shooting location
-
మేకప్ రూమ్‌లో పేలుడు.. నటి పరిస్థితి విషమం!
షూటింగ్ స్పాట్లో పేలుడు సంభవించడంతో ప్రముఖ బంగ్లాదేశీ నటి షర్మీన్ అఖీ తీవ్రగాయాలపాలైంది. దీంతో ఆమెను షైఖ్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. రక్తంలోని ప్లాస్మా కణాల సంఖ్య దారుణంగా పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. షర్మీన్ శరీరం 35 శాతం వరకు కాలిపోయిందని, చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా బంగ్లాదేశ్‌లోని మీరాపూర్ షూటింగ్ సెట్లోని మేకప్ రూమ్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షర్మీన్ విషయానికి వస్తే 'సిన్సియర్లీ యువర్స్, ఢాకా', 'బాయిసే స్రాబన్ అండ్ బాందిని' సినిమాలతో బంగ్లా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు షోల ద్వారా బుల్లితెరపైనా సందడి చేసింది. View this post on Instagram A post shared by Sharmeen Akhee (@sharmeenakhee) చదవండి: నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని -
Kriti Sanon: అక్కడే నా సంతోషం!
‘‘ఒక్కసారి కెమేరా ముందుకు వెళితే నేను అన్నీ మర్చిపోతాను’’ అంటున్నారు హీరోయిన్ కృతీ సనన్. అంటే.. చెప్పాల్సిన డైలాగులతో సహా అనుకుంటారేమో! అదేం కాదు. మరేంటి అంటే.. ఆ విషయం గురించి కృతీ సనన్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా గత ఏడాది పెద్దగా షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం దొరకలేదు. పని లేకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు మొదలవుతాయా? అని ఎదురు చూశాను. ఈ క్రమంలో నేను గ్రహించిన విషయం ఏంటంటే... నేను కెమేరాకి దూరంగా ఉండలేనని. పనంటే అంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి కాబట్టే కెమేరా మందుకెళ్లగానే నా వ్యక్తిగత విషయాలను మరచిపోతాను. షూటింగ్ లొకేషన్లో ఉంటేనే నేను ఎక్కువ సంతోషంగా ఉంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు కృతీ సనన్. -
ఆచార్యతో మంత్రి అజయ్.. సెట్లో సందడి
‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా వస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఆచార్య షూటింగ్ లొకేషన్లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వాలిపోయారు. చిరంజీవిని కలిసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాలను మంత్రి ట్విటర్లో పంచుకున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా సెట్లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్లో జరుగుతున్న షూటింగ్ ప్రదేశంలో మంత్రి కనిపించారు. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు కొరటాల శివ వివరించారు. ఈ మేరకు మంత్రి అజయ్ ట్వీట్ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. ఆ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అయితే మంత్రి ఎందుకు కలిశారో అనేది తెలియడం లేదు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి పక్కన జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. Megastar @KChiruTweets గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ. ఎం pic.twitter.com/INwVEVjduo — Ajay Kumar Puvvada (@puvvada_ajay) January 30, 2021 -
చలి చంపుతుంటే...!
‘చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది’... ‘క్షణక్షణం’లో వెంకటేశ్, శ్రీదేవి పాడుకున్న పాట ఇది. ఇప్పుడు ఈ పాటను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోసం మార్చి పాడాలంటే.. ‘చలి చంపుతున్న చమక్కులో హీటరొచ్చింది’ అనాలి. కరోనా వల్ల ఏడు నెలల లాక్డౌన్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఈ టీమ్ ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు. పైగా నైట్ షూట్. అసలే చలికాలం. అందుకే లొకేషన్లో పెద్ద పెద్ద హీటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ‘‘ఇవి లేకుండా (హీటర్లు) చలిగాలి నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అంటూ షాట్ గ్యాప్‌లో చలికి రక్షణగా హీటర్ దగ్గర నిలబడిన వీడియోను చిత్రబృందం పంచుకుంది. కెమెరామేన్ సెంథిల్‌కుమార్, రాజమౌళి.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీటర్ దగ్గరికొచ్చిన ఆ వీడియో వైరల్ అయింది. గత వారం చిత్రీకరణ జరిపినప్పుడు తీసిన వీడియో ఇది. వీడియోలో రామ్‌చరణ్ కనిపించలేదు కాబట్టి ఆ రోజు ఎన్టీఆర్, ఇతర తారాగణంపై సన్నివేశాలు తీసి ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ దుబాయ్‌లో ఉన్నారు. ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. -
ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా
బాహుబలితో ఇండియా వ్యాఫ్తంగా ఎనలేని క్రేజ్ సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మేనియా ఇటలీలో గట్టిగానే కనిపిస్తుంది. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్‌తో పాటు ప్రభాస్ దిగిన ఫోటోలు ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్ సాహో సినిమా తర్వాత రాధేశ్యామ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొంతభాగం షూటింగ్ ఈ మధ్యనే ఇటలీలో జరిగింది. అక్టోబర్ 24 ప్రభాస్ పుట్టినరోజు పురస్కరించుకొని చిత్రబృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డేల లుక్స్ స్టిన్నింగ్‌గా ఉంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేశాయి. షూటింగ్ సమయంలో ఆన్సెట్ లొకేషన్లతో పాటు ఆఫ్ లొకేషన్లో దిగిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్.. షూటింగ్ సమయంలో మసరెటీ బీఎండబ్యూ కారు వద్ద దిగిన ఫోటోతో పాటు ప్రభాస్ రన్నింగ్ ట్రాక్ వేసుకొని ఇటలీ వీధుల్లో జాగింగ్ చేస్తూ అక్కడి తన లోకల్ ఫ్యాన్‌తో దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతోపాటు రాధేశ్యామ్ చిత్రబృందాన్ని ఇటలీ మీడియా ఇంటర్య్వూ చేసిన సందర్భంగా దిగిన ఫోటోలను కూడా ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి : ‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?) Latest Pics Of #Prabhas & @hegdepooja From The Sets Of #RadheShyam Italian Media Interviewed Team RadheShyam pic.twitter.com/sXOrhD1hBx — Prabhas Rampage™ (@PrabhasRampage) October 29, 2020 కాగా ఇటలీలో షూటింగ్ ముగించుకొని ఈ మధ్యనే తిరిగి ఇండియాకు వచ్చిన రాధేశ్యామ్ బృందం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినిమాకు సంబంధించిన చివరి పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫిక్షనల్ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ ఖేడ్కర్, కునాల్ రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. #Prabhas. in Italy with crew members ! pic.twitter.com/DIDWZOms4c — Raju Garu Prabhas; Vikram Aditya Loaded (@pubzudarlingye) October 30, 2020 -
బెంగళూరు భామ
తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లా మారిపోయారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ మూడు భాషల్లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారామె. ఒక సినిమా లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు ప్రయాణం చేస్తూ ఇంటికి వెళ్లడానికి కూడా తీరక దొరకడం లేదంటున్నారు ఈ బెంగళూరు బ్యూటీ. ‘‘నేను నటిస్తున్న ఒక్కో సినిమా షూటింగ్ ఒక్కో చోట జరుగుతుంది. అందుకే నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉంటున్నాను. కన్నడ చిత్రం ‘పొగరు’ షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో వేరే సినిమా. ఆ తర్వాత రాజమండ్రి వెళ్తాను. ఆ తర్వాత పొల్లాచ్చి. వచ్చే నెలలో యూరప్‌లో ఒక నెల షూటింగ్ చేయబోతున్నాను. ఇలా ప్రయాణం చేస్తూనే ఉన్నాను’’ అని తన షూటింగ్ షెడ్యూల్ వివరాలు చెప్పారు రష్మిక. అంతేకాదు గత ఆరు నెలల్లో రష్మిక తన ఇంట్లో గడిపింది 22 గంటలేనట. ఇంటిని ఎంత మిస్ అవుతున్నారో చెబుతూ – ‘‘తీరక లేకుండా పని చేస్తున్నాను. ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను. ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలనుంది. ప్రస్తుతం అదొక్కటే కోరుకుంటున్నాను. మొన్న ఇంటి నుంచి వచ్చేస్తుంటే మళ్లీ ఎప్పుడొస్తావు? అని మా చెల్లి అడిగింది. తను పెరిగి పెద్దదవుతోంది. తనతో ఉండటాన్ని మిస్ అవుతున్నాను. ఎప్పుడూ సూట్‌కేస్ రెడీగా పెట్టుకొని తిరుగుతున్నాను’’ అన్నారు రష్మిక. -
సైరా సెట్లో అంతా సేఫ్
చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ సెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సెట్ పూర్తిగా నాశనం అయిందని తెలిసింది. ఎవ్వరూ ప్రమాదానికి గురికాలేదు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా: నరసింహా రెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేట్లో 3 కోట్ల భారీ వ్యయంతో ప్రత్యేక సెట్ రూపొందించారు. శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా సెట్లో మంటలు చెలరేగాయి. పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం గురించి రామ్‌చరణ్ స్పందిస్తూ– ‘‘అనూహ్యంగా సెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎవ్వరికీ గాయాలు కాలేదు. మా టీమ్ అంతా సేఫ్‌గా ఉన్నారు. లాస్ట్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సెట్లో షూటింగ్ దాదాపు పూర్తయింది. సెట్ ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్, చిరంజీవి మీద కొన్ని క్లోజప్ షాట్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది’’ అని సమాచారం. ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. -
దర్బార్‌పై రాళ్లు
ఏదో సినిమాలో హీరో అంటాడు ‘అభిమానాన్ని ఆపలేం సార్’ అని. నిజమే. అభిమానాన్ని ఆపితే వచ్చేది ఆగ్రహమే. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికే గురవుతున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ కళాశాలలో జరుగుతోంది. రజనీకాంత్ సినిమా అంటే ఆసక్తి చూపనివారు ఎవరుంటారు? దాంతో అత్యుత్సాహంతో రజనీ ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు కొందరు. దీంతో షూటింగ్‌స్పాట్‌లో ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది చిత్రబృందానికి ఇబ్బందిగా మారింది. దాంతో సూపర్ స్టార్‌ని చూడ్డానికి లొకేషన్‌కి వస్తున్న స్టూడెంట్స్‌ను దూరంగా ఉంచాలని భావించింది చిత్రబృందం. మా అభిమానాన్నే అడ్డుకుంటారా? అని ఆగ్రహించిన స్టూడెంట్స్ సెట్‌పై రాళ్లు విసిరారు. ఈ సంఘటన తర్వాత షూటింగ్ లొకేషన్ మార్చాలనే ఆలోచనలో ఉందట టీమ్. -
నమ్మలేనట్టుగా అనిపిస్తోంది!
క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం సోనాలీ బింద్రే లండన్‌లో కొంత కాలం గడిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబై వచ్చిన సోనాలి మళ్లీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు.. యాడ్ షూటింగ్ కోసం. చాలా కాలం తర్వాత సెట్లో అడుగుపెడుతుంటే నమ్మలేనట్టుగా అనిపిస్తోంది అని పేర్కొన్నారామె. ‘‘మళ్లీ పనిలో పడటం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. మరింత బాధ్యతగా, అర్థవంతంగా సెట్లోకి అడుగుపెట్టాను. మళ్లీ కెమెరాను ఎదుర్కోవడం, ఎమోషన్స్‌ను పలికించడం హ్యాపీగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు సోనాలి. యాడ్స్‌లో నటిస్తున్న ఆమె మళ్లీ సినిమాల్లోనూ నటిస్తారా? వేచి చూద్దాం. -
అఖిల్... అప్డేట్స్
అక్కినేని అఖిల్ నటించే మొదటి సినిమా ఎలా ఉంటుంది? అసలా సినిమాలో అఖిల్ ఎలా కనిపిస్తాడు? అని అక్కినేని అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘నేనిలా కనిపిస్తా’ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా.. సినిమాలో తానెలా కనిపిస్తాడో.. అఖిల్ సామాజిక మాధ్యమం ద్వారా శాంపిల్స్ చూపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్లో దిగిన కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పెడుతున్నాడు. కేవలం సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్ మాత్రమే కాకుండా.. సీనియర్ నటుడు బ్రహ్మానందంతో చేసిన సందడి, తన తండ్రి నాగార్జున సెట్‌కి వచ్చినప్పటి ఫోటోలు కూడా బయటపెట్టాడు అఖిల్. ఫొటోలు మాత్రమే కాకుండా చిత్రనిర్మాణం ఏ దశలో ఉందో కూడా తెలియపరుస్తున్నాడు. అఖిల్ ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం అభిమానులకు ఆనందంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
లొకేషన్లోనే ఏడ్చేసిన దీపికా పదుకొనే
ఆరోజు ఎప్పటిలానే దీపికా పదుకొనె ఉత్సాహంగా షూటింగ్ స్పాట్‌లోకి అడుగుపెట్టారు. అందరికీ శుభోదయం చెప్పి, తీయబోయే సన్నివేశాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా ప్రిపేర్ అయ్యి, కెమెరా ముందుకెళ్లారు. వన్, టు త్రీ... అంటూ టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. కట్ చేస్తే.. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కోపం వచ్చింది. దీపికాని చెడామడా తిట్టేశారు. రణవీర్‌సింగ్, దీపికా జంటగా స్వీయదర్శకత్వంలో భన్సాలీ రూపొందిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఈ చిత్రంలో దీపికా పాత్ర పేరు ‘లీలా’. అది సంజయ్‌లీలా భన్సాలీ తల్లి పేరు. అందుకని, ఈ పేరు పలికినప్పుడల్లా ఆయన మాటల్లో ఓ ఆత్మీయత కనిపించేదట. భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఆయన తల్లి పేరున్న పాత్ర చేయడం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందుకే లీలా పాత్రను అద్భుతంగా పోషించి, భన్సాలీ దగ్గర అభినందనలు కొట్టేయాలనుకున్నారు దీపికా. అయితే ఆయన అనుకున్న విధంగా నటించలేక మూడు, నాలుగు సార్లు తిట్లు తిన్నారు. బాధ తట్టుకో లేక ఒక్కోసారి ఏడ్చేశారు కూడా. ఆ విధంగా ఈ షూటింగ్ స్పాట్లో చాలాసార్లు అప్సెట్ అయ్యారు దీపికా. కానీ, షూటింగ్ చివరి రోజున మాత్రం ఆమెకు ‘స్వీట్ షాక్’ తగిలింది. దీపికాకి గుడ్ బై చెబుతూ, ‘పర్ఫెక్షన్ కోసం ఒకటికి రెండు, మూడు సార్లు యాక్ట్ చేయాల్సి వస్తుంది. సీన్ ఓకే అయ్యేవరకు ఏ దర్శకుడికైనా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్‌తో తిట్టేస్తాం. ఏదేమైనా నువ్వు చాలా అద్భుతంగా యాక్ట్ చేశావ్. సూపర్’ అని అభినందించారట భన్సాలీ. షూటింగ్ స్పాట్లో తిట్టినందుకు బాధతో ఏడ్చిన దీపికా... ఈ కాంప్లిమెంట్ అందుకున్న తర్వాత ఆనందంతో కంట తడిపెట్టుకున్నారట.