శాసన మండలి చైర్మన్‌గా ఫరూక్
నంద్యాల : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌కు శాసనమండలి చైర్మన్ పదవి దక్కింది. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ముస్లిం మైనార్టీలను సంతృప్తి పరిచేందుకు సీఎం చంద్రబాబు.. ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపొందడంతో సోమవారం ఆయన్ను శాసనమండలి చైర్మన్‌గా ప్రకటించారు. గతంలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన ఫరూక్‌ను గత కొన్నేళ్లుగా చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. అయితే.. ఉప ఎన్నిక సమయంలో నంద్యాలలో టీడీపీ బలహీన పడుతోందని గ్రహించి మైనార్టీలను ఆకట్టుకునే క్రమంలో ఫరూక్‌ను దగ్గరికి చేర్చుకున్నారు. ఉప ఎన్నికకు కొద్దిరోజుల ముందు హడావుడిగా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇకపోతే రాష్ట్ర మంత్రిమండలిలో ఏ ఒక్క ముస్లిం ప్రజా ప్రతినిధికీ స్థానం కల్పించకపోవడంపై ఆ వర్గం నాయకులు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారిని సంతృప్తి పరిచే ప్రయత్నంలో భాగంగా ఫరూక్‌కు మండలి చైర్మన్ ఇచ్చినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.