Manu Charitra Streaming On This OTT Platform - Sakshi
Sakshi News home page

Manu Charitra Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న మను చరిత్ర, ఎక్కడంటే?

Published Fri, Jul 21 2023 5:07 PM | Last Updated on Fri, Jul 21 2023 5:19 PM

Manu Charitra Streaming On This OTT Platform - Sakshi

 శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాశ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. భరత్‌ పెదగాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్‌ పతాకంపై  నార్ల శ్రీనివాసరెడ్డి నిర్మించారు. చంద్రబోస్‌ ఈ సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించడం విశేషం. గోపీ సుందర్‌ సంగీత దర్శకుడిగా పనిచేసిన ఈ ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ సినిమా జూన్‌ 23న థియేటర్లలో విడుదలైంది. 

మిశ్రమ స్పందనను అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని మను చరిత్ర సినిమా యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

కథేంటంటే..
హీరో చదువులో టాపర్‌. కాలికాట్‌ ఎన్‌ఐటీలో చదవాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్‌లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్‌ యూ చెబుతాడు. చిన్న చిన్న కారణాలతో వారికి బ్రేకప్‌ చెబుతుంటాడు. అసలు అతడు తాగుడుకు ఎందుకు బానిసయ్యాడు? రౌడీతో కలిసి ఎలాంటి పనులు చేశాడు? చివరకు అతడి జీవితం ఏమయ్యిందనేది కథ!

చదవండి: మహిళా సెక్రటరీతో సహజీవనం.. పెళ్లై ఏడాది కాకముందే ఉరేసుకుని చనిపోయిన భర్త
ప్రభాస్‌ కల్కి గ్లింప్స్‌లో కమల్‌ హాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement