
అనురాగ్ కొణిదెన, విజయ్ ఆంటోనీ
అనురాగ్ కొణిదెన హీరోగా, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఈ క్షణమే...’ లిరికల్ పాటని హీరో విజయ్ ఆంటోనీ విడుదల చేశారు. హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘మంచి కథతో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటిటే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా మా సినిమా ఉంటుంది’’అని కె. కోటేశ్వరరావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమి–సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి.
∙అనురాగ్, విజయ్ ఆంటోనీ
Comments
Please login to add a commentAdd a comment