ఆచార్యతో మంత్రి అజయ్‌.. సెట్‌లో సందడి | Telangana Minister Ajay in Acharya Shooting Location | Sakshi
Sakshi News home page

ఆచార్యతో మంత్రి పువ్వాడ అజయ్‌.. సెట్‌లో సందడి

Jan 30 2021 11:06 AM | Updated on Jan 30 2021 1:37 PM

Telangana Minister Ajay in Acharya Shooting Location - Sakshi

‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’గా వస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఆచార్య షూటింగ్‌ లొకేషన్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వాలిపోయారు. చిరంజీవిని కలిసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాలను మంత్రి ట్విటర్‌లో పంచుకున్నారు.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా సెట్‌లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌ ప్రదేశంలో మంత్రి కనిపించారు. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు కొరటాల శివ వివరించారు. ఈ మేరకు మంత్రి అజయ్‌ ట్వీట్‌ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. ఆ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే మంత్రి ఎందుకు కలిశారో అనేది తెలియడం లేదు. 

మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి పక్కన జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయ్యింది. మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement