Actress Sharmeen Akhee Condition Critical After Explosion During Movie Shoot - Sakshi
Sakshi News home page

Sharmeen Akhee: షూటింగ్‌ లొకేషన్‌లో పేలుడు.. నటి పరిస్థితి విషమం!

Published Thu, Feb 2 2023 3:04 PM | Last Updated on Thu, Feb 2 2023 4:14 PM

Actress Sharmeen Akhee Condition Critical After Explosion During Movie Shoot - Sakshi

షూటింగ్‌ స్పాట్‌లో పేలుడు సంభవించడంతో ప్రముఖ బంగ్లాదేశీ నటి షర్మీన్‌ అఖీ తీవ్రగాయాలపాలైంది. దీంతో ఆమెను షైఖ్‌ హసీనా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బర్న్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. రక్తంలోని ప్లాస్మా కణాల సంఖ్య దారుణంగా పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. షర్మీన్‌ శరీరం 35 శాతం వరకు కాలిపోయిందని, చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.

కాగా బంగ్లాదేశ్‌లోని మీరాపూర్‌ షూటింగ్‌ సెట్‌లోని మేకప్‌ రూమ్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షర్మీన్‌ విషయానికి వస్తే 'సిన్సియర్లీ యువర్స్‌, ఢాకా', 'బాయిసే స్రాబన్‌ అండ్‌ బాందిని' సినిమాలతో బంగ్లా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు షోల ద్వారా బుల్లితెరపైనా సందడి చేసింది.

చదవండి: నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement