దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం జపాన్‌లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా బాహుబలి రికార్డును అధిగమించింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా అవతరించింది. అత్యంత వేగంగా 300 మిలియన్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న బాహుబలి-2 ను వెనక్కినెట్టింది.
(చదవండి: RRR Collections in Japan: జపాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్-2ను దాటే ఛాన్స్?)
జపాన్ విడుదలైన 34 రోజుల్లోనే ఆ దేశ కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు.. అంటే దాదాపు రూ.17.9 కోట్లు వసూలు చేసింది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ చిత్రం ముత్తు మాత్రమే రూ.23.5 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment