సాక్షి, చెన్నై: ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే చిక్కుల్లో పడ్డారు. ఆమెపై తమిళ నిర్మాత ఒకరు ఫిర్యాదు చేశారు. అమ్మ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని నిర్మాత శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోని, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 29శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ క్రమంలో హీరోయిన్ షాలినీకి రణ్‌బీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ భారీ అవకాశం రావడంతో షాలినీ పాండే యూటర్న్ తీసుకున్నారని, ఇక నుంచి దక్షిణాది సినిమాల్లో నటించలేదని ఆమె తేల్చిచెప్పారని నిర్మాత శివ వాపోతున్నారు.
ఆమె అకస్మాత్తు నిర్ణయం వల్ల తాము తీవ్రస్థాయిలో నష్టపోయామని, ఎన్నిసార్లు పిలిచినా ఆమె షూటింగ్స్ రావడం లేదని, ఆకస్మికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని శివ నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన నిర్మాతల మండలిలోనూ, ఆర్టిస్టుల సంఘాల్లోనూ ఫిర్యాదు చేయనున్నట్టు శివ తెలిపారు. షాలినీ పాండేపై చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలని నిర్మాత శివ భావిస్తున్నారు.
చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు
Published Tue, Dec 24 2019 11:18 AM | Last Updated on Tue, Dec 24 2019 11:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment