
సాక్షి, ఖమ్మం: హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ జంటగా నటించిన శ్రీకారం చలన చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహక సంస్థ శ్రేయాస్ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరవుతారని తెలిపారు. సినీ దర్శకుడు డి.కిషోర్, సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్, చిత్ర బృందం పాల్గొంటుందని తెలిపారు. ఎంట్రీ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రేయాస్ మీడియా గ్రూపు ప్రతినిధులు నల్లి శ్యామ్, నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment