
సాక్షి, విజయవాడ : అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే చంద్రబాబు నాయుడు ముస్లింలకు మంత్రి పదవి కట్టబెట్టారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఖాదర్ బాషా ఆరోపించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు ఇప్పుడెందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబుది ముస్లింపై ప్రేమ కాదు డ్రామా అని, మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్‌తో రాజకీయలు చేస్తున్నారని అన్నారు. గతంలో సీఎం చుట్టూ తిరిగినా ఫరూక్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో శాసనమండలి ఛైర్మన్ చేశారని గుర్తుచేశారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే అని.. ఆయన వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. మైనార్టీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మోసాం చేశారని మండిపడ్డారు. నారా హమారా.. టీడీపీ హమారా సభలో హామీలు అమలుచేయమన్న ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టించారని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ముస్లింలను తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment