’ అన్నారు అనూప్ రూబెన్స్. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్య ట్రైలర్ చూస్తుంటే నేనే తీశానా? అనిపిస్తోంది. ‘గోపాల గోపాల’ అప్పుడు కల్యాణ్‌గారితో ఫుల్ సినిమా చేయాలనిపించింది. ఇప్పుడీ సినిమా చేశా క ఐదారు సినిమాలు చేస్తే గానీ నా దాహం తీరేలా లేదు’’ అన్నారు.