ఆయన హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారు: మేఘా ఆకాష్‌ | Megha Akash Interesting Comments On Vijay Antony In Toofan Movie Pre Release Event, Deets Inside | Sakshi
Sakshi News home page

ఆయన హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారు: మేఘా ఆకాష్‌

Published Mon, Jul 29 2024 12:09 PM | Last Updated on Mon, Jul 29 2024 12:38 PM

Megha Akash Comments On Vijay Antony

స్టైలిష్‌ పాత్రలకన్నా, పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ పాత్రలకైనా నప్పే నటీమణులకు కోలీవుడ్‌ ఎప్పుడూ ఎర్ర తివాచీ పరుస్తుంది. అలాంటి ప్రతిభావంతులైన నటీమణుల్లో నటి మేఘా ఆకాష్‌ ఒకరని చెప్పవచ్చు. ఈమె పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అలా మేఘా ఆకాష్‌ తాజాగా కథానాయికగా నటించిన చిత్రం మళై పిడిక్కాద మనిదన్‌ తెలుగులో తుఫాన్‌. నటుడు సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఇందులో శరత్‌ కుమార్‌, సత్యరాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 

విజయ్‌ మిల్టన్‌ ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ పతాకంపై కమల్‌ బోహ్రా, డి లలిత, పి ప్రదీప్‌, పంకజ్‌ బోహ్రా కలిసి నిర్మించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 2వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి మేఘ ఆకాష్‌ కోరుకుంటూ నటుడు విజయ్‌ ఆంటోని తన చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. మళై పిడిక్కాద మనిదన్‌ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు కథను వినకముందే తనకు బలమైన పాత్ర లభించిందనే భావన కలిగిందన్నారు.

అలాగే ఈ చిత్రంలో తనలోని నటనను ప్రదర్శించే మంచి పాత్ర లభించిందన్నారు. తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే మంచి కథ పాత్రను నటుడు విజయ్‌ ఆంటోని ఈ చిత్రంలో కల్పించారన్నారు. ఈ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన విజయ్‌ ఆంటోని, దర్శకుడు విజయ్‌ మిల్టన్‌, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని నటి మేఘా ఆకాష్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement