విజువల్స్‌ చాలా బాగున్నాయి | Lakshmi Manchu Speech At 24 Kisses Pre Release Function | Sakshi
Sakshi News home page

విజువల్స్‌ చాలా బాగున్నాయి

Published Mon, Nov 19 2018 2:16 AM | Last Updated on Mon, Nov 19 2018 2:16 AM

Lakshmi Manchu Speech At 24 Kisses Pre Release Function - Sakshi

అదిత్, సందీప్, సంజయ్‌ రెడ్డి, మంచు లక్ష్మి, నవదీప్, హెబ్బా పటేల్, అయోధ్యకుమార్‌

‘‘24 కిస్సెస్‌’ సినిమా ఆడియో లాంచ్‌కి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. విజువల్స్‌ చాలా  బాగున్నాయి. చిత్రదర్శకుడు అయోధ్యకుమార్‌గారికి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో మరిన్ని అవార్డులు రావాలి’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. అరుణ్‌ అదిత్, హెబ్బా పటేల్‌ జంటగా అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘24 కిస్సెస్‌’. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్‌ లైన్‌.సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లెల, అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ చిత్రం పాటలను మంచు లక్ష్మి విడుదల చేశారు.

అయోధ్య కుమార్‌ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్‌’ జర్నీ 2016లో స్టార్ట్‌ అయ్యింది. ఈ చిత్రాన్ని బోల్డ్‌ సినిమాగా కాకుండా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాగా గుర్తిస్తున్నారు’’ అన్నారు. ‘‘24 కిస్సెస్‌’ వెనుక 24 కారణాలుంటాయని, 24 క్రాఫ్ట్స్‌ని వాడుకుని సినిమాని చాలా కళాత్మకంగా తీశారని నమ్ముతున్నాను’’ అని డైరెక్టర్‌ చంద్రసిద్ధార్థ్‌ అన్నారు. ‘‘నా కెరీర్‌కి ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది’’ అని హెబ్బా పటేల్‌ అన్నారు. ‘‘ఇది ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లా లేదు.. సక్సెస్‌ మీట్‌లా ఉంది’’ అన్నారు అరుణ్‌ అదిత్‌. ఈ వేడుకలో నిర్మాత కిషోర్, నటుడు నరేష్, హీరోలు నవీన్‌ చంద్ర, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, సందీప్‌ కిషన్, డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, నటుడు శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement