టైటిల్: మనుచరిత్ర
నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాశ్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
నిర్మాణ సంస్థ: ప్రొద్దుటూరు టాకీస్
నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి
దర్శకత్వం: భరత్ పెదగాని
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
విడుదల తేది: జూన్ 23, 2023
మనుచరిత్ర కథేంటంటే..
వరంగల్‌కు చెందిన మను (శివకందుకూరి) ఓ బ్రిలియంట్ స్టూడెంట్. కాలికాట్ ఎన్‌ఐటీలో చదవాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్‌లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతాడు. శ్రావ్య, ఆయేషా, జాను.. ఇలా చాలా మందికి ఐ లవ్ యూ చెప్పి కొన్నాళ్ల తర్వాత చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెబుతుంటాడు. సిన్సియర్‌గా ప్రేమించే మను ఎందుకు అలా బ్రేకప్ చేబుతాడు? బ్రిలియట్ స్టూడెంట్‌గా ఉన్న ఆయన ఎందుకు మద్యానికి బానిసైనాడు? అసలు జేన్నీ(మేఘ ఆకాశ్) ఎవరు? ఆమెకి మనుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్థానిక రౌడీ రుద్ర (డాలి ధనంజయ)తో కలసి మను ఎలాంటి పనులు చేశాడు? చివరకు మను జీవితం ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
వరంగల్ నేపథ్యంలో సాగే ఓ కుర్రాడి ప్రేమకథే ఈ చిత్రం. తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి, ఆమె ప్రేమని మరో అమ్మాయిలో వెతుక్కునే ఓ కుర్రాడి కథ ఇది. ఇలాంటి ప్రేమ కథకు అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 తరహాలో గుండాయిజాన్ని తగిలించి కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఓ మర్డర్ సీన్ తో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత ఓ ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే అసలు కథ ప్రారంభమయ్యాకే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతిసారి ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం.. అర్థంలేని కారణాలతో బ్రేకప్ చెప్పడం..ఇలాగే సాగుతుంది.
సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది.
జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. ఇద్దరి ప్రేమని పెద్దవాళ్లకి చెప్పడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం, ఇక లైఫ్‌లో అంతా హ్యాపీ అనుకునే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు, ఎదురైన ట్విస్ట్ లు ఉత్కంఠ క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం నడపడానికి కథే ఉండదు. ఫస్టాఫ్‌లో చూపించిన సన్నివేశాల చుట్టే కథను నడిపాడు. హీరో రౌడీయిజంలోకి దిగడం..ఆ తర్వాత జాను అనే మరో పాత్రని ప్రవేశపెట్టి ఇంకో లవ్ స్టొరీ ని చూపించడం.. కథంతా రొటీన్‌గా ఉంటుంది. అక్కడక్కడ `అర్జున్‌రెడ్డి` `ఆర్‌ఎక్స్ 100` సినిమాలను గుర్తుచేసేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి.
ఎవరెలా చేశారంటే..
మను పాత్రకు శివ కందుకూరి పూర్తి న్యాయం చేశాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. ఈ చిత్రంతో మాస్ లుక్ ట్రై చేసి మెప్పించాడు. జెన్నీ పాత్రలో మేఘా ఆకాశ్ ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ పాత్రల నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. విలన్ రుద్రగా ధనుంజయ్ మెప్పించాడు. హీరో స్నేహితుడిగా సుహాన్ మరోసారి అదరగొట్టేశాడు. మధు సూదన్, శ్రీకాంత్ అయ్యంగార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
గోపీ సుందర్ సంగీతం బాగుంది. చంద్రబోస్ రాసిన ‘ఎక్కడ ఉంటదిరో ఆ పిల్ల’ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, రిచ్ లుక్‌నిస్తున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment