Rashmika Mandanna Reveals About Her Opinion On Love And Love Marriage - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే ప్రేమ పెళ్లి చేసుకుంటా: రష్మిక

Published Thu, Feb 17 2022 9:14 AM | Last Updated on Fri, Feb 18 2022 7:32 AM

Rashmika Mandanna Shares Her Opinion On Love And Love Marriage - Sakshi

రష్మిక మందన్నా తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. టాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మూవీ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మిక, డైరెక్టర్‌ పాల్గొన్నారు.

చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే..

ఈ సందర్భంగా రష్మిక లవ్‌ మ్యారేజ్‌పై స్పందించింది. ఈ మేరకు రష్మిక  తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ‘ఎవరి దగ్గర అయితే సెక్యూర్‏గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను’ అని పేర్కొంది. అలాగే ‘ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది… అలా కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది.

చదవండి: ఆయనకు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్‌

లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాను’ అంటూ తన మనసులో మాట చెప్పింది. అయితే కొంతకాలంగా యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ-రష్మికలు డేటింగ్‌ చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక ఈ కామెంట్స్‌ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ సినిమాలో సీనియర్‌ నటీమణులు ఖుష్బు, రాధిక శరత్​ కుమార్​, ఊర్వశి కీలక పాత్రలో నటించగా..  వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్​స్టార్ దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement