
‘చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది’... ‘క్షణక్షణం’లో వెంకటేశ్, శ్రీదేవి పాడుకున్న పాట ఇది. ఇప్పుడు ఈ పాటను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ కోసం మార్చి పాడాలంటే.. ‘చలి చంపుతున్న చమక్కులో హీటరొచ్చింది’ అనాలి. కరోనా వల్ల ఏడు నెలల లాక్‌డౌన్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఈ టీమ్ ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు. పైగా నైట్ షూట్. అసలే చలికాలం. అందుకే లొకేషన్లో పెద్ద పెద్ద హీటర్లు ఏర్పాటు చేసుకున్నారు.
‘‘ఇవి లేకుండా (హీటర్లు) చలిగాలి నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అంటూ షాట్ గ్యాప్‌లో చలికి రక్షణగా హీటర్ దగ్గర నిలబడిన వీడియోను చిత్రబృందం పంచుకుంది. కెమెరామేన్ సెంథిల్‌కుమార్, రాజమౌళి.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీటర్ దగ్గరికొచ్చిన ఆ వీడియో వైరల్ అయింది. గత వారం చిత్రీకరణ జరిపినప్పుడు తీసిన వీడియో ఇది. వీడియోలో రామ్‌చరణ్ కనిపించలేదు కాబట్టి ఆ రోజు ఎన్టీఆర్, ఇతర తారాగణంపై సన్నివేశాలు తీసి ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ దుబాయ్‌లో ఉన్నారు. ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment