srinivasula reddy
-
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
వెంటాడుతున్న ఓటమి భయం!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. అధినేత చంద్రబాబుకు వివరించేందుకు కారణాలు వెతుక్కుంటున్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదే తరహా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. ఈనెల 29న విజయవాడలో స్వయంగా కలిసి పరిస్థితి వివరించేందుకు సిద్ధం అయ్యారు. సక్సెస్ఫుల్ ప్రయత్నాలు చేసినా పార్టీ నేతల వెన్నుపోటుతో దెబ్బ పడిందనే అంచనాకు వచ్చారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలు వైఎస్సార్సీపీకి కంచుకోటగా నిలుస్తున్నాయి. ఇదివరకు ఎన్నికలు ఏవైనా సరే ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాలు అదేబాటలో ఉండనున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం కళ్లముందు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమిపై సాకులు వెతుకుతున్నారు. సహచరులు ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా, వెన్నుపోటు పొడిచారని నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కడప, ప్రొద్దుటూరు, కమలాపురం టీడీపీ అభ్యర్థులు.. పార్టీ నేతలు వెన్నుపోటుకు పాల్పడ్డారని ఆరోపణలకు దిగారు. ఆదే విషయాన్ని అధినేతకు వివరించేందుకు సిద్ధమయ్యారు. అన్నమయ్య జిల్లాలో .. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేదని, పోల్ మేనేజ్మెంట్ చేపట్టలేదనే అన్నమయ్య జిల్లా టీడీపీ కేడర్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తోంది. ఇప్పటికే మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్‌పై రామసముద్రం మండల మాజీ జెడ్పీటీసీ మునివెంకటప్పతోపాటు ఆ మండల కేడర్ మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. పోరాటం చేయకపోగా కేడర్‌ను అవమానాలపాలు చేశారని అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అలాగే తంబళ్లపల్లె, రాజంపేట అభ్యర్థులు జయచంద్రారెడ్డి, బాలసుబ్రమణ్యంపై కూడా కేడర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో అభ్యర్థులు ఎఫర్ట్ పెట్టలేదని, పోల్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. ఇరువురు టికెట్ తెచ్చుకునే క్రమంలో పారీ్టపై చేసిన పోరాటం క్షేత్రస్థాయిలో చేయలేదనే ఆరోపణలు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. అదే విషయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. 8చంద్రబాబును కలిసేందుకు సన్నాహాలు... టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రొద్దుటూరు, కమలాపురం టీడీపీ అభ్యర్థులు నంద్యాల వరదరాజులరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి సిద్ధం అయ్యారు. ఆమేరకు బుధవారం విజయవాడలో కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రొద్దుటూరు ఇన్చార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరులోనూ, కమలాపురంలోనూ పారీ్టకి వ్యతిరేకంగా పనిచేశారనే ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు వైఎస్సార్సీపీ నేతల మద్దతు పెంచుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలు పారీ్టకి దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు ఇరువురు ఆధారాలు సేకరించి నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు.ప్రొద్దుటూరులో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో సహా ఆయన సన్నిహితులు టీడీపీకి పనిచేయలేదని వరదరాజులరెడ్డి, స్వగ్రామం కోగటంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని చైతన్యరెడ్డి కలిసికట్టుగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సైతం శల్యసారథ్యం వహించారని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచనల మేరకు పార్టీ ఫండ్ అప్పగించడంలో కూడా విఫలయయ్యారని ఆధారాలతో అందజేయనున్నట్లు సమాచారం. కాగా, కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబంపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ విజయం కోసం పనిచేయలేదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు
రాయచోటి టౌన్: తెలుగుదేశం పార్టీలో సూట్‌కేసుల్లో డబ్బు తీసుకొచ్చినవారికే టికెట్లు కేటాయిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా జెండామోసినవారికి, పార్టీకోసం అహరి్నశలు కష్టపడినవారికి మొండిచెయ్యి చూపుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) సోదరుడు, అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ నేత, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాతికేళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పని చేశానని, నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ జెండాలను మోశానని, టికెట్ ప్రకటించేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పార్టీ నాయకులకు గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు నాయుడు లేని హైప్ సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్త కొత్త వ్యక్తులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థిగా మాగంటి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా విదేశాల నుంచి అప్పటికప్పుడు సూట్ కేసులతో దిగిన వారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, మదనపల్లె ఇలా చాలా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రెచ్చగొట్టి రేసులో పెట్టారని వాపోయారు. అందుకే ఆ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక వినుకొండ దగ్గర జరుగుతున్న మేం సిద్ధం బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు రమేష్‌కుమార్ రెడ్డిప్రకటించారు. తన వ్యక్తిత్వం తెలిసినవారు, తన పనితీరు నచ్చి నవారు తనతో కలసి వస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా తెలిపారు. వైఎస్సార్సీపీలో పదవులకోసం కాకుండా తెలుగు దేశం పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తానని, అందుకోసం అహరి్నశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. -
కడపలో పడకేసిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీకి కడప లోక్‌సభ స్థానంలో అభ్యర్థి కరువయ్యారా.. ఓడిపోయే స్థానంలో పోటీకి ఆ పార్టీ నాయకులు విముఖత వ్యక్తం చేస్తున్నారా.. అంటే అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉంటారని ఇంతకాలం జిల్లా నేతలు భావించారు. అయితే ఈమారు ఎన్నికల్లో తాను కడప పార్లమెంట్‌కు పోటీ చేయలేనని అధినేత చంద్రబాబుకు వాసు తేల్చి చెప్పినట్లు సమాచారం. కడప అసెంబ్లీ బరిలో తన సతీమణీ విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరమూ లేకపోలేదని చెప్పుకొచి్చనట్లు తెలుస్తోంది. దీంతో తెరపైకి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని తీసుకొస్తే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు సోమవారం టీడీపీ ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే కూడా చేపట్టింది. కడప పార్లమెంట్ సీటు వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1989లో తొలిసారి వైఎస్సార్ గెలుపుతో ప్రారంభమైన విజయప్రస్థానం అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులు క్రమం తప్పకుండా పదిసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే ఒక్కసారి 1984లో మాత్రమే డాక్టర్ డీఎన్ రెడ్డి విజయం సాధించారు. 1989 నుంచి వరుసగా నాలుగు సార్లు వైఎస్సార్ ఎంపీగా విజయం సాధించారు. తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ జగన్, ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డిలను క్రమం తప్పకుండా జిల్లా ప్రజానీకం ఆదరించారు. 2024లో మరోమారు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగేందుకు నాయకులు వెనుకాడుతున్నారు. ఇంతకాలం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని భావించినా సోమవారం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అభ్యర్థిత్వంపై టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. కమలాపురం కలిసివస్తుందనే దిశగా.. వీరశివారెడ్డి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా బరిలో నిలిస్తే కమలాపురం నియోజకవర్గంలో ఉపయోగం ఉంటుందనే దిశగా ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న వీరశివా రెడ్డి పోటీ వల్ల ఆయన వర్గం ఎన్నికల్లో పటిష్టంగా పనిచేయగలదనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కమలాపురంలో ఇప్పటికే టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి కాకుండా ఆయన తనయుడు పుత్తా చైతన్యరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఈనేపథ్యంలో ఎంపీగా వీరశివారెడ్డిని బరిలో నిలిపితే ఏమేర ఉపయోగం ఉంటుందని తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీపీ అధ్యక్షురాలు షరి్మల పోటీలో నిలిస్తే టీడీపీ తరఫున ఎవరిని నిలిపితే ఆమెకు ప్రయోజనకారిగా ఉంటుందనే దిశగానూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఓట్లు చీలిస్తే ఉపయోగమా? లేక తక్కువ ఓట్లు తెచ్చుకునే అభ్యర్థిని బరిలో నిలిపితే కాంగ్రెస్ అ భ్యర్థి షరి్మలకు ప్రయోజనమా? అనే దిశగానూ బాబు యుక్తులు పన్నుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అందులోభాగంగా అటు శ్రీనివాసులరెడ్డి, ఇటు వీరశివారెడ్డి పేర్లతో సోమవారం ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరశివారెడ్డి బీసీ నేతల అసంతృప్తి అనంతపురం జిల్లాలో బీసీల్లోని సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత వర్గానికి చెందిన నిమ్మ ల కిష్టప్ప బాబు తమను వాడుకుని వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత బీకే పార్థసారథి వర్గమూ బాబుపై అసంతృప్తిగా ఉంది. ఇక పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2014లో వైఎస్సార్సీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లిన చాంద్‌బాషాకు ఈ దఫా మొండిచేయి చూపడంతో ముస్లింలూ ఆ పార్టీపై మండిపడుతున్నారు. చాంద్‌కు టికెట్ ఇవ్వకుండా నకిలీ డీడీల కేసుల్లో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ కుటుంబానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణ దుర్గం టికెట్ కోసం పోటీపడిన ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడిని కాదని బాబు బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును తెరమీదకు తేవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గుంతకల్లు టికెట్‌ను వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత గుమ్మనూరు జయరామ్‌కు ఇస్తే అసమ్మతి రేగుతుందని టీడీపీ భయపడుతోంది. అనంతపురం అర్బన్ సీటునూ అసమ్మతి సెగతో పెండింగ్‌లో పెట్టింది. శ్రీకాకుళంలో సిగపట్లు ఉమ్మడి జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థుల్ని ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని వర్గపోరు వేధిస్తోంది. పలాసలో గౌతు శిరీషకు చెక్ పెట్టాలని ఆ పార్టీ నాయకులే చూస్తున్నారు. పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు సిగపట్లు పడుతున్నారు. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ మధ్య యుద్ధమే జరుగుతోంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాలపై బీజేపీ కన్నేసింది. ఈ మూడింటిలో ఏదో ఒకటి కేటాయించాలని పట్టుపడుతోంది. జనసేన కూడా పాతపట్నం, ఎచ్చెర్ల, పలాసల్లో ఒక సీటును ఆశిస్తోంది. కొలికపూడి మాకొద్దు బాబూ..! ఎనీ్టఆర్ జిల్లా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ తమకొద్దని ఆ పార్టీ నేతలు టీడీపీ అధిష్టానానికి అలి్టమేటం జారీ చేస్తున్నారు. ఆయన చరిత్ర చూస్తే ఆది నుంచి వివాదాస్పదమే. ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో ఆయన వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకూ మింగుడు పడడం లేదు. మూడునెలల తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలన్నీ కూలి్చవేస్తామని శ్రీనివాస్ వ్యాఖ్యానించడంతో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. తాగునీటి సమస్యపై పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావుడి చేయడం, డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరచడం, ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచేలా మాట్లాడడం, పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఆయన తీరుపై నేతలు విసిగిపోయారు. ఈయన మాకొద్దు బాబు..! అంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జవహర్, ఇక్కడ మళ్లీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఉమాదేవికి దక్కని టికెట్.. ఆమెకే ఇన్చార్జ్ పదవి..
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కడప నియోజకవర్గ ఇన్చార్జిగా శుక్రవారం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి సతీమణీ ఆర్ మాధవి పేరు ఖరారు చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామకపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కేంద్రమైన కడప టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కమారుగా బట్టబయలయ్యాయి. ఇన్చార్జిగా నియమిస్తారని ఎంతోకాలంగా ఆశలు పెట్టుకున్న కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబం భగ్గుమంటోంది. స్థానికులకు అవకాశం కల్పించమని కోరినా ఫలితం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్థానికుల సత్తా ఏమిటో స్థానికేతరులకు చూపించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కడప నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఆ పార్టీ అభ్యర్థి ఎస్బీ అంజద్‌బాషా ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల తర్వాత టీడీపీ కడప గడపలో వరుసగా ఓటమి చవిచూసింది. 2004 నుంచి కాంగ్రెస్, తర్వాత వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగిస్తోంది. మరోమారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ ఏకై క కార్పొరేటర్ జి ఉమాదేవి కుటుంబం ఆశలు పెంచుకుంది. ఆమేరకు టీడీపీ నుంచి సిగ్నల్స్ రావడంతో గ్రౌండ్ వర్క్‌పై గత కొంతకాలంగా పథక రచన చేపట్టారు. ఓటింగ్ ఎలా అనుకూలంగా పెంచుకోవాలనే దిశగా ముమ్మర యత్నాలు చేశారు. క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా మంతనాలు నిర్వహిస్తూ పలువురు క్రియాశీలక వ్యక్తుల మద్దతు కోరుతూ చాపకింద నీరులా ఉమాదేవి మామ ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. అంతలోనే టీడీపీ ఇన్చార్జిగా ఆర్ మాధవిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఊహించని పరిణామంతో లక్ష్మీరెడ్డి కుటుంబం కినుక వహించింది. ఆయన మద్దతుదారులు ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో చూపించాలని బాహాటంగా ఆరోపణలు సంధిస్తున్నట్లు సమాచారం. స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని కోరినా... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పలుమారు కలిసి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కడప టీడీపీ నేతలు అభ్యర్థించారు. స్థానికులను పరిగణలోకి తీసుకుని టికెట్ ఆశిస్తున్న అమీర్‌బాబు, జి ఉమాదేవి ఎవరికై నా టికెట్ కేటాయించాలని, మేమంతా కలిసికట్టుగా టీడీపీ విజయం కోసం కృషి చేస్తామని టీడీపీ నేత లక్ష్మీరెడ్డి చెప్పినట్లు సమాచారం. సామాజిక వర్గ సమీకరణ నేపథ్యంలో మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అమీర్‌బాబును పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. బలిజలు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే దుర్గాప్రసాద్ లేదా హరిప్రసాద్‌లను పరిశీలించాలని, రెడ్డికి టికెట్ కేటాయించాల్సి వస్తే తమ కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని లేదంటే గోవర్ధన్‌రెడ్డికి కట్టబెట్టినా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. అలా కాకుండా ఆర్ శ్రీనివాసులరెడ్డికి కట్టబెడితే పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం వాసు కుటుంబానికి ఇన్చార్జి బాధ్యతలను కట్టబెట్టింది. అధిష్టానం నిర్ణయంతో కడప గడపలోని తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. వ్యూహాత్మక అడుగులు వేసిన వాసు... కడపలో ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబాన్ని కట్టడి చేసేందుకు పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి వ్యూహాత్మక అడుగులు వేశారని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించేందుకు కుప్పం వెళ్తూ కడప ఎయిర్‌పోర్టు నుంచి ఆలంఖాన్‌పల్లె మీదుగా కడపలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని తెరవెనుక మంత్రాంగం నిర్వహించి అడ్డుకున్నారు. రింగ్‌రోడ్డు వెంబడి దేవుని కడప, పెద్దదర్గా దర్శించేలా ప్రణాళిక రూపొందించారు. తర్వాత చంద్రబాబు జోన్–6 ప్రాంతీయ సదస్సు నిర్వహణ కార్యక్రమం ఎయిర్‌పోర్టు సమీపంలో లక్ష్మీరెడ్డి స్థలంలో ఏర్పాటు చేయాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. లక్ష్మీరెడ్డి కుటుంబం టీడీపీలో ఫోకస్ కాకుండా వ్యూహాత్మకంగా శ్రీనివాసులరెడ్డి అడ్డుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈనేపథంలో కడప తెలుగుతమ్ముళ్లు ఇన్చార్జి ఆర్ మాధవికి ఏమాత్రం సహకరిస్తారో వేచి చూడాల్సిందే.! -
శ్రీనివాసుల రెడ్డి హత్య కేసు... ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత సుబ్బారెడ్డి !
కడప అర్బన్ : వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత పాలెంపల్లె సుబ్బారెడ్డిగా పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఏ3 నిందితుడు ల్యాబ్ శ్రీనుతో నిర్వహించిన రహస్య ఒప్పందం మేరకు హత్య ప్రణాళిక రచించినట్లు తేటతెల్లమైంది. ప్రధాన నిందితుల రిమాండ్ అనంతరం ఫోన్ కాల్స్, వాట్సా్ప్ చాటింగ్, గూగుల్ టేకౌట్ పరిశీలన దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. సుబ్బారెడ్డి కోసం గాలిస్తుండగా అప్పటికే తన మొబైల్ ఫోన్ ఇంట్లో పడేసి, హైదరాబాద్‌కు వెళ్లినట్లు పోలీసులు పసిగట్టారు. వివిధ ప్రాంతాల్లో గాలించిన పోలీసులు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు ల్యాబ్ శ్రీను టీడీపీ నేత సుబ్బారెడ్డితో చేసుకున్న ఒప్పందం వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హతుడు...నిందితులు ఒకనాటి మిత్రులే.. హత్యకు గురైన సి శ్రీనివాసులరెడ్డి, ప్రధాన నిందితులు ప్రతాప్‌రెడ్డి, పాలెంపల్లె సుబ్బారెడ్డి వీరంతా ఒకనాటి మిత్రులే. 2019 ఎన్నికల్లో వీరంతా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు. అప్పటికే కడపలో కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లోనూ ముగ్గురు ఉన్నారు. సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో 2020లో విడిపోయా రు. ఆ తర్వాత శ్రీనివాసుల రెడ్డితో సన్ని హి తంగా ఉన్న ప్రతాప్ రెడ్డి కూడా అతనితో విభేదాలు వచ్చి విడిపోయాడు. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి, ల్యాబ్ శ్రీను పాలెంపల్లె సుబ్బారెడ్డితో హత్య విషయమై మంతనాలు నిర్వహించారు. దీనికి సుబ్బారెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంతో శ్రీనివాసులరెడ్డి హత్యకు ప్రణాళిక రచించి అంతమొందించారు. కాగా ఇదే విషయమై ల్యాబ్ శ్రీను వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘శ్రీనువాసులరెడ్డి మాకు మోసం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు, శ్రీనువాసులరెడ్డిని హత్య చేయాలనుకుంటున్నాం’ అంటూ ఇంటికి వెళ్లి చెప్పి నట్లుగా ల్యాబ్ శ్రీను వివరించారు. ‘రూ.30 లక్షలు ఇస్తా.. కోర్టు వ్యవహారం చూసుకుంటా’నని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు ల్యాబ్ శ్రీను అందులో వెల్లడించడం గమనార్హం. పాలెంపల్లె సుబ్బారెడ్డి అరెస్టు – కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడి కడప అర్బన్ : కడప నగరంలోని సంధ్యా సర్కిల్ వద్ద జూన్ 23న ఉదయం చిన్న నాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన పాలెంపల్లి సుబ్బారెడ్డి అలియాస్ రాజు సుబ్బారెడ్డి (42)ని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడించారు. ఈనెల 5న బుధవారం సాయంత్రం ఇర్కాన్ సర్కిల్ వద్ద అరెస్టు చేసినట్లు వివరించారు. గురువారం సాయంత్రం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. గత నెల హత్యకు గురైన చిన్ననాగిరెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం అరెస్టు చేసిన పాలెంపల్లి సుబ్బారెడ్డి ఇద్దరూ 2020 సంవత్సరం వరకూ సన్నిహితంగా ఉంటూ కలిసి వ్యాపారాలు చేసుకునేవారు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. పరస్పర దాడులు చేసుకునే స్థితికి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసులరెడ్డికి సన్నిహితులుగా ఉన్న ప్రతాప్‌రెడ్డి, ల్యాబ్ శ్రీనివాసులు సైతం విడిపోయారు. దీంతో శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు ల్యాబ్ శ్రీను సుబ్బారెడ్డితో చర్చలు నిర్వహించారు. హత్య చేసేందుకు నిందితులకు సుబ్బారెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వడంతో పాటు కోర్టు వ్యవహారాలు చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. హత్య కేసులో ఇదివరకే అరెస్టు అయిన ఏ3 నిందితుడు మేరువ శ్రీనివాసులు అలియాస్ ల్యాబ్ శ్రీను హత్యకు కొన్ని రోజుల ముందు సుబ్బారెడ్డి ఇంటిలో కూర్చుని హత్యకు కుట్ర చేసినట్లు తమ విచారణలో వెల్లడైంది. హత్య చేసిన తర్వాత ఏ3 అయిన ల్యాబ్ శ్రీను పాలెంపల్లి సుబ్బారెడ్డికి ‘హత్య చేశాం..అతను చనిపోయాడు..’అంటూ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలను పరిశీలించి చూడగా సుబ్బారెడ్డి ప్రమేయం స్పష్టమైందని డీఎస్పీ తెలిపారు. నిందితుడు సుబ్బారెడ్డి తన సెల్ ఫోన్లోని వాట్సాప్ మెసేజ్‌లను డిలీట్ చేసారు. వాటిని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన సుబ్బారెడ్డి పై 12 కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు, రెండు ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులతో పాటు ఎస్.సి.,ఎస్.టి అట్రాసిటీ కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. -
వైఎస్ఆర్సీపీ నేత హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
కడప అర్బన్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిన్ననాగిరెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి(42) హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. శ్రీనివాసులరెడ్డిని ఈ నెల 23న ఉదయం 8:10 గంటల సమయంలో కడప నగరం ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంధ్యా సర్కిల్ సమీపంలో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు మోపురు ప్రతాప్‌రెడ్డితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను తీసుకుని వచ్చి హాజరు పరిచారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విలేకరులకు వివరాలు తెలియజేశారు. అరెస్టయిన వారిలో పెండ్లిమర్రి మండలం కొండూరుకు చెందిన ప్రధాన నిందితుడు మోపురు ప్రతాప్‌రెడ్డి ప్రస్తుతం కడపలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగాన ఓ ఇంటిలో నివాసం వుంటున్నాడు. రెండవ నిందితుడు కడప పాలెంపల్లికి చెందిన మేరువ శ్రీనివాసులు ప్రస్తుతం సాయిపేటలో నివాసం వుంటున్నాడు. మూడవ నిందితుడు కడప నగరంలోని పాతకడపకు చెందిన కల్లూరు సురేష్‌కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్, కడప నగర శివార్లలోని పుచ్చలపల్లి సుందరయ్యకాలనీకి చెందిన బరకం హరిబాబు, కడప నగరంలోని శంకరాపురంలో నివాసముంటూ వార్డు వలంటీర్‌గా వున్న కోనేరు వెంకటసుబ్బయ్య, కడప నగరం పాతకడపకు చెందిన పత్తూరు భాగ్యరాణి వున్నారు. గతంలో శ్రీనివాసులరెడ్డితో కలిసి ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు కడప చుట్టుపక్కలా, ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ విషయంలో వారికి విభేదాలు తలెత్తాయి. ప్రతాప్‌రెడ్డితోపాటు మరో నిందితుడు మేరువ శ్రీనివాసులుకు శ్రీనివాసులరెడ్డి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించాడని భావించారు. అంతేగాక కిరాయి హంతకులతో తనను అంతమొందించడానికి ప్రయతిస్తున్నాడని ప్రతాప్‌రెడ్డి భావించాడు. శ్రీనివాసుల రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నాడని ప్రతాప్‌రెడ్డి భావించాడు. దీంతో శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు తనతో పాటు వున్న మేరువ శ్రీనివాసులు, నిందితురాలు భాగ్యరాణి పరిచయం చేసిన మిగిలిన నిందితులతో కలిసి ప్రతాప్‌రెడ్డి పథకం పన్నాడు. కల్లూరు సురేష్‌కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్, బరకం హరిబాబు, వెంకటసుబ్బయ్యతో పరిచయం చేసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ పథకంలో భాగంగానే ఈనెల 23న ఉదయం మోపురు ప్రతాప్‌రెడ్డి, సురేష్‌కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్ బురఖాలు ధరించారు. తమతోపాటు మారణాయుధాలైన బాకు, కత్తిని, కొడవలిని తీసుకున్నారు. శ్రీనివాసులరెడ్డి కదలికలను గమనించారు. శ్రీనివాసులరెడ్డి రాబిట్ ఫిట్‌నెస్‌కు వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు కాపుకాశారు. అతను రాగానే మృతుడి రాయల్‌ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌కు కోనేరు వెంకటసుబ్బయ్య తన మోటార్ సైకిల్‌ను అడ్డు పెట్టాడు. అప్పటికే బురఖాలు ధరించి కత్తులు చేతపట్టిన ప్రతాప్‌రెడ్డి, సురేష్‌కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్ ఒక్కసారిగా శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసులరెడ్డి ఛాతీకి, గుండెకు బలమైన గాయాలు కావడంతో కొంతదూరం వెళ్లి కుప్పకూలిపోయాడు. హత్య జరిగిన తరువాత మేరువ శ్రీనివాసులు అక్కడే వుండి గమనించసాగాడు. హరిబాబుతో ఫోన్లో మాట్లాడుతూ అతని మోటార్‌సైకిల్‌పై ప్రతాప్‌రెడ్డి, ఫ్రాన్సిస్ ఊరిబయటికి వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, బురఖాను అక్కడే వదిలేసి వెళ్లారన్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులకు ఫ్రాన్సిస్‌ను పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాత కడపకు చెందిన భాగ్యరాణిని 109 (హత్యకు ప్రేరేపించడం) నేరం కింద అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమందిపై అనుమానాలున్నాయని, వారికి నోటీసులు ఇచ్చామని, మరికొంతమందిపై వారి నుంచి సమాధానాలు రావాలని ఎస్పీ పేర్కొన్నారు. కాల్ డీటైయిల్స్ ఆధారాలు, వాట్సాప్ చాట్లు, గూగుల్ టేక్ అవుట్ తదితర సాంకేతిక అంశాల ద్వారా వివరాలు రాబడుతున్నామనీ, ఎవరిపై అనుమానాలు వచ్చి నిరూపణ అయితే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనదనీ ఎస్పీ అన్నారు. ఆ మహిళ.. అందరికీ స్ఫూర్తిదాయకం హత్య జరిగే సమయంలో ఓ మహిళ ధైర్యంగా కత్తిని అక్కడి నుంచి తీసిందని, సదరు మహిళను సన్మానిస్తామని ఎస్పీ తెలిపారు. పబ్లిక్‌లో ఇలాంటి సంఘటనలు జరిగేటపుడు పౌరులు తమవంతు బాధ్యతగా ప్రతిఘటించాలని కోరారు. కేసును తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, ఇంకా కొన్ని అనుమానాలు వు న్నాయని, అలాంటి వారిని కూడా అరెస్ట్ చేస్తామ న్నారు. హత్యలో ఎలాంటి రాజకీయం లేదని, హత్య కేవలం ప్రాపర్టీ, డబ్బుల కోసమే జరిగిందన్నారు. ఈ సంఘటనలో అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయని, అలాంటి వాటిపైన కూడా దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ కబ్జాకు కేసుకు సంబంధం లేదని, ఒకవేళ భూ కబ్జాకు సంబంధించి వుంటే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటిదేమీ లేదన్నారు. ● ఈ హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఆధ్వర్యంలో కీలకపాత్ర పోషించిన కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్.వి నాగరాజు, కడప రూరల్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, సిద్దయ్య, సైబర్‌క్రైమ్ ఎస్ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఏఎస్ఐ మల్లయ్య, హెడ్‌కానిస్టేబుల్ ఎన్.వేణుగోపాల్, కానిస్టేబుళ్లు ఖాదర్‌హుసేన్, చంద్ర, నారాయణరెడ్డి, కిరణ్, బాషలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌కు రంగం సిద్ధం
కడప అర్బన్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు చిన్ననాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి (42) దారుణ హత్య కేసును జిల్లా పోలీసు యంత్రాంగం ఛేదించింది. కొన్ని రోజులుగా కీలక నిందితులు పక్కాగా వ్యూహం పన్నినట్లు స్పష్టమైంది. శ్రీనివాసులరెడ్డికి, ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డికి ఇద్దరికీ వెన్నుదన్నుగా నిలిచిన మరో కీలక వ్యక్తికి కూడా ఈ హత్యలో ప్రమేయం వుందని పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యాపార సంస్థల వద్దనే రోజుల తరబడి కీలక నిందితుడు ప్రతాప్‌రెడ్డి, మరి కొంత మందితో గంటల తరబడి మంతనాలు చేసినట్లుగా పోలీసులకు సీసీ ఫుటేజీల ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతాప్‌రెడ్డి స్వగృహాంలో నిర్వహించిన సోదాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు ఛేదించడంలో ప్రమేయమున్న అందరిపైనా పోలీసులు నిష్పక్షపాతంగా, చట్ట పరిధిలో శిక్షించేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి వ్యతిరేకుల ప్రమేయం, వ్యాపార లావాదేవిల్లో నెలకొన్న వివాదాలు, భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గురువారం రాత్రి మట్టుబెట్టేందుకు మాటు వేసిన ప్రధాన నిందితుడు శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు గురువారం రాత్రి కూడా మాటు వేసినట్లు తెలుస్తోంది. ఒకప్పటీ అనుకూలమైన సహచరుడుగా ఉంటూ దాదాపు ఏడాదిగా దూరంగా ఉన్న ఎర్రముక్కపల్లెకు చెందిన గుంటీ నాగేంద్ర సమీప బంధువులచే శ్రీనివాసులరెడ్డిని డిన్నర్‌కు ఆహ్వానించారు. డిన్నర్ ముగించుకొని రాజీవ్‌మార్గ్ ప్రధాన రహదారిలో శ్రీనివాసులరెడ్డి వచ్చే అవకాశం ఉంటుందనే భావనతో.. సమీపంలో ప్రధాన నిందితుడు మాటు వేసి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు హాజరు కావడం, వెహికల్లో వెళ్లి రావడంతో హత్య పథక రచన అమలు చేయలేకపోయినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం మాటు వేసి, పక్కా ప్రణాళిక బద్ధంగా బుర్ఖాలు ధరంచి హత్యాకాండను అమలు చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సహకారంపై ప్రత్యేక దృష్టి శ్రీనివాసులరెడ్డి హత్యలో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రధాన నిందుతులకు సహకరించిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో ఓ వ్యాపారవేత్తతో ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి చేపట్టిన లావాదేవిలపై కూపీ లాగినట్లు సమాచారం. హత్యాకాండలో పాల్గొన్న వారికి మృతుడు శ్రీనివాసులరెడ్డి మధ్య నెలకొన్న వివాదాలను సరిపోల్చుకుంటున్నారు. అయితే హత్య తర్వాత ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డికి సహకరించిన వ్యక్తులపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి స్కూటర్‌పై ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి ప్రతాప్‌రెడ్డిని తరలించినట్లు కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపైన డయల్ 100కు సమాచారమిచ్చిన పిదప పోలీసులకు దొరికిపోయేలా చాకచక్యంగా వ్యవహరించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్వి నాగరాజు, కడప రూరల్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్ఐలు, సిబ్బందితో కలిసి ఈ హత్య కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను, ప్రతాప్‌రెడ్డితోపాటు, ఇతర నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజులల్లో నిందితుల్ని మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. -
కడపలో వైఎస్సార్సీపీ నేత దారుణహత్య
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సంధ్యాసర్కిల్ సమీపంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుడు సి.శ్రీనివాసులరెడ్డి (42) దారుణహత్యకు గురయ్యాడు. బురఖాలు ధరించి మాటువేసిన దుండగులు ఒక్కసారిగా కొడవళ్లతో దాడిచేశారు. పిడిబాకులతో విచక్షణారహితంగా పొడిచారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెత్తిన శ్రీనివాసులరెడ్డి వందడుగుల దూరంలో కుప్పకూలిపోయాడు. సినిమా ఫక్కీలో హత్యచేసిన దుండగులు పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి కొన్నేళ్లుగా కడపలో నివాసం ఉంటున్నాడు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తూ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. రోజూ సంధ్యాసర్కిల్ సమీపంలో ఎర్రముక్కపల్లి దారిలో ఉన్న రాబిట్ జిమ్‌కు వ్యాయామానికి వెళ్లేవాడు. ఆయన కదలికలను గమనించిన దుండగులు శుక్రవారం ఉదయం జిమ్ సమీపంలో బురఖాలు ధరించి మాటువేశారు. శ్రీనివాసులరెడ్డి జిమ్ నుంచి బయటకు రాగానే మారణాయుధాలతో ఒక్కసారిగా దాడిచేశారు. కత్తిపోట్లకు గురైన శ్రీనివాసులరెడ్డి దుండగుల నుంచి రక్షించుకునేందుకు కొద్దిదూరం పరుగెత్తి కుప్పకూలిపోయాడు. అతడు రక్తపుమడుగులో తీవ్రగాయాలతో పడిపోవడంతో నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న శ్రీనివాసులరెడ్డి భార్య మౌనిక అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో భర్తను రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరిన కొద్దిసేపటికే శ్రీనివాసులరెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసులరెడ్డి హత్యకు నిందితులతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుల్ని పట్టుకునేందుకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ సారథ్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి హత్యపట్ల ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తీవ్ర ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు మోపూరి ప్రతాప్‌రెడ్డి, పాలెంపల్లి సుబ్బారెడ్డి, జమీల్ మొబైల్స్ యజమాని జమీల్, గుంటి నాగేంద్రలపై క్రైమ్ నంబర్ 252/2023 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు మహాదీప్రెడ్డి (14), హనుదీప్రెడ్డి(12) ఉన్నారు. శ్రీనివాసులరెడ్డి స్వగ్రామంలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ‘లోకేశ్ పర్యటనలోనే హత్యకు బీజం’ శ్రీనివాసులరెడ్డి హత్యకేసులో నిందితులు పావులు మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి చెప్పారు. ఇటీవల టీడీపీ నేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఈ హత్యకు బీజం పడిందని ఆరోపించారు. శ్రీనివాసులరెడ్డిని హత్యచేసి అందరినీ భయాందోళనలకు గురిచేయాలని కుట్ర చేసినట్లు భావిస్తున్నామన్నారు. సూత్రధారులపై లోతైన దర్యాప్తుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
టీడీపీ నేత ఇంటిలో 30గంటల పాటు సోదాలు
కడప అర్బన్ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాదాపు 30 గంటలపాటు సోదాలు నిర్వహించారు. కడపలోని ద్వారకానగర్‌లోని ఆయన ఇంటితో పాటు, హైదరాబాద్‌లో రెండు చోట్ల, విజయవాడ, బెంగుళూరు, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్లలో కూడా కాంట్రాక్ట్ పనుల క్రమంలో పన్నులు ఎగవేశారనీ దాడులు చేసినట్లు తెలిసింది. దాడుల సందర్భంగా సీఆర్íపీఎఫ్ గట్టి బందోబస్తు నిర్వహించింది. కడపలో వాసు ఇంటిలో జరిగిన సోదాల సమయంలో ఆయన తల్లి హేమలత ఉన్నారు. వచ్చిన అధికారుల తనిఖీలకు తమ వంతు సహకరించామని వాసు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐటీ అధికారులు తనిఖీచేసి పలు కీలకపత్రాలు, బంగారు ఆభరణాలు, నగదును సీజ్ చేశారు. వాటిని తమ వెంట తీసుకుని వెళ్లారు. దాడులకు సంబంధించిన వివరాలేవీ అధికారులు వెల్లడించలేదు. -
ప్రత్తిపాటి శరత్ కంపెనీలో సోదాలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ/కడప: ఆదాయపన్ను శాఖ దాడులతో టీడీపీ నాయకుల అక్రమాల డొంక కదులుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం మొదలైన ఐటీ శాఖ సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరోవైపు మాదాపూర్‌లోని డీఎన్సీ ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి 69 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. డీఎన్సీ ఇన్ఫ్రా కంపెనీ యాజమాని నరేన్ చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్ అనుచరుడు కిలారి రాజేశ్‌తో నరేన్ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. కిలారి రాజేశ్‌కు చెందిన రెండు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కిలారు రాజేష్ వ్యవహారంతో చంద్రబాబు, లోకేశ్ టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు కాగా, చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 9 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం నిన్నటి నుంచి సోదాలు కొనసాగిస్తోంది. మరోవైపు సీఆర్పీఎఫ్ అదనపు సిబ్బంది ఈ ఉదయం శ్రీనివాసరావు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. జాడ లేని శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) హైదరాబాద్ కార్యాలయంలో ఐటీ సోదారులు ఈ ఉదయం ముగిశాయి. పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న శ్రీనివాసులరెడ్డి నివాసంలో దాదాపు 30 గంటల పాటు సాగిన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఐటీ అధికారులు వెళ్లిపోయారు. శ్రీనివాసులరెడ్డి ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు. వరుస ఐటీ దాడులతో టీడీపీ ముఖ్య నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతో టీడీపీ నేతలు వణుకుతున్నారు. (చదవండి: చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు) -
బాబు సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు..!
-
చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/కడప అర్బన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఐటీ అధికారులు ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. గురువారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు విజయవాడలోని శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అలాగే లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన రాజేశ్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి. ఐటీ శాఖ తనిఖీలుచేస్తున్న భవనంలోకి వెళ్లేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులతో మాట్లాడుతున్న టీడీపీ నాయ్యవాదులు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ.. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న ఇంటితోపాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సీఆర్పీఎఫ్ పోలీసుల పహారాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారులే ఈ సోదాల్లో పాల్గొనడం గమనార్హం. హైదరాబాద్ పంజాగుట్ట లుంబినీ ఎన్‌క్లేవ్‌లోని ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నం.13లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కడపలో శ్రీనివాసులరెడ్డి ఇంట్లో లభించిన సమాచారంతో కడపలోని మరో సబ్ కాంట్రాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టులకు సంబంధించిన పలు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.300 కోట్ల ఆన్లైన్ లావాదేవీలు మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి తనయుడైన శ్రీనివాసులరెడ్డి ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ఆదాయానికి సంబంధించిన పన్నులు చెల్లించకుండా ఎగవేశారని పేర్కొంటూ ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. పన్నుల ఎగవేతతోపాటు శ్రీనివాసులరెడ్డి కుమార్తె వివాహం నిశ్చయమైన సమయంలో దాదాపు రూ.300 కోట్ల ఆన్లైన్ లావాదేవీలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల వివరాలను తెలియజేసేందుకు అధికారులు నిరాకరించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణలోని నేతల ఇళ్లు, కార్యాలయాల్లో.. తెలంగాణలోని కరీంనగర్లో గురువారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు నేతలకు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. -
టీడీపీ అధ్యక్షుడి ఇంట్లో ఐటీ సోదాలు
-
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన పత్రాలను ఐటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏమేరకు పన్ను ఎగవేశారన్నది సోదాల్లో తేలనుంది. -
కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి సోమవారం సాయంత్రం విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కడప వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి (56) ప్రొద్దుటూరులో భార్య పద్మావతితో కలిసి ఉంటున్నాడు. వారికి కుమార్తె హిమబిందు(30), కుమారుడు శరత్చంద్ర(26) ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు తనను విచారణకు పిలిచారని, తొలుత కసునూరుకు, తరువాత పులివెందులకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పిన శ్రీనివాసులరెడ్డి సోమవారం ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్లాడు. సాయంత్రం కసునూరులోని భర్త బంధువులకు భార్య పద్మావతి ఫోన్ చేసింది. కసునూరులోని పొలంలో ఉన్నాడని బంధువుల ద్వారా తెలుసుకుని ఇంటికి తీసుకునిరమ్మని చెప్పింది. కసునూరులో బంధువుల ఇంటికి శ్రీనివాసులరెడ్డిని తీసుకుని రాగానే సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వాంతులు చేసుకోసాగాడు. ఈ క్రమంలో భార్యకు ఫోన్ చేసి తాను శనగల్లో కలిపే గుళికల మందును మింగానని చెప్పాడు. బంధువులు వెంటనే అతడిని పులివెందులలోని ఆసుపత్రికి తీసుకుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులరెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతడి జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు సీజ్ చేశారు. భర్త సూసైడ్ నోట్లో తెలిపిన మేరకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని శ్రీనివాసులరెడ్డి భార్య పద్మావతి పోలీసులను కోరారు. ఈ మేరకు కడప వన్‌టౌన్‌లో క్రైం నెం.298/2019లో సెక్షన్ 174 సీఆర్పీసీ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ చెప్పారు. శ్రీనివాసులరెడ్డి మృతదేహానికి రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. -
ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య
► బాకీ చెల్లించాలని అడిగినందుకు కత్తితో పొడిచిన కటిక వ్యాపారి ► మృతి చెందిన లారీ యజమాని శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలో సంచలనం సృష్టించిన మారుతి ప్రసాద్‌రెడ్డి హత్య మరువక ముందే మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాకీ డబ్బు చెల్లించాలని అడిగినందుకు టీచర్స్ కాలనీకి చెందిన ఉండేల శ్రీనివాసులరెడ్డి (48)ని కటిక వ్యాపారి అమర్నా«థ్ అనే వ్యక్తి ఆదివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో ఉన్న టీచర్స్ కాలనీకి చెందిన శ్రీనివాసులరెడ్డి రిలయన్స్ పెట్రోల్ బంకు కూడలిలో టీ దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆ టీ దుకాణం పక్కనే మత్స్య కాలనీకి చెందిన అమర్నాథ్ కటిక అంగడి ఉండేది. అప్పుడప్పుడు అమర్నాథరెడ్డి చేతి బదులుగా శ్రీనివాసులరెడ్డి దగ్గర అప్పు తీసుకొనేవాడు వాగ్వాదానికి దిగి.. 20 రోజుల క్రితం శ్రీనివాసులరెడ్డి వద్ద అమర్నాథ్ రూ.30 వేలు తీసుకున్నాడు. డబ్బు ఇవ్వాలని శ్రీనివాసులరెడ్డి రోజూ అడుగుతున్నా అతను రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఆదివారం డబ్బు కావాలని శ్రీనివాసరెడ్డి గట్టిగా అడగటంతో అందరూ చూస్తుండగానే అమర్నాథ్ మాంసం కోసే కత్తి తీసుకొని గుండెల్లో పొడవడంతో ప్రధాన రోడ్డుపై కుప్ప కూలి పోయాడు. తీవ్ర రక్తస్రావం అయిన అతన్ని స్థానికులు వెంటనే ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఓబులేసు తెలిపారు. -
ఎంత దుర్మార్గుడు
అతనో దుర్మార్గుడు. తనకు పుట్టింది ఆడబిడ్డని తెలసి కన్నెత్తి కూడా చూడలేదు. ఆడబిడ్డతో ఇంటికి వస్తే.. నిన్ను కూడా వదిలించుకుంటానంటూ భార్యనూ బెదిరించాడు. ఒక్కసారైనా వచ్చి తల్లీబిడ్డను చూసి వెళ్లాల్సిందిగా కోరిన అత్తమామలనూ చెడామడా తిట్టేశాడు. అయినా అతనిలోని రాక్షసత్వం తగ్గలేదు. తన ఇంట ఆడబిడ్డ పుట్టడమే అరిష్టంగా భావించిన ఆ దుర్మార్గుడు తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్న ఆ పసికందును ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసి చంపేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని నిందితుడు కొంగళి దిలీప్‌కుమార్‌ను ప్రొద్దుటూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. - ప్రొద్దుటూరు క్రైం ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఉదంతంలో ఎన్నో కోణాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. వాటి వివరాలను స్థానిక డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి శనివారం విలేకరులకు వివరించారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాలు విని పోలీసులే విస్మయం చెందారు. ప్రొద్దుటూరుకు చెందిన దిలీప్‌కుమార్ తన భార్య రేఖను జూలై 22న పరీక్ష రాసేందుకని తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన స్కానింగ్ సెంటర్లో ఆమెకు స్కానింగ్ చేయించాడు. పుట్టబోయేది మగపిల్లాడంటూ స్కానింగ్ నిర్వాహకులు చెప్పడంతో సంతోషంతో ప్రొద్దుటూరుకు తిరిగి వచ్చాడు. స్కానింగ్ చేయించిన విషయం తెలుసుకున్న దిలీప్‌కుమార్ అత్త అన్నపూర్ణమ్మ ఎందుకు స్కానింగ్ చేయించారు? పుట్టేది ఆడపిల్లైనా,మగపిల్లాడైనా ఒక్కటే కదా అని చెప్పారు. అయితే ‘నాకు మగపిల్లాడే కావాలి, ఆడపిల్ల పుడితే నీ కూతుర్నైనా వదిలించుకుంటా’నంటూ తెగేసి చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న రేఖ ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వెంటనే విషయాన్ని రేఖ తల్లి అన్నపూర్ణమ్మ ఫోన్ చేసి దిలీప్‌కు చెప్పగా ‘ఆడపిల్లైతే నాకొద్దు.మీరే ఉంచుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కనీసం ఆస్పత్రిక వచ్చి తల్లీబిడ్డను ఒక్కసారైనా చూసి వెళ్లాల్సిందిగా ఆమె ఎంతలా బతిమలాడినా అతని మనసు కరగలేదు. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లిన దిలీప్ భార్యను పలుకరించాడే గానీ, బిడ్డ వైపు కన్నెతి కూడా చూడలేదు. అంతటితో ఆగక ‘తిరుపతిలో స్కానింగ్ చేయించినప్పుడు ఆడపిల్ల అని చెప్పి ఉంటే అప్పుడే నీకు అబార్షన్ చేయించేవాడినని’ భార్యతో గొడవపడ్డాడు. ‘ఆడపిల్లను ఇక్కడే వదిలేసి ఇంటికి రావాలని, లేదంటే నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వనంటూ భార్యను హెచ్చరించి అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ క్రమంలోనే 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రేఖ ఇంటికి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలిసినప్పటి నుంచి భార్యతో కూడా సరిగా మాట్లాడలేదు. అదే రాత్రి అత్తగారింటికి వెళ్లిన దిలీప్ పాప విషయమై భార్య, అత్తామామలతో గొడవపడ్డాడు. ఎందుకు పాపను ఇంటికి తీసుకొచ్చారంటూ అతను వారిపై మండిపడ్డాడు. అందరు నిద్రపోయాక అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పసికూనను ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంక్‌లో పడేశాడని డీఎస్పీ వివరించారు. స్థానిక శ్రీనివాసనగర్‌లోని నోకియా కేర్ వద్ద ఉన్న నిందితుడ్ని శనివారం అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, జావిద్, జగన్నాథ్, ఏఎస్ఐ మునిచంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇదేంది వా(బా)సు!
టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిపై తెలుగుతమ్ముళ్ల గుస్సా మరో పాళెం కానున్నారని సీనియర్ నేతల ఆవేదన సొంత కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మెరుపు తీగలే అధికమయ్యాయా? పార్టీ ఉన్నతి కోసం, శ్రేణులకు అండగా ఉండే నాయకులు కనుమరుగయ్యారా? కడప పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి (వాసు) మరో పాళెం కానున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అందుకు కారణం పార్టీ కోసం కష్టపడకుండానే ఎంపీ టికెట్ దక్కడం ఒక ఎత్తయితే, అభ్యర్థిగా ప్రకటించాక ఒంటెత్తు పోకడలకు పోతుండటం మరో కారణంగా చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు. రాజకీయాలకు దూరంగా కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డ శ్రీనివాసులరెడ్డిని కడప పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. రాజకీయ వాసన అంతగా పట్టని వాసు ఒక్కమారుగా అభ్యర్థి కావడం వెనుక డబ్బే ఏకైక అర్హతగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి తనయుడిగా గుర్తింపు ఉన్న వాసు ఇంతకాలం ప్రత్యక్షంగా ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. పెపైచ్చు లక్కిరెడ్డిపల్లెలో దివంగత రాజగోపాల్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు రమేష్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అయితే ఒక్కమారుగా వాసుకు రాజకీయ కాంక్ష ఏర్పడింది. దాంతో ముందుగా రమేష్‌రెడ్డి స్థానంలోకి వచ్చేందుకు తీవ్రప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే రాజగోపాల్‌రెడ్డి బంధువులు, సన్నిహితులు అన్నదమ్ముళ్లు ఇరువురి మధ్య చర్చలు జరిపి వారించినట్లు తెలుస్తోంది. దీంతో రాయచోటిని వదలి, కడప పార్లమెంటు వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులేసిన వాసు... తెలుగుదేశం పార్లమెంటు సీటు కోసం వాసు వ్యూహాత్మకంగా అడుగులు వేసి సఫలీకృతుడయ్యాడని పలువురు పేర్కొంటున్నారు. ఆ మేరకే సీనియర్ నేతల్ని కాదని ఆయనకు పార్టీ టికెట్ దక్కినట్లు భావిస్తున్నారు. కీలెరిగి వాత పెట్టాలనే విధంగా చంద్రబాబు ఆయువు పట్టును పట్టుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు కోటరీని మేనేజ్ చేయడంతో టీడీపీలో సభ్యత్వమే లేని శ్రీనివాసులరెడ్డి సునాయాసంగా కడప పార్లమెంటు టికెట్ దక్కించుకున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కోటరీ సూచనల మేరకు రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డిలను కాదని టికెట్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ తతంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్న దివంగత రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సన్నిహితులు సైతం నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. రాయచోటి పరిధిలోని లక్కిరెడ్డిపల్లెకు చెందిన వాసు కడప పార్లమెంటు పరిధివాసి కాకపోయినా పార్టీ టికెట్ దక్కించుకోవడం వెనుక అదనపు అర్హత డబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.