పొదు నలన్ కరుది చిత్రానికి శ్రీకారం | pothu nalan karuthi movie | Sakshi
Sakshi News home page

పొదు నలన్ కరుది చిత్రానికి శ్రీకారం

Published Tue, Jul 26 2016 2:44 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

పొదు నలన్ కరుది చిత్రానికి శ్రీకారం - Sakshi

పొదు నలన్ కరుది చిత్రానికి శ్రీకారం

తమిళసినిమా; పొదు నలన్ కరుది చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. ఇటీవల దిల్లుక్కు దుడ్డు వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు రామ్‌బాల శిష్యుడు జియోన్ తొలి సారిగా మెగాఫోన్ పడుతున్న చిత్రం పొదు నలన్ కరుది. కరుణాకరన్, తంగమగన్ చిత్రం ఫేమ్ ఆదిత్ అరుణ్, కథై తిరైకథై వచనం ఇయక్కమ్ చిత్రం ఫేమ్ సంతోష్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళి భామ అనుసితార, లీసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
  ఇతర పాత్రల్లో యోగ్ జప్పీ, ఇమాన్ అన్నాచ్చి, వళక్కు ఎన్ 18/9 చిత్రం ఫేమ్ ముత్తురామన్, సూపర్‌గుడ్ సుబ్రమణి, రాజా తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ వేర్వేరు లక్ష్యాలతో చెన్నైకి వచ్చిన ముగ్గురు యువకులు తమ లక్ష్యాలను సాధించారా? లేదా? అన్నది చిత్ర సింగిల్ లైన్ కథ అన్నారు. కాగా ఇందులో సమాజానికి కావలసిన మంచి సందేశం ఉందని అన్నారు. సీరియస్‌గా సాగే సెంటిమెంటల్ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement