సెంటిమెంట్‌ మళ్లీ ఫలిస్తుందట! | vijay anthony confident about his latest movie | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 7:05 PM | Last Updated on Tue, Nov 21 2017 7:07 PM

vijay anthony confident about his latest movie - Sakshi

తమిళ సినిమా: కోలీవుడ్‌లో సరైన పాత్రలను ఎంపిక చేసుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో విజయ్‌ ఆంటోని. తనకు రొమాన్స్‌ కామెడీ సరిగ్గా రాదని గ్రహించిన ఈ హీరో.. సీరియస్‌ కథాంశాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన తాజా సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. విజయ్‌ మార్కెట్‌ను పెంచాయి. 

ఈ నేపథ్యంలో విజయ్‌ ఆంటోని తాజా చిత్రం ‘అన్నాదురై’ నవంబర్‌ 30న విడుదల కానుంది. కొత్త దర్శకుడు శ్రీనివాసన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక పాత్రలో ప్రేమలో ఓడిపోయి తాగుబోతుగా మారే యువకుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్రలో సెంటిమెంట్‌ సన్నివేశాలు అధికంగా ఉన్నాయి. ‘పిచ్చైకారన్‌’ (బిచ్చగాడు) సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌ ఏవిధంగా కలిసివచ్చిందో.. ఈ సినిమాలో ప్రేమ సెంటిమెంట్‌ అదేవిధంగా కలిసివస్తుందని విజయ్‌ ఆంటోనీ ఆశిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని విజయ్‌ ఆంటోని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement