
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో రిలీజై డిజాస్టర్ అనిపించుకున్న సినిమా లైలా. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. వైవిధ్యం కోసం అమ్మాయి గెటప్ కూడా వేశాడు. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేయబోతుందట.
(ఇదీ చదవండి: సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్)
ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ తదితర చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రతి సినిమాతో నిరాశపరుస్తున్నాడు. గతేడాది రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాకీ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. 'లైలా' అయినా సరే హిట్ అవుతుందేమో అనుకుంటే ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.
వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో 'లైలా' రిలీజైంది. ఉదయం తొలి ఆట నుంచి టాక్ తేడా కొట్టేసింది. దీంతో రెండో రోజు నుంచి ఈ సినిమాకు వెళ్లే వారే కరువయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైం కంటే కాస్త ముందుకొచ్చిందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
లైలా సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం మార్చి 2వ వారంలో స్ట్రీమింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి వారంలోనే ఓటీటీలో రిలీజ్ అవకాశముందని సమాచారం. అంటే మార్చి 7న లేదా అంతకంటే ముందే 'లైలా' డిజిటల్ రిలీజ్ ఉండొచ్చట.
'లైలా' కథ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోనూ(విశ్వక్ సేన్)కి బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా పాతబస్తీ పహిల్వాన్, ఎస్ఐ శంకర్ కి సోనూ టార్గెట్ అవుతాడు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు లేడీ గెటప్ వేసుకుని లైలా అవతారమేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)
Comments
Please login to add a commentAdd a comment