Vishwak Sen Launched Shiva Kandukuri And Megha Akash Manu Charitra Movie Trailer, Deets Inside - Sakshi
Sakshi News home page

మనుచరిత్ర పెద్ద హిట్‌ అవుతుంది: హీరో విశ్వక్‌ సేన్‌

Published Wed, Jun 14 2023 11:09 AM | Last Updated on Wed, Jun 14 2023 11:24 AM

Vishwak Sen Launched Manu charitra Trailer - Sakshi

‘‘లవ్, యాక్షన్‌ నా ఫేవరెట్‌ జోనర్‌. ‘మనుచరిత్ర’ అదే జానర్‌లో రూపొందినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్‌ కథానాయికలుగా నటించిన చిత్రం ‘మనుచరిత్ర’. భరత్‌ పెదగాని దర్శకత్వంలో ఎన్‌. శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న శ్రీ విజయ ఫిల్మ్ప్‌ ద్వారా విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని విశ్వక్‌ సేన్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజ్‌ కందుకూరిగారికి శివ ఎంతో.. నేనూ అంతే. శివ సినిమా హిట్‌ అయితే నా సినిమా హిట్‌ అయినంత ఆనందపడతాను’’ అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరాశ పరచదు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘మా సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు భరత్‌. ‘‘మనుచరిత్ర’ని థియేటర్‌లో చూసి మమ్మల్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు మేఘా ఆకాష్‌. ‘‘మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు నిర్మాత రాజ్‌ కందుకూరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement