బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ నిరసన | ysrcp protests against bauxite digging | Sakshi
Sakshi News home page

బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ నిరసన

Published Fri, Dec 11 2015 5:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

ysrcp protests against bauxite digging

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భూపాల్ రెడ్డి, మారుతి నాయుడుతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement