Megha Akash Dear Megha Movie Trailer Out Now - Sakshi
Sakshi News home page

Dear Megha: డియర్‌ మేఘ ట్రైలర్‌ చూశారా?

Published Mon, Aug 30 2021 8:03 AM | Last Updated on Mon, Aug 30 2021 10:38 AM

Megha Akash, Adith Arun Dear Megha Movie Trailer Released - Sakshi

Dear Megha Trailer: ‘‘డియర్‌ మేఘ’ సినిమా నా కెరీర్‌లో ఇంపార్టెంట్‌ మూవీ. ప్రేమకథని పెద్దస్థాయిలో తీయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపిస్తే చాలు’’ అని హీరో అరుణ్‌ అదిత్‌ అన్నారు. మేఘా ఆకాష్, అరుణ్‌ అదిత్, అర్జున్‌ సోమాయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. కథలకు ముగింపు ఉంటుందేమో కానీ ప్రేమకథలకు ముగింపు ఉండదంటూ వచ్చిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ సందర్భంగా అరుణ్‌ అదిత్‌ మాట్లాడుతూ– ‘‘2009లో నా కెరీర్‌ ప్రారంభమైంది. తమన్నాగారితో ‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌సిరీస్‌ చేస్తున్నప్పుడు ‘డియర్‌ మేఘ’కి ఓకే చెప్పాను. ‘‘అమ్మాయి పేరు మీద ‘డియర్‌ మేఘ’ అని టైటిల్‌ పెడుతున్నాం.. నీకు అభ్యంతరం లేదుగా?’’ అని సుశాంత్‌ అడిగారు. ‘నాకు కథే ముఖ్యం.. టైటిల్‌ కాదు’ అని చెప్పాను. హీరోగానే కాదు. నటనకు ఆస్కారం ఉండే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. నేను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘కథ కంచికి మనం ఇంటికి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement