ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య | another murder in proddatur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య

Published Mon, Jun 5 2017 12:20 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య - Sakshi

ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య

► బాకీ చెల్లించాలని అడిగినందుకు కత్తితో పొడిచిన కటిక వ్యాపారి
► మృతి చెందిన లారీ యజమాని శ్రీనివాసులరెడ్డి


ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలో సంచలనం సృష్టించిన మారుతి ప్రసాద్‌రెడ్డి హత్య మరువక ముందే మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాకీ డబ్బు చెల్లించాలని అడిగినందుకు టీచర్స్‌ కాలనీకి చెందిన ఉండేల శ్రీనివాసులరెడ్డి (48)ని కటిక వ్యాపారి అమర్‌నా«థ్‌ అనే వ్యక్తి ఆదివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో ఉన్న టీచర్స్‌ కాలనీకి చెందిన శ్రీనివాసులరెడ్డి రిలయన్స్‌ పెట్రోల్‌ బంకు కూడలిలో టీ దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆ టీ దుకాణం పక్కనే మత్స్య కాలనీకి చెందిన అమర్‌నాథ్‌ కటిక అంగడి ఉండేది. అప్పుడప్పుడు అమర్‌నాథరెడ్డి చేతి బదులుగా  శ్రీనివాసులరెడ్డి దగ్గర  అప్పు తీసుకొనేవాడు

వాగ్వాదానికి దిగి..
20 రోజుల క్రితం శ్రీనివాసులరెడ్డి వద్ద అమర్‌నాథ్‌ రూ.30 వేలు తీసుకున్నాడు. డబ్బు ఇవ్వాలని శ్రీనివాసులరెడ్డి రోజూ అడుగుతున్నా అతను రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఆదివారం డబ్బు కావాలని శ్రీనివాసరెడ్డి గట్టిగా అడగటంతో అందరూ చూస్తుండగానే అమర్‌నాథ్‌ మాంసం కోసే కత్తి తీసుకొని గుండెల్లో పొడవడంతో ప్రధాన రోడ్డుపై కుప్ప కూలి పోయాడు. తీవ్ర రక్తస్రావం అయిన అతన్ని స్థానికులు వెంటనే ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఓబులేసు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement