Sharawanand
-
అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
రష్మిక మందన్నా తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మూవీ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ పాల్గొన్నారు. చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. ఈ సందర్భంగా రష్మిక లవ్ మ్యారేజ్‌పై స్పందించింది. ఈ మేరకు రష్మిక తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ‘ఎవరి దగ్గర అయితే సెక్యూర్‌గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‌గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను’ అని పేర్కొంది. అలాగే ‘ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది… అలా కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది. చదవండి: ఆయనకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాను’ అంటూ తన మనసులో మాట చెప్పింది. అయితే కొంతకాలంగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ-రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ సినిమాలో సీనియర్ నటీమణులు ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి కీలక పాత్రలో నటించగా.. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
అలా రాయగలగడం నా అదృష్టం, వెంకటేశ్‌తో సినిమా నిజమే..
‘‘ఒక్కో సినిమాకు ఒక్కో ప్రయత్నం చేస్తుండాలి. నేను అదే చేస్తాను. ‘నేను.. శైలజ’ చిత్రంలో తండ్రీ కూతుళ్ల కథను చెప్పా. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంలో స్నేహం గురించి చెప్పాను. ‘చిత్రలహరి’ ఓ లూజర్ కథ. స్క్రిప్ట్‌లో నిజాయతీ ఉన్నప్పుడు సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో మహిళల ప్రాముఖ్యతను చెప్పే ప్రయత్నం చేశాను’’ అన్నారు కిశోర్ తిరుమల. శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వెంకటేశ్‌గారితో ఓ సినిమా అనుకున్న మాట వాస్తవమే కానీ ఆ కథ ఇది కాదు. నేపథ్యం ఒకటే అయినా కథ మారింది. మన కుటుంబాల్లోని మహిళలు మనకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మన జీవితాలను తీర్చిదిద్దాలనుకుంటుంటారు. కొందరు మహిళలు చిన్న చిన్న ఆనందాలకే సంతోషపడిపోతుంటారు. వారు తమ పురుషులపై భారీ డిమాండ్స్ చేయరు. అలాంటి మహిళలకు గుర్తుగా ఓ సినిమా తీయాలనిపించి ఈ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ తీశాను. శర్వాకు ఈ కథ వినిపించినప్పుడు హ్యాపీ ఫీలయ్యాడు. ఐదుగురు అక్కాచెల్లెళ్ళు ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. ఆ ఐదుగురి అక్కాచెళ్లళ్ళ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా కథ విని రష్మిక బాగా ఎంజాయ్ చేశారు. ఓ అమ్మాయిలా మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు? అని అడిగారు. అలాగే ‘ఉన్నది ఒకటే జీవితం’ సమయంలో కూడా ‘ఒక అమ్మాయి మాత్రమే ఇలాంటి డైలాగ్స్ చెప్పగలదు. మీరు అలానే రాస్తున్నారు’ అని అనుపమ అన్నారు. ఇలా స్క్రిప్ట్ రాయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘ఆడవాళ్లు..’లో ప్రతి పాట కథను ముందుకు నడుపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. మా సినిమా రిలీజ్ అనేది నిర్మాతల చేతుల్లో ఉంటుంది. (‘భీమ్లానాయక్’ ఈ నెల 25న వస్తోంది కాబట్టి ‘ఆడవాళ్లు..’ విడుదల వాయిదా పడుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా) నా తర్వాతి చిత్రం నాగచైతన్య హీరోగా ఉంటుంది’’ అన్నారు. -
‘శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీ శ్రీకారం’
‘‘శ్రీకారం’ సినిమా శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇంత మంచి సినిమా చూసి చాలారోజులైందని అందరూ అభినందిస్తున్నారు’’ అని నిర్మాత గోపీ ఆచంట అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిషోర్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. సక్సెస్ మీట్లో డైరెక్టర్ బి.కిషోర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మంచి కథ పడితే ప్రతి ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడనడానికి ‘శ్రీకారం’ ఒక ఉదాహరణ’’ అన్నారు నటుడు సాయికుమార్. ‘‘యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా ‘శ్రీకారం’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘కిషోర్ ప్రతి సీన్‌ను నిజాయతీగా చెప్పాడు.. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘కొన్ని సినిమాల్లోని పాత్రలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి.. అలాంటి సినిమా ‘శ్రీకారం’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ‘‘శ్రీకారం’ సంతోషాన్నిచ్చే సినిమా’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. చదవండి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ కొత్త సినిమా -
‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’
స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా రిలీజ్ అయిన శర్వానంద్ సినిమా రణరంగం. శర్వా గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ... ‘కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబుగారి డైరెక్షన్లో వచ్చిన రణరంగంను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెసయింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ రణరంగం విడుదలవడం చక్కని అనుభవం. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ చాలా బాగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. అలాగే హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించారనే పేరొచ్చింది’ అన్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘ఇది శర్వానంద్ సినిమా అని విడుదలకు ముందే చెప్పాను. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం శర్వానే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్నాయి. నిన్న సెకండ్ షో టికెట్లు దొరకలేదని ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఓపెనింగ్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ అవుతుంది’ అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకానికి రుణపడి ఉంటా. రణరంగంకు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని రణరంగం చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా సహజంగా కంపోజ్ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన రాజా, ఆదర్శ్, సుదర్శన్లకు మంచి పేరొచ్చింది. తనది చిన్న రోల్ అయినా.. చేసినందుకు కాజల్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ఇందులో నాకు నేనే నచ్చాను. రెండు దశలున్న క్యారెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది’ అన్నారు. -
మహానుభావుడు కోసం బాహుబలి
యంగ్ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మహానుభావుడు. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో రూట్ మార్చిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దసరా భారీలో జై లవ కుశ, స్పైడర్ చిత్రాల రిలీజ్ సమయంలో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. స్పైడర్ రిలీజ్ అయిన రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 29న ఈ సినిమాను మహానుభావుడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్థాయిలో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడట. మహానుభావుడు సినిమా ప్రభాస్ సన్నిహితులకు సంబంధించిన యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. దీంతో ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఓకె చెప్పాడని తెలుస్తోంది.