nmd faruk
-
టీడీపీ అభ్యర్థి ఆఫీస్‌ను ముట్టడించిన మహిళలు
సాక్షి, నంద్యాల జిల్లా: టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. ఓటుకు డబ్బులు ఇస్తామని స్లిప్పులు తీసుకుని టిక్కులు వేసి డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, పచ్చ ప్రలోభాలు తారస్థాయికి చేరాయి. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బుతో పాటు వివిధ తాయిలాలను ఎర వేస్తున్నారు. కొన్ని చోట్ల కుటుంబాలను ఎంపిక చేసుకొని రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి వివిధ హామీలను గుప్పిస్తూ నగదును పంపిణీ చేస్తున్నారు. -
Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు
నంద్యాల: వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా నంద్యాల టీడీపీ నేతల మధ్య అప్పుడే మూడు ముక్కలాట మొదలైంది. నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వర్గ పోరు బాట పట్టారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి లోలోపల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమదంటే తమదేనని అనుచరులకు చెప్పుకుంటూ వర్గ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి ప్రజల నుంచి మద్దతు లేక విలవిలలాడుతుంటే నాయకుల వర్గపోరు టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పి తెప్పిస్తోంది. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ లాడ్జ్‌లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు హాజరయ్యారు. చదవండి: ('ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు.. కాసింత బువ్వ పెట్టండ్రా') ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్ తనయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ.. ‘క్లస్టర్ సమావేశానికి తనను ఏ కారణం చేత పిలువలేదో అర్థం కావడం లేదు. జిల్లా ప్రధాన కార్యదర్శినే పిలువక పోతే ఎలా? మన మధ్య ఐక్యత లేకుంటే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమావేశానికి తాను ఎవరినీ పిలువలేదని, టీడీపీ కార్యాలయం నుంచే ఫోన్లు చేశారని, ఒకరిని దూరంగా ఉంచాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే సమావేశానికి ఫరూక్, ఆయన తనయుడు ఫిరోజ్ హాజరైనా వారి అనుచరులను మాత్రం సమావేశానికి దూరంగా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా సమావేశంలోనే ఫిరోజ్ తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏవీ జాడ ఏదీ.. క్లస్టర్ సమావేశానికి సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి గైర్హాజరై, తన వర్గాన్ని కూడా దూరంగా ఉంచడంతో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి, ఫరూక్‌కు టికెట్ వచ్చే పరిస్థితి లేదని, గతంలో వారికి అవకాశం ఇచ్చారని, ఈ సారి కొత్త నాయకుల వైపు అధిష్టానం చూస్తుందని, వచ్చే ఎన్నికల్లో తనకే నంద్యాల అసెంబ్లీ టికెట్ వస్తుందని అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యనాయకులు దూరం నంద్యాల క్లస్టర్ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. టీడీపీ ముస్లిం, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా, మాజీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఇంతియాజ్ అహమ్మద్, మాజీ కౌన్సిలర్ మిద్దె హుసేనితో పాటు ప్రముఖ టీడీపీ నాయకులు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. నాయకుల మధ్య విభేదాలు ఉండటం, ఒకరినొకరు విమర్శించుకోవడం, పార్టీ పదవుల్లో కష్టపడిన వారికి కాకుండా నాయకుల అనుచరులకే పదవులు దక్కడంతో అసంతృప్తికి లోనైన పలువురు నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. -
నంద్యాల మంత్రి గారి ‘ఎల్లో’ ప్రచారం!
సాక్షి, నంద్యాలఅర్బన్: డేటా స్కాంలో అధికార పార్టీ పరువు పోవడంతో దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పడరానిపాట్లు పడుతున్నారు. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఇందులో భాగంగానే నంద్యాలకు చెందిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తమ కుటుంబానికి చెందిన ఏడుగురి ఓట్లను వైఎస్సార్సీపీ నాయకులు తొలగించారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీనికి ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. నంద్యాల పట్టణంలోని ముల్లాన్‌పేట 72వ పోలింగ్ బూత్‌లో మంత్రి ఫరూక్ భార్య మెహబూబ్చాంద్, కుమారుడు ఫయాజ్, కుటుంబ సభ్యులు షబ్రాన్సుల్తాన్, యాస్మిన్మొబిన్, సీఫా ఫాతిమా, సౌదాఫ్ ఫాతిమా, ఫర్హానా పేర్లు తొలగించారంటూ మంత్రి చెబుతున్నారు. అయితే.. ఫరూక్ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యంతోనే ఓట్లు తొలగిపోయినట్లు తెలుస్తోంది. 2017 నవంబర్ ఒకటి నాటికే వారి ఓట్లు జాబితాలో లేవు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఓటర్లుగా నమోదు చేయించడానికి స్థానిక సిబ్బంది ప్రయత్నించినా..ఫరూక్ కుటుంబ సభ్యులు స్పందించలేదని సమాచారం. బయట రాజకీయంగా తిరుగుతున్న మంత్రి ఫరూక్, కుమారుడు ఫిరోజ్ ఓట్లు మాత్రం జాబితాలో ఉన్నాయి. మిగిలిన కుటుంబ సభ్యుల ఓట్లు లేకపోవడానికి వారి నిర్లక్ష్యమే కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా మంత్రి మాత్రం వైఎస్సార్సీపీపై నిందలు వేస్తున్నారు. ఎలాంటి ఆధారమూ లేకుండా మంత్రి చేస్తున్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల సమాచారాన్ని దొంగలించి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ..ఇప్పుడిలా దుష్ప్రచారానికి పూనుకుందని విమర్శిస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల ఓట్ల తొలగింపుపై వివరణ ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ నిరాకరిస్తున్నారు. ఎప్పుడో జరిగిన తొలగింపుతో తమకు సంబంధం లేదని అంటున్నారు. కాగా.. గురువారం మంత్రి కుటుంబ సభ్యుల ఓట్లు చేర్చుకోవాలంటూ ఫారం–6 దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. టీడీపీ నాయకుల బరి తెగింపును ప్రజలు గమనిస్తున్నారు–జాకీర్‌హుసేన్, కౌన్సిలర్, నంద్యాల యాప్‌ల ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తూ టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలు, బరి తెగింపును ప్రజలు గమనిస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల ఓట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఫారం–7 ద్వారా తొలగించారనడంలో అర్థం లేదు. మంత్రిగా ఉండి చౌకబారు ప్రచారానికి పూనుకోవడం తగదు. -
మంత్రులుగా ఫరూక్, శ్రావణ్ ప్రమాణం
సాక్షి, అమరావతి: మరో కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం, గిరిజన వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్ ఆదివారం ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ఉదయం 11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఫరూక్ తెలుగులో, ఆ తర్వాత శ్రావణ్‌కుమార్ ఇంగ్లిష్‌లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రులు ఇద్దరినీ గవర్నర్ అభినందించారు. కిడారి శ్రావణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రావణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండుసార్లు పాదాభివందనం చేశారు. ప్రమాణం సందర్భంగా తెలుగు పదాలను ఉచ్చరించడానికి ఫరూక్ కొద్దిగా తడబడ్డారు. ఏడు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం మంత్రివర్గ సభ్యులతో గవర్నర్, ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
‘ఎన్నికల కోసమే మంత్రి పదవి’
సాక్షి, విజయవాడ : అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే చంద్రబాబు నాయుడు ముస్లింలకు మంత్రి పదవి కట్టబెట్టారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఖాదర్ బాషా ఆరోపించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు ఇప్పుడెందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబుది ముస్లింపై ప్రేమ కాదు డ్రామా అని, మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్‌తో రాజకీయలు చేస్తున్నారని అన్నారు. గతంలో సీఎం చుట్టూ తిరిగినా ఫరూక్‌కు అపాయింట్మెంట్ ఇవ్వని చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో శాసనమండలి ఛైర్మన్ చేశారని గుర్తుచేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే అని.. ఆయన వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. మైనార్టీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మోసాం చేశారని మండిపడ్డారు. నారా హమారా.. టీడీపీ హమారా సభలో హామీలు అమలుచేయమన్న ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టించారని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ముస్లింలను తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. -
‘ఎన్నికల కోసమే మంత్రి పదవి’
-
నంద్యాల టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కర్నూలు : వక్ఫ్ బోర్డు భూములు కేంద్రంగా నంద్యాల టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేస్తున్న టీడీపీ నేతలపై ఆ పార్టీ సీనియర్ నేత ఎన్.ఎం.డి ఫరూఖ్ ఆగ్రహించారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాలలోని సర్వే నెం. 286లో ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 22.85 ఎకరాల స్థలంపై టీడీపీలోని ఓ నేత కన్నేశాడు. అదే విధంగా 236 సర్వే నెం.లోని 16 ఎకరాల స్థలంపై టీడీపీలోని మరో వర్గం నాయకుడు కన్నేశాడు. వక్ఫ్ బోర్డు పక్కనే ఉన్న తన వెంచర్లకు వక్ఫ్ భూములను రహదారులుగా మార్చుకున్నాడు. దీంతో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు మండలి ఛైర్మన్ ఫరూఖ్‌ను కలిసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆక్రమణలకు పాల్పడుతున్న టీడీపీలోని ఒక వర్గం వారిపై ముస్లింలు తిరగబడాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలంటూ ఫరూఖ్ పిలుపునిచ్చారు. కాగా కబ్జాను అడ్డుకుంటున్న అధికారులపై టీడీపీ నేతలు దాడులు, బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. -
శాసన మండలి చైర్మన్‌గా ఫరూక్
నంద్యాల : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్‌కు శాసనమండలి చైర్మన్ పదవి దక్కింది. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ముస్లిం మైనార్టీలను సంతృప్తి పరిచేందుకు సీఎం చంద్రబాబు.. ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపొందడంతో సోమవారం ఆయన్ను శాసనమండలి చైర్మన్‌గా ప్రకటించారు. గతంలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన ఫరూక్‌ను గత కొన్నేళ్లుగా చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. అయితే.. ఉప ఎన్నిక సమయంలో నంద్యాలలో టీడీపీ బలహీన పడుతోందని గ్రహించి మైనార్టీలను ఆకట్టుకునే క్రమంలో ఫరూక్‌ను దగ్గరికి చేర్చుకున్నారు. ఉప ఎన్నికకు కొద్దిరోజుల ముందు హడావుడిగా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇకపోతే రాష్ట్ర మంత్రిమండలిలో ఏ ఒక్క ముస్లిం ప్రజా ప్రతినిధికీ స్థానం కల్పించకపోవడంపై ఆ వర్గం నాయకులు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారిని సంతృప్తి పరిచే ప్రయత్నంలో భాగంగా ఫరూక్‌కు మండలి చైర్మన్ ఇచ్చినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.