ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..! | RRR Records Highest First Week Collection For Indian film in Japan | Sakshi
Sakshi News home page

RRR Records In Japan: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ రికార్డ్.. తొలి భారతీయ చిత్రంగా..!

Published Tue, Nov 1 2022 3:11 PM | Last Updated on Tue, Nov 1 2022 6:15 PM

RRR Records Highest First Week Collection For Indian film in Japan - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం జపాన్‌లోనూ విడుదలైంది. అక్టోబర్‌లో జపనీస్ భాషలోనూ రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమా ప్రమోషన్లు కూడా భారీస్థాయిలో నిర్వహించారు. తాజాగా ఈ చిత్ర జపాన్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్లలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్,  ఎస్ఎస్ రాజమౌళి కుటుంబాలతో కలిసి సందడి చేశారు. 

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఫోటోలు వైరల్)

అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మొదటి వారంలో జపాన్ కరెన్సీలో 73 మిలియన్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం జపాన్‌లోని 44 నగరాల్లోని  209 స్క్రీన్‌లతో పాటు 31 ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేశారు. ఇది జపాన్‌లో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక థియేటర్లలో ప్రదర్శించిన సినిమాగా నిలిచింది.

ఓ నివేదిక ప్రకారం విదేశీ చిత్రాల్లో జపనీస్ బాక్సాఫీస్ వద్ద ది బాడ్ గైస్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్, డొమినియన్ వంటి చిత్రాల కంటే ఆర్ఆర్ఆర్ ముందు వరుసలో నిలిచింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన భారతీయ చిత్రంగా నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది.

 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు.. జపాన్‌ బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్లతో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో నిలిచింది. 300 మిలియన్ల  కలెక్షన్లతో రాజమౌళి చిత్రం బాహుబలి- 2 రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్‌ హీరో అమిర్ ఖాన్ మూవీ 3 ఇడియట్స్ 170 మిలియన్ల వసూళ్లతో మూడవ స్థానంలో సాధించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement