bangla actress
-
‘పశ్చిమ బెంగాల్’ పేరు మార్చండి: సీఎం మమతా డిమాండ్
తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే లేని తప్పు.. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మారిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు కల్కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతా మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చామని, అయినా చాలా కాలంగా రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చలేదని మండిపడ్డారు. బొంబాయి, ఒరిస్సా పేర్లను మార్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్ పేరు మార్చడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దాంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర పేరును పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలకు మమతా వివరించారు. రాష్ట్ర విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని(ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో W, X, Y, Z), దీని వల్ల బంగ్లా ప్రాముఖ్యత తగ్గుతోందన్నారు. రాష్ట్రం పేరులో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మార్చడం వల్ల నష్టం ఏం లేదని తెలుపుతూ ఓ ఉదాహణ చెప్పారు. ‘ పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది. భారత్‌లోనూ పంజాబ్ పేరుతో రాష్ట్రం ఉంది. ఇందులో ఏ సమస్యల ఏదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ పేరుతో ఓ దేశం ఉంటే.. పశ్చిమ బెంగాల్ బంగ్లాగా ఎందుకు మారకదు’ అని తెలిపారు. -
మేకప్ రూమ్‌లో పేలుడు.. నటి పరిస్థితి విషమం!
షూటింగ్ స్పాట్లో పేలుడు సంభవించడంతో ప్రముఖ బంగ్లాదేశీ నటి షర్మీన్ అఖీ తీవ్రగాయాలపాలైంది. దీంతో ఆమెను షైఖ్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. రక్తంలోని ప్లాస్మా కణాల సంఖ్య దారుణంగా పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. షర్మీన్ శరీరం 35 శాతం వరకు కాలిపోయిందని, చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా బంగ్లాదేశ్‌లోని మీరాపూర్ షూటింగ్ సెట్లోని మేకప్ రూమ్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షర్మీన్ విషయానికి వస్తే 'సిన్సియర్లీ యువర్స్, ఢాకా', 'బాయిసే స్రాబన్ అండ్ బాందిని' సినిమాలతో బంగ్లా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు షోల ద్వారా బుల్లితెరపైనా సందడి చేసింది. View this post on Instagram A post shared by Sharmeen Akhee (@sharmeenakhee) చదవండి: నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని -
మరో పోర్నోగ్రఫీ రాకెట్.. వర్ధమాన నటి అరెస్ట్
హిందీ సినిమా ఫైనాన్షియర్, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో కొనసాగుతుండగానే.. మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తున్న ఓ మోడల్ కమ్ నటిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్ చేశారు పోలీసులు. వర్ధమాన నటి నందితా దత్తా(30) ఒకప్పుడు బిజీ మోడల్. చాలాకాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఛాన్స్‌లు దొరక్క బీ గ్రేడ్, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. అయితే తనకున్న పరిచయాలతో యంగ్ మోడల్స్‌కు వెబ్ సిరీస్ అవకాశాలను ఎరగా చూపెట్టింది. చివరికి వాళ్లు వలలో చిక్కాక.. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్ డమ్, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. నక్‌టాలాలో తన ఇంట్లో ఓ మోడల్ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న టైంలో పోలీసులు నందితాను అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. మరోవైపు డమ్ డమ్లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్ నేతృత్వంలో పోర్న్ షూటింగ్ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాల ఆశజూపి తమను ఇందులోకి దింపిందని.. మాట వినకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించిందని నందితపై ఆ ఇద్దరు మోడల్స్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు బాలీగుంజేలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు జులై 26న న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఈ కేసులో నందితతో పాటు మైనక్ ఘోష్ కీలక వ్యక్తులుగా భావిస్తున్నారు. ఇది భారీ సెక్స్ రాకెట్ అనే అనుమానం ఉందని, రాజ్‌కుంద్రాతో లింక్‌లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేపడతామని ఓ సీనియర్ అధికారి చెప్తున్నాడు. అయితే నందితను పూర్తిస్థాయిలో ప్రశ్నించాకే ఏ విషయం అనేదానిపై స్పష్టత వస్తుందని ఆయన అంటున్నాడు. -
బీజేపీలో చేరిన ప్రముఖ బంగ్లాదేశ్ నటి
కోల్‌కతా : ప్రముఖ బంగ్లాదేశ్ నటి అంజు ఘోష్ బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో బుధవారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియా సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశీయురాలుగా కొనసాగుతున్నారా.. లేక భారత పౌరసత్వం తీసుకున్నారా అనే దానికి అంజూ స్పష్టత ఇవ్వలేదు. అంజూ 1989లో వచ్చిన హిట్ మూవీ బెడెర్ మెయ్ జోస్నాలో నటించారు. ఈ చిత్రం బంగ్లాదేశ్ సినీ చరిత్రలో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఆమె బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి ప్రచారం నిర్వహించిన బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ అహ్మద్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫిర్యాదు చేయడంతో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతని బిజినెస్ వీసాను రద్దు చేసింది. అంతేకాకుండా తక్షణమే భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు అదే బీజేపీ బంగ్లాదేశ్ నటిని తమ పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు బీజేపీపై ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమెను బీజేపీ ఎలా తమ పార్టీలో చేర్చుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అంజూ ఘోష్ తన పౌరసత్వాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రేప్ కేసులో వరల్డ్ కప్ క్రికెటర్ అరెస్ట్
బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్‌కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ అనే క్రికెటర్‌ను అత్యాచారం కేసులో రిమాండుకు పంపారు. ఓ నటి మీద అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో ఢాకా మేజిస్ట్రేట్ రూబెల్‌ను రిమాండుకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ప్రపంచకప్ పోటీల్లో అతడు పాల్గొంటాడా లేదా అన్నవిషయం అనుమానంలో పడింది రూబెల్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును మేజిస్ట్రేట్ తిరస్కరించారని, దాంతో కేసు తదుపరి విచారణకు వచ్చే వరకు అతడిని జైలుకు పంపారని ఢాకా పోలీసు డిప్యూటీ కమిషనర్ అనిసుర్ రెహ్మాన్ తెలిపారు. అయితే.. తదుపరి విచారణ ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. అత్యాచారం ఫిర్యాదులు రావడంతో ఇప్పుడు బాధితురాలికి, రూబెల్కు కూడా డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. అయితే.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఫాస్ట్ బౌలర్ అయిన రూబెల్ చెబుతున్నాడు. ఆమె తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించాడు.