Sharwanand Srikaram Audio Function: Injured Man Dies In Khammam - Sakshi
Sakshi News home page

శ్రీకారం ఆడియో ఫంక్షన్‌లో గాయపడ్డ వ్యక్తి మృతి

Published Wed, Mar 10 2021 2:29 PM | Last Updated on Wed, Mar 10 2021 6:49 PM

Injured Man Dies at Srikaram Audio Function Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: రెండు రోజుల క్రితం జిల్లాలోని మమత మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌ జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవిని చూడటానికి అభిమానులు అత్యుత్సాహం చూపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు. 

ప్రకాష్‌ నగర్‌కు చెందిన శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

చదవండి:
శర్వానంద్‌ నాకు మరో రామ్‌చరణ్‌ లాగా: చిరు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement