
తెలుగులో బోలెడంత మంది హీరోయిన్లు. ఎప్పటికప్పుడు కొత్తోళ్లు వస్తుంటారు.

అలా 2017లో 'లై' సినిమాతో మేఘా ఆకాశ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న క్రేజ్ దక్కలేదు.

తమిళంలో మాత్రం ఎప్పటికప్పుడు మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె పుట్టినరోజు నేడు (అక్టోబర్ 26). ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు.

మద్రాసులో(ప్రస్తుతం చెన్నై) పుట్టి పెరిగిన మేఘా తండ్రి తెలుగు, తల్లి మలయాళీ.

అలా మేఘా ఆకాశ్ తెలుగు మూలాలున్న అమ్మాయి అవుతుంది.

2017 నుంచి తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది మేఘా ఆకాశ్.

రజినీకాంత్‌తో 'పేట' మూవీలోనూ కీ రోల్ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇవన్నీ పక్కనబెడితే గత ఆరేళ్లుగా సాయి విష్ణు అనే కుర్రాడితో ప్రేమలో ఉంది.

ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. సెప్టెంబరులో పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం మేఘా ఆకాశ్ చేతిలో రెండు సినిమాలున్నాయి.

పెళ్లయిపోయింది కదా కొత్తగా సినిమాలు చేస్తుందా లేదా యాక్టింగ్‌కి పుల్‌స్టాప్ పెట్టేస్తుందా అనేది చూడాలి.
