
'పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం'
విశాఖపట్నం: బాక్సైట్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై పవన్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న పాడేరు నియోజకవర్గంలోని చింత పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఈశ్వరి తెలిపారు.