Arun adit
-
డియర్ మేఘ ట్రైలర్: ప్రేమకథలకు ముగింపు లేదట!
Dear Megha Trailer: ‘‘డియర్ మేఘ’ సినిమా నా కెరీర్లో ఇంపార్టెంట్ మూవీ. ప్రేమకథని పెద్దస్థాయిలో తీయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపిస్తే చాలు’’ అని హీరో అరుణ్ అదిత్ అన్నారు. మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమాయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కథలకు ముగింపు ఉంటుందేమో కానీ ప్రేమకథలకు ముగింపు ఉండదంటూ వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా అరుణ్ అదిత్ మాట్లాడుతూ– ‘‘2009లో నా కెరీర్ ప్రారంభమైంది. తమన్నాగారితో ‘లెవెన్త్ అవర్’ వెబ్‌సిరీస్ చేస్తున్నప్పుడు ‘డియర్ మేఘ’కి ఓకే చెప్పాను. ‘‘అమ్మాయి పేరు మీద ‘డియర్ మేఘ’ అని టైటిల్ పెడుతున్నాం.. నీకు అభ్యంతరం లేదుగా?’’ అని సుశాంత్ అడిగారు. ‘నాకు కథే ముఖ్యం.. టైటిల్ కాదు’ అని చెప్పాను. హీరోగానే కాదు. నటనకు ఆస్కారం ఉండే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. నేను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘కథ కంచికి మనం ఇంటికి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
మేఘా ఆకాశ్.. ‘డియర్ మేఘ’
మేఘ ఏదో బాధలో ఉంది. ఈ బాధకు కారణం ఎవరు? మేఘ కళ్లు ఎందుకు చెమర్చాయి? అనేది ‘డియర్ మేఘ’ సినిమా చూస్తే తెలుస్తుంది. మేఘా ఆకాశ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘డియర్ మేఘ’. అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రానా, గౌతమ్ వాసుదేవమీనన్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. మోషన్ పోస్టర్లో మేఘ కన్నీరు పెట్టుకుంటూ, బాధలో ఉన్నట్లు కనబడుతుంది. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: ఐ ఆండ్రూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి. -
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
ఫోరెన్సిక్ పరీక్షల నేపథ్యంలో...
అమలా పాల్ హీరోయిన్గా, అరుణ్ ఆదిత్ హీరోగా అనూప్ పనికర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. ఫణీ ంద్ర కుమార్, ప్రభు వెంకటాచలం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘రాక్షసుడు’ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. తమ్మారెడి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఫోరెన్సిక్ థ్రిల్లర్ అనే కొత్త జోనర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఫోరెన్సిక్ పరీక్షలు అంటే ఏంటో ఈ సినిమాలో చూపించనున్నారు’’ అన్నారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నా. తమిళంలో అజయ్ పనికర్‌తో కలిసి నిర్మిస్తున్నా. తమిళంలో ‘కడావర్’ అనే టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘నా గత సినిమా విడుదలైన తర్వాత ‘ఇమ్రాన్ హష్మి అవుదామనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తున్నారు.. అలాంటిదేమీ లేదు’’ అన్నారు అరుణ్ ఆదిత్. ‘‘చెన్నైలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అభిలాష్ ఈ కథ రాశారు’’ అన్నారు అనూప్ పనికర్. నటుడు వినోద్ సాగర్, కెమెరామేన్ అరవింద్ సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రోనీ. -
పెద్దలకు మాత్రమే!
అరుణ్ ఆదిత్, నిక్కీ తంబోలీ జంటగా సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. బ్లూ గోస్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్ మాట్లాడుతూ– ‘‘కామెడీతో సాగే హారర్ చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలుంటాయి. ఇంతకు ముందు నేనే నటించిన ‘ఎల్ 7’ అనే హారర్ మూవీ సరిగ్గా ఆడలేదు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘దక్షిణాదిలో ఈ జోనర్ కొత్త. నేను తమిళంలో తెరకెక్కించిన చిత్రాన్ని ఇక్కడ రీమేక్ చేశాను. 18 ఏళ్లు దాటిన వాళ్లే ఈ సినిమా చూడండి. ఇది బూతు చిత్రం కాదు. మంచి ఎమోషన్స్ ఉంటాయి. భయపెడుతూనే నవ్విస్తాం’’ అన్నారు సంతోష్ పి.జయకుమార్. ‘‘ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అని కథానాయిక నిక్కీ తంబోలీ చెప్పారు. -
ఇది బూతు సినిమా కాదు
‘‘24 కిస్సెస్ అనగానే చాలా మంది బూతు సినిమా అనుకుంటున్నారు. కానే కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న అందమైన ప్రేమకథ’’ అన్నారు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా అయోధ్యకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘24 కిస్సెస్’. సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్ మూవీ రాదు. ‘మిణుగురులు’ టీమ్ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్‌స్టోరీ 24 కిస్సెస్. ఇందులో ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. ‘‘సినిమా రిలీజ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఎగై్జట్‌మెంట్‌తో పాటు నెర్వస్‌గా ఉంది. మంచి రిజల్ట్ వస్తుందన్న నమ్మకం ఉంది’’అన్నారు హెబ్బా పటేల్. ‘‘రిలీజైన ట్రైలర్‌కి, సాంగ్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. మర్చిపోలేని ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు అరుణ్. -
విజువల్స్ చాలా బాగున్నాయి
‘‘24 కిస్సెస్’ సినిమా ఆడియో లాంచ్‌కి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. చిత్రదర్శకుడు అయోధ్యకుమార్‌గారికి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో మరిన్ని అవార్డులు రావాలి’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘24 కిస్సెస్’. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్.సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రం పాటలను మంచు లక్ష్మి విడుదల చేశారు. అయోధ్య కుమార్ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్’ జర్నీ 2016లో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని బోల్డ్ సినిమాగా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తిస్తున్నారు’’ అన్నారు. ‘‘24 కిస్సెస్’ వెనుక 24 కారణాలుంటాయని, 24 క్రాఫ్ట్స్‌ని వాడుకుని సినిమాని చాలా కళాత్మకంగా తీశారని నమ్ముతున్నాను’’ అని డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ అన్నారు. ‘‘నా కెరీర్‌కి ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది’’ అని హెబ్బా పటేల్ అన్నారు. ‘‘ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా లేదు.. సక్సెస్ మీట్‌లా ఉంది’’ అన్నారు అరుణ్ అదిత్. ఈ వేడుకలో నిర్మాత కిషోర్, నటుడు నరేష్, హీరోలు నవీన్ చంద్ర, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, సందీప్ కిషన్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, నటుడు శశాంక్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జిగేల్’
కథ సినిమాతో హీరోగా పరిచయం అయిన అరుణ్ ఆదిత్ ఇటీవల గరుడవేగ సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగేల్’. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్ సరసన ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లి యేలూరి మాట్లాడుతూ.. ‘కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతొన్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది. జులై 30 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆగస్ట్ 20 వరకు జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్‌లో సినిమా టోటల్ షూట్ పూర్తి చేస్తామన్నా’రు. చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. ‘భారీ తారాగణంతో , కథకు తగ్గ బడ్జెట్ తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బెస్ట్ టీమ్ వర్క్ చేస్తున్నారు. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మా టీమ్ అందరికి జిగేల్ మంచి పేరును తీసుకువస్తుందన్నా’రు. -
ఉత్సవం చెరి సగం
అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘24 కిస్సెస్’. సిల్లీమాంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయో«ధ్య కుమార్ నిర్మించారు. శుక్రవారం ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ ్టలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం’ అనే ట్యాగ్‌లైన్ ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం టీజర్ ఈ రోజు రిలీజ్ కానుంది. అదితి మ్యాక, రావు రమేశ్, నరేశ్ ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు జాయ్ బరువ సంగీతం అందించారు. గిరిధర్ మావిడిపల్లి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ∙హెబ్బాపటేల్, అరుణ్ ఆదిత్ -
కామెడీ జిగేల్
‘కథ’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో అరుణ్ ఆదిత్. ఇటీవల ‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి, మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం అరుణ్ ఆదిత్ ‘జిగేల్’ అనే కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏలూరి మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ధీ ఇద్నానీ కథానాయికగా నటిస్తున్నారు. గురువారం ముహూర్తం జరిపి, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ – ‘‘భారీ తారాగణంతో, మంచి బడ్జెట్‌తో హై క్వాలిటీతో ‘జిగేల్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా అరుణ్ ఆదిత్ ఫర్పెక్ట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్. -
పొదు నలన్ కరుది చిత్రానికి శ్రీకారం
తమిళసినిమా; పొదు నలన్ కరుది చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. ఇటీవల దిల్లుక్కు దుడ్డు వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు రామ్‌బాల శిష్యుడు జియోన్ తొలి సారిగా మెగాఫోన్ పడుతున్న చిత్రం పొదు నలన్ కరుది. కరుణాకరన్, తంగమగన్ చిత్రం ఫేమ్ ఆదిత్ అరుణ్, కథై తిరైకథై వచనం ఇయక్కమ్ చిత్రం ఫేమ్ సంతోష్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళి భామ అనుసితార, లీసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో యోగ్ జప్పీ, ఇమాన్ అన్నాచ్చి, వళక్కు ఎన్ 18/9 చిత్రం ఫేమ్ ముత్తురామన్, సూపర్‌గుడ్ సుబ్రమణి, రాజా తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ వేర్వేరు లక్ష్యాలతో చెన్నైకి వచ్చిన ముగ్గురు యువకులు తమ లక్ష్యాలను సాధించారా? లేదా? అన్నది చిత్ర సింగిల్ లైన్ కథ అన్నారు. కాగా ఇందులో సమాజానికి కావలసిన మంచి సందేశం ఉందని అన్నారు. సీరియస్‌గా సాగే సెంటిమెంటల్ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి చక్కని ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిపారు.