giddi eshwari
-
నమ్మక ద్రోహులు..
నమ్మక ద్రోహం పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వీరికి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధిచెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా గిరిజనులంతా వైఎస్సార్సీపీ వైపే నిలిచారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతదీ అదే పరిస్థితి. ఎన్నికైన నాటి నుంచి ఆమె వైఎస్సార్సీపీ ఆశయాలకు తిలోదకాలిచ్చి.. ఆర్థికంగా ఎదిగేందుకు.. కేసుల్లోంచి బయటపడేందుకు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్న వీరికి గిరిజనులు మళ్లీ ఓటుతో బుద్ధి చెప్పనున్నారు.సాక్షి, పాడేరు: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత.. వీరు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కలి ్పంచారు. 2014 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదు. వ్యక్తిగత ఎదుగుదలను ఆశించిన వీరు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి నమ్మక ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పాడేరు అసెంబ్లీకి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈఎన్నికల్లో గిరిజను లు ఓటుతో తగిన గుణపాఠం చెప్పి తాము జగనన్న వెంటే ఉన్నామని మళ్లీ నిరూపించారు. ‘గిడ్డి’ చేరికతో గ్రూపుల మయం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరికతో పాడేరు అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. ఆది నుంచి పారీ్టలో ఉన్నవారిని పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు ఆమె తెరలేపారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీనియర్లంతా ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే వారంతా బహిరంగంగా ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్యాకేజీ..ప్రలోభాలకు లోనై వైఎస్సార్సీపీని వీడారని అప్పట్లో ఆమెపై జోరుగా ప్రచారం సాగింది. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి నమ్మక ద్రోహం చేయడం.. టీడీపీలో సీనియర్లకు ఝలక్ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ఆమెకు నష్టం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరిక వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫొటోతో 2014లో పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీకి ద్రోహం చేశారు. 2015లో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆమె చింతపల్లి వద్ద అప్పటి సీఎం చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరించడం అప్పటిలో సంచలనమైంది. తరువాత ఆమె అదే పార్టీలో చేరడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ► ఆర్థిక, రాజకీయ అవసరాలకు తలొగ్గిన ఈశ్వరి 2017 నవంబర్‌లో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వంలో రాజకీయంగా లబ్ధి పొందినప్పటికీ గిరిజనుల ఆదరణ కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్షి్మకి పోటీ ఇవ్వలేకపోయారు. కేసు నుంచి తప్పించుకునేందుకు.. అరకు మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 2014 ఎన్నికల తరువాత నకిలీ ఎస్టీ కేసును ఎదుర్కొన్నారు. ఎస్టీలోని వాలీ్మకి కులస్తురాలని వైఎస్సార్సీపీని నమ్మించి 2014లో అరకు పార్లమెంట్ సీటు పొందారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో గిరిజనులు ఆమెను 91,398 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అరకు ఎంపీ గీత ఎస్టీ కాదని ఆమెపై కోర్టులో కేసు వేశారు. ఆమె ఎస్టీ కాదని, నకిలీ ధ్రువపత్రంతో చదువులు, ఉద్యోగం, పదవులను అక్రమంగా అనుభవించారని ఆధారాలు చూపిస్తూ సంధ్యారాణి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 2015లో టీడీపీకి చేరువైంది. ఈమెపై కోర్టులో కేసు పెట్టిన సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. కేసునుంచి బయట పడేందుకే టీడీపీతో చేతులు కలిపారన్న విమర్శలను ఆమె ఎదుర్కొన్నారు. బ్యాంక్నుమోసగించారని.. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో భర్తతోపాటు ఆమెకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. బ్యాంకును మోసగించి రూ.42 కోట్ల మేర రుణం పొందారన్నది వారిపై అభియోగం. ► తెలంగాణలోని రాయదుర్గం సమీపంలో వందెకరాల భూవివాదంలో ఆమె పాత్రపై కేసు నడుస్తోంది. గిరిజన సంక్షేమానికి దూరంకొత్తపల్లి గీత ఎంపీగా ఉన్న సమయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించారు. ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులకు కూడా ద్రోహం చేశారు. టీడీపీతో అవసరం తీరాక సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీని పెట్టారు. 2019లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం 1500 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. ఆ తరువాత ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్న ఆమె వారి సహకారంతో బీజేపీ నేతగా మారారు. ఇప్పుడు అరకు ఎంపీ అభ్యర్థిగా ఆ పారీ తరఫున బరిలో ఉన్నారు. టీడీపీ వ్యవహారాల్లో కూడా ఆమె తలదూర్చుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి ద్రోహం చేసిన వీరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మళ్లీ గతంలో మాదిరిగా అదే ఫలితం ఎదురుకానుంది. -
గిడ్డి ఈశ్వరిని హెచ్చరించిన మావోయిస్టులు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద గత నెల 23న దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖ విడుదల చేశారు. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయినందునే కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసినందునే సివేరి సోమలను హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాన పత్రికల సంపాదకుల పేరిట మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మంగళవారం రాత్రి ఈ లేఖను విడుదల చేసింది. ‘‘గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులైన కిడారి, సివేరి సోమలను సెప్టెంబర్ 23న ప్రజాకోర్టులో శిక్షించాం. గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించినా అధికారపార్టీకి తొత్తులుగా మారి మా హెచ్చరికలను లెక్క చేయకపోవడమేగాక బాక్సైట్ తవ్వకాలకు లోలోపల ప్రభుత్వానికి సహకరించినందువల్లే శిక్షను అమలు చేశాం. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయిన ప్రజాద్రోహి కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసిన సివేరిలను కఠినంగా శిక్షించాం. ప్రజల సమక్షంలోనే వారు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. అందుకే శిక్షలను అమలు చేశాం..’’ అని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. పోలీసునుద్దేశించి మావోయిస్టులు లేఖలో ప్రస్తావిస్తూ.. ‘‘ఆరోజు పోలీసు సోదరులు మాకు ఆయుధాలతో చిక్కినా వారిని చంపలేదు. పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తున్నారని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాం. అదే మా విప్లవ సోదరులు మీకు దొరికితే దొంగకథలల్లి వాళ్లను నిస్సహాయులను చేసి ఎన్కౌంటర్ చేస్తారు కదా! మరి మీరు మా మాదిరి చేయగలరా? ఆలోచించండి..’’ అని కోరారు. మావోయిస్టులు విడుదల చేసిన బహిరంగ లేఖ రూ.20 కోట్లకు అమ్ముడుబోయిన గిడ్డి మాకు నీతులు చెప్పడమా? ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికారపార్టీకి తొత్తు అయిన గిడ్డి ఈశ్వరి తమను నిందించడమేంటని మావోయిస్టులు మండిపడ్డారు. రూ.20 కోట్లకు అధికారపార్టీకి అమ్ముడుపోయిన నువ్వు మాకు నీతులు చెప్పడమా? అని ధ్వజమెత్తారు. ‘ప్రజాకోర్టులో కిడారి నీ విషయంపై నిజం చెప్పాడు. నీకందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచి క్షమాపణలు చెప్పాలి. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలి. లేదంటే నీకూ కిడారి, సోమలకు పట్టిన గతే పడుతుంది. మేము చెప్పినట్లు చేస్తావు కదా! లేదంటే మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా.. ఆలోచించుకో’’ అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు చేశారు. -
డ్యామ్‌షూర్‌గా వైఎస్సార్సీపే గెలుస్తుంది: గిడ్డి ఈశ్వరి
సాక్షి, అమరావతి: డ్యామ్‌షూర్ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది.. అధికార పార్టీ టీడీపీ గూటికి చేరిన తర్వాత పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్న వ్యాఖ్యలివి. జగనన్న అంటే తనకు ప్రాణమని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగనన్నే అని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఆమె.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేరీతిలో వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నందుకు బాధపడుతున్నానని ఆమె చెప్పారు. ఆత్మాభిమానం చంపుకొని టీడీపీలో చేరుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే గెలుస్తుందని ఆమె చెప్పారు. గతంలో బాక్సైట్ విషయంలో తల నరుకుతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో విశాఖ జిల్లా రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె వెంట ఉన్న నేతలు అవాక్కయ్యారు. -
‘ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది’
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెలోనూ మార్మోగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తానన్న అరుణ్‌జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి స్వాగతించిన మహాఘనుడు చంద్రబాబు అని ఆమె మండిపడ్డారు. ‘చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఆ రోజు ఏపీకి ఐదేళ్ల కాదు పదేళ్లు ఇవ్వాలని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు హోదా వద్దు, ఆర్థిక ప్యాకేజీ చాలు అని ద్రోహం చేస్తున్నారు. హోదా విషయంలో రాత్రికి రాత్రే చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు. తనకు, తన కొడుకుకు దోచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్యాకేజీని స్వాగతిస్తున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన ఓ అబద్ధాల పుట్ట. ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న గిరిజనులకు ఉచితంగా కందిపప్పు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా కిలో రూ. 40 చొప్పున నాసిరకం కందిపప్పు అందిస్తున్నారు’ అని ఆమె అన్నారు. ‘ చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి కులరాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప.. ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు. హోదా ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేస్తున్న నేత వైఎస్ జగన్‌కు ప్రజలు అండగా ఉండాలని ఆమె కోరారు. లోకేశ్‌కు మంత్రి హోదా కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రత్యేక హోదా పోరాటాన్ని ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. -
‘ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది’
-
'పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం'
విశాఖపట్నం: బాక్సైట్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై పవన్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న పాడేరు నియోజకవర్గంలోని చింత పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఈశ్వరి తెలిపారు.