Vijay Anthony
-
ఆయన హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారు: మేఘా ఆకాష్
స్టైలిష్ పాత్రలకన్నా, పక్కింటి అమ్మాయి ఇమేజ్ పాత్రలకైనా నప్పే నటీమణులకు కోలీవుడ్ ఎప్పుడూ ఎర్ర తివాచీ పరుస్తుంది. అలాంటి ప్రతిభావంతులైన నటీమణుల్లో నటి మేఘా ఆకాష్ ఒకరని చెప్పవచ్చు. ఈమె పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అలా మేఘా ఆకాష్ తాజాగా కథానాయికగా నటించిన చిత్రం మళై పిడిక్కాద మనిదన్ తెలుగులో తుఫాన్. నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఇందులో శరత్ కుమార్, సత్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విజయ్ మిల్టన్ ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోహ్రా, డి లలిత, పి ప్రదీప్, పంకజ్ బోహ్రా కలిసి నిర్మించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి మేఘ ఆకాష్ కోరుకుంటూ నటుడు విజయ్ ఆంటోని తన చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. మళై పిడిక్కాద మనిదన్ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు కథను వినకముందే తనకు బలమైన పాత్ర లభించిందనే భావన కలిగిందన్నారు.అలాగే ఈ చిత్రంలో తనలోని నటనను ప్రదర్శించే మంచి పాత్ర లభించిందన్నారు. తన కెరీర్లోనే గుర్తుండిపోయే మంచి కథ పాత్రను నటుడు విజయ్ ఆంటోని ఈ చిత్రంలో కల్పించారన్నారు. ఈ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన విజయ్ ఆంటోని, దర్శకుడు విజయ్ మిల్టన్, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని నటి మేఘా ఆకాష్ అన్నారు. -
‘లవ్ గురు’ మూవీ టీమ్ బంపరాఫర్.. ఫ్రీగా ఫ్యామిలీ టూర్!
తమ సినిమాను చూస్తే ఫ్రీగా మలేషియా, కశ్మీర్, ఊటీ విహార యాత్రకు తీసుకెళ్తామని చెబుతోంది ‘లవ్ గురు’ టీమ్. విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా రోజు రోజుకూ చేరువవుతోంది. ఈ చిత్రం మరింత మందికి చేరువయ్యేలా చేసేందుకు మేకర్స్ ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొంతమందిని ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను తీసుకెళ్తామని "లవ్ గురు" టీమ్ తెలిపింది. నేటి(ఏప్రిల్ 14)బ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "లవ్ గురు" సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం "లవ్ గురు" సినిమా టీమ్ కల్పిస్తోంది. Watch #LoveGuru in theatres with your family and stand a chance to win an all paid trip with your family ✨ 3 lucky winners to 3 exotic holiday destinations, follow the steps mentioned above 🤩 Hurry up, book now 💥 🎟️ https://t.co/ZdTixXBQZE Telugu Release by @MythriOfficial… pic.twitter.com/fnzhbYyhPq — Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2024 -
‘లవ్ గురు’ ప్రేమించడం నేర్పిస్తుంది : విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని, మృణాళినీ రవి హీరో హీరోయిన్లుగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ 11న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఈ కథలో తనంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఓ అబ్బాయి. పెళ్లి తర్వాత తనను అర్థం చేసుకుంటుందని భావిస్తాడు. కానీ పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయిపై ఆ అమ్మాయికి ఇష్టం ఏర్పడదు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకోవాలనుకుంటాడు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. ‘లవ్ గురు’ సినిమా కోసం మైత్రీతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. ఇక మా ప్రొడక్షన్లో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. నా దర్శకత్వంలోనే ‘బిచ్చగాడు 3’ ఉంటుంది. 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. -
ఆమెతో కిచుకిచులకు ప్రయత్నించా..వర్కౌట్ కాలేదు: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రోమియో. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా వినాయక్ వైద్యనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి మృణాళిని రవి నాయకిగా నటించిన ఇందులో యోగిబాబు, వీటీవీ.గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా, శీజా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం రంజాన్ సందర్భంగా వచ్చే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. రోమియో చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చిత్ర దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ ఒక స్త్రీ తన భర్తను ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం అని పేర్కొన్నారు. ఈ కథకు స్ఫూర్తి తన తల్లి అని అన్నారు. తాను ఒక షార్ట్ ఫిలిం చేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్‌ఆంటోని నుంచి ఫోన్‌కాల్ వచ్చిందన్నారు. తాను చేసిన షార్ట్ ఫిలిం గురించి ఎంతో డిటైల్‌గా వివరించి మంచి కథ ఉంటే చెప్పండి అని ఆయన అన్నారన్నారు. దీంతో ఆయన హీరోగా ఒక లవ్‌స్టోరీని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు కథను రెడీ చేయడానికి ఏడాది గడువు అడిగినట్లు చెప్పారు. అలా మొదలైంది రోమియో చిత్రం అని చెప్పారు. విజయ్‌ఆంటోని మాట్లాడుతూ మృణాళిని ఆత్మవిశ్వాసం కలిగిన మంచి అమ్మాయి అని పేర్కొన్నారు. రోమియో చిత్ర ప్రచారం కోసం తమ గురించి కిచుకిచులు చేయాలని ప్రయత్నించామని, అయితే అవేవి వర్కౌట్ కాలేదన్నారు. తాను తొలిసారిగా ఒక ప్రేమ కథా చిత్రంలో నటించినట్లు చెప్పారు. ఒక స్త్రీ మగవాడిని హింసిస్తుందీ, అతను దాన్ని ఎలా భరిస్తాడు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రోమియో అని చెప్పారు. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
ఎన్నో కోల్పోయా..బాధతో జీవించడం అలవాటైంది: విజయ్ ఆంటోని
తమిళసినిమా: నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడం వంటి విజయవంతమైన చిత్రాల ఫేమ్ సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ కలిసి నటించిన ఇందులో నటి మహిమా నంబిరాయర్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించగా నిళల్గల్ రవి, జగన్ ముఖ్యపాత్రలు పోషించారు. కన్నన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 6న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా రత్తం చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత టీజీ త్యాగరాజన్, అమ్మా క్రియేషన్స్ టి.శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ మాట్లాడుతూ దర్శకుడు సీఎస్ అముదమ్ తన గత చిత్రాలకు పూర్తిభిన్నంగా రత్తం చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు. విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఇది పాత్రికేయుల ఇతివృత్తంతో రూపొందిన కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్రం బాగా వచ్చిందని తనకు ఇందులో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అలాగే తన కూతురు మరణాన్ని తలుచుకుంటూ..‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయాను. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నాను. బాధల నుంచే ఎంతో నేర్చుకున్నా’ అన్నారు. అనంతరం అమ్మా క్రియేషన్స్ టి.శివ మాట్లాడుతూ తాను రత్తం చిత్రాన్ని చూసి చెబుతున్నానని, చాలాబాగా వచ్చిందని చెప్పారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. విజయ్‌ఆంటోని కెరీర్ రత్తం చిత్రం స్పెషల్‌గా నిలిచిపోతుందన్నారు. ఆయన పుట్టెడు బాధల్లో ఉండి కూడా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, నిర్మాతల శ్రేయస్సు గురించి నటుల్లో తనకు తెలిసి తమిళ సినీ పరిశ్రమలో నటుడు విజయ్‌కాంత్ తరువాత విజయ్ఆంటోనినేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ఆంటోని తన చిన్న కూతురు లారాతో కలిసి పాల్గొన్నారు. -
'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ రేర్ పిక్స్
-
చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు
సాక్షి, చెన్నై: ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే చిక్కుల్లో పడ్డారు. ఆమెపై తమిళ నిర్మాత ఒకరు ఫిర్యాదు చేశారు. అమ్మ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని నిర్మాత శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోని, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 29శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ క్రమంలో హీరోయిన్ షాలినీకి రణ్‌బీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ భారీ అవకాశం రావడంతో షాలినీ పాండే యూటర్న్ తీసుకున్నారని, ఇక నుంచి దక్షిణాది సినిమాల్లో నటించలేదని ఆమె తేల్చిచెప్పారని నిర్మాత శివ వాపోతున్నారు. ఆమె అకస్మాత్తు నిర్ణయం వల్ల తాము తీవ్రస్థాయిలో నష్టపోయామని, ఎన్నిసార్లు పిలిచినా ఆమె షూటింగ్స్ రావడం లేదని, ఆకస్మికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని శివ నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన నిర్మాతల మండలిలోనూ, ఆర్టిస్టుల సంఘాల్లోనూ ఫిర్యాదు చేయనున్నట్టు శివ తెలిపారు. షాలినీ పాండేపై చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలని నిర్మాత శివ భావిస్తున్నారు. -
మళ్ళీ మళ్ళీ చూశా
అనురాగ్ కొణిదెన హీరోగా, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఈ క్షణమే...’ లిరికల్ పాటని హీరో విజయ్ ఆంటోనీ విడుదల చేశారు. హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘మంచి కథతో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటిటే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా మా సినిమా ఉంటుంది’’అని కె. కోటేశ్వరరావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమి–సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి. ∙అనురాగ్, విజయ్ ఆంటోనీ -
అంజలికే అగ్రస్థానం
తమిళసినిమా: నటి అంజలికే అగ్రస్థానం అంటే ఆసక్తిగా ఉంది కదూ. ఆ ఆరణాల తెలుగమ్మాయి ఏం సాధించింది? ఎందుకు అగ్రస్థానం ఇచ్చారు? లాంటి సందేహాలు కలగడం సాధారణమే. అయితే అంజలి నటిగా మంచి పేరునే తెచ్చుకుంది. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ తనకుంటూ ఒక మార్కెట్‌ను సంపాదించుకుంది. వరుసగా అవకాశాలను అందుకుంటోంది. తాజాగా అదనంగా మలయాళం చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా బహుభాషా నటిగా రాణించడం అంజలి నట కెరీర్‌కు మంచి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇతర భాషల్లో మార్కెట్ ఉన్న తమిళ హీరోలు నటి అంజలి తరహా బహుభాషా నటీమణులను నాయకిగా ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి హీరోలలో నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ఆంథోని కూడా చేరారు. ఆయన నటించిన పిచ్చైక్కారన్ చిత్రం తెలుగులో బిచ్చగాడు పేరుతో అనువాదమై కాసుల వర్షం కురిపిం చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నటించిన చిత్రాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా విజయ్‌ఆంథోని నటిస్తున్న చిత్రం కాళీ. గతంలో రజనీకాంత్ నటించిన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్ సంతరించుకుందనే చెప్పాలి. ఇంతకు ముందు వణక్కమ్ చెన్నై చిత్రాన్ని తెరకెక్కించిన కృతిక ఉదయనిధి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాళీ. ఇందులో విజయ్‌ఆంథోనికి జంటగా సునైనా, అమృతలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. తాజాగా నటి అంజలి కూడా ఈ చిత్రంలో భాగమైంది. అంతే కాదు ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కాళీ చిత్రంలో మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కంటే అంజలికే పాత్ర పరంగా అగ్రస్థానం కల్పించారట. ఇందుకు కారణం తెలుగు వ్యాపారం కోసమేనన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదనుకుంటా. అంజలి నటించిన బెలూన్ చిత్రం మంచి ఆదరణే అందుకుందన్నది గమనార్హం. -
సెంటిమెంట్ మళ్లీ ఫలిస్తుందట!
తమిళ సినిమా: కోలీవుడ్‌లో సరైన పాత్రలను ఎంపిక చేసుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ ఆంటోని. తనకు రొమాన్స్ కామెడీ సరిగ్గా రాదని గ్రహించిన ఈ హీరో.. సీరియస్ కథాంశాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన తాజా సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. విజయ్ మార్కెట్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘అన్నాదురై’ నవంబర్ 30న విడుదల కానుంది. కొత్త దర్శకుడు శ్రీనివాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక పాత్రలో ప్రేమలో ఓడిపోయి తాగుబోతుగా మారే యువకుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్రలో సెంటిమెంట్ సన్నివేశాలు అధికంగా ఉన్నాయి. ‘పిచ్చైకారన్’ (బిచ్చగాడు) సినిమాలో మదర్ సెంటిమెంట్ ఏవిధంగా కలిసివచ్చిందో.. ఈ సినిమాలో ప్రేమ సెంటిమెంట్ అదేవిధంగా కలిసివస్తుందని విజయ్ ఆంటోనీ ఆశిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని విజయ్ ఆంటోని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంద్ర... ఇంద్రసేనారెడ్డి గుర్తొచ్చాడు –చిరంజీవి
‘‘టైటిల్ వినగానే ఇంప్రెస్సివ్‌గా అనిపించడమే కాదు. నాకు నా సినిమా ‘ఇంద్ర’, అందులోని ‘ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి’ డైలాగ్ గుర్తొచ్చింది. స్టోరీ లైన్ విన్నా. ఇదొక యాక్షన్, సెంటిమెంట్ సినిమా. ప్రయోగమని చెప్పలేం. అలాగని, సగటు సినిమాల్లానూ ఉండదు. కొత్తగా, వెరైటీగా ఉంటుంది. ఇందులో కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. ‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన విజయ్ ఆంటోని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నా స్నేహితురాలు రాధిక పెద్ద విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా’’ అన్నారు చిరంజీవి. విజయ్ ఆంటోని నటిస్తున్న తెలుగు–తమిళ సినిమా ‘ఇంద్రసేన’. తమిళంలో ‘అన్నాదురై’గా రూపొందుతోంది. జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ సిన్మా ఫస్ట్ లుక్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. రాధిక మాట్లాడుతూ– ‘‘ఇంద్ర’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇండస్ట్రీకి ఇచ్చిన చిరంజీవిగారితోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయించాలని మా హీరో విజయ్ ఆంటోని పట్టుబట్టారు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మెగాస్టార్‌గారి చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదలవడం హ్యాపీగా ఉంది. రాధికగారు మాకు, మా సినిమాకు పెద్ద అండ’’ అన్నారు విజయ్ ఆంటోని. చిత్రదర్శకుడు జి. శ్రీనివాసన్, హీరోయిన్లు డైనా చంపిక, మహిమా, రచయిత భాష్య శ్రీ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను అనుష్క అంటున్నారు
అనుష్కలా ఉన్నావంటున్నారు అంటూ తెగమురిసిపోతోంది నవ నటి సుష్మారాజ్. అయితే ఈ బ్యూటీ కోలీవుడ్‌కే నూతన నటి. టాలీవుడ్లో రెండు చిత్రాలు చేసేసిందట. ఇండియా - పాకిస్తాన్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంతోని హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల ఎనిమిదవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇండియా- పాకిస్తాన్ చిత్రంలో నటించిన అనుభవాలను సుష్మారాజ్ పంచుకున్నారు. ఇండియా - పాకిస్తాన్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. బెంగళూరులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి తెలుగులో హీరోయిన్గా రెండు చిత్రాలు చేశాను. ఆ చిత్రాలు చూసే ఇండియా - పాకిస్తాన్ చిత్ర దర్శకుడు ఆనంద్ ఈ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇందులో నాది ధైర్యం గల యువతి పాత్ర. హీరో విజయ్ ఆంతోనితో తరచూ గొడవపడే పాత్ర. ఇంతకుముందు కాస్త అనుభవం ఉండడం వలన ప్రతి సన్నివేశాన్ని సింగిల్టేక్లో చేసేశాను. తమిళం నాకు పరిచయం అయిన భాష కావడంతో ఏమంత శ్రమ అనిపించలేదు. అయితే కోర్టు సన్నివేశంలో అచ్చ తమిళ భాష మాట్లాడాల్సి రావడంతో కాస్త కష్టపడాల్సి వచ్చింది. మరో విషయం ఏమిటంటే చిత్రంలోని పలకోటి పెగ్గలిల్ అనే పాటకు నా దుస్తులకు నేనే డిజైన్ చేసుకున్నాను. అలాగే కుక్కలంటే నాకు చాలా భయం అలాంటిది ఒక దెయ్యం సన్నివేశంలో నటిస్తుండగా ఒక కుక్క నాపై బడి కరిచింది. ఈ చిత్ర అనుభవాల్లో ఇదొకటి.