విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హెచ్చిరించారు. జీవో రద్దుకై మే నెలలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏజెన్సీలో పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం మైనార్టీలను మోసగిస్తోందని, అసలు మైనార్టీ మంత్రే లేకుండా వారికి ఫలాలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు.
ఆదివారం విశాఖలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీల న్యాయ సాధికారత యాత్రను రఘువీరా ప్రారంభించారు. బీఆర్ అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘువీరా మాట్లాడారు. ఈ యాత్ర ఏప్రిల్ 25న కర్నూలులో ముగుస్తుందన్నారు. యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 125 అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
అసలు మంత్రే లేకపోతే ఎలా: రఘువీరా
Published Sun, Mar 20 2016 3:44 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement
Advertisement