![Congress Alliance With TDP Is A Rumour Said By Raghuveera Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/27/ram1.jpg.webp?itok=g4S0SFgX)
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి(పాత చిత్రం)
అమరావతి : టీడీపీతో పొత్తు అనేది రూమర్ అని, పొత్తుల విషయం గురించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చూసుకుంటారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తెలిపారు. సీడబ్ల్యుసీ మీటింగ్‌లో ఏపీ ప్రత్యేక హోదా అంశం మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇచ్చిన హామీ వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, వేరే రాష్ట్రంతో పోల్చుకోవద్దని, సోనియా, రాహుల్ అన్నట్లు తెలిపారు. ఈ విషయంపై సోనియా, రాహుల్ గాంధీలకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌కి ఇస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, కేకే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పదుల సార్లు చెప్పారని, కానీ ఇప్పుడు ఇద్దరు చంద్రులు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. గట్టిగా అడగొద్దని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా చెప్పి ఉంటారని అందుకే కేసీఆర్ అలా అంటున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment